Gangubai Movie Review: ఎప్పుడెప్పుడా అని ఎదుచుచూస్తున్నా గంగుబాయ్ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ ఈ రోజు ఫిబ్రవరీ 25న రిలీజ్ అయింది. ఊహించినట్టుగానే చిత్రానికి ఎక్కడ చూసినా సరే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. క్రిటిక్స్ సై ఈ మూవీ అద్భతంగా ఉందంటూ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకే సారి రిలీజ్ కావడం విశేషం. అలియా భట్, విజయ్ రాజ్ యాక్టింగ్ ను ప్రశంసించని ప్రేక్షకుడు ఒక్కడు కూడా లేడు. గంగుబాయ్ రివ్యూ గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం.
గంగుబాయ్ సినిమా కథ
గుంగుబాయ్ సినిమా ఓ బయోపిక్ మూవీ. మహారాష్ట్రలోని కామటిపురాలో గుంగుబాయ్ చాలా పాపులర్ పర్సనాలిటీ. ఆమె జివితాన్ని పూర్తిగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు సంజయ్ లీలా భన్సాలి. అలియా భట్ గంగుబాయ్ పాత్రలో పూర్తిగా జీవించిందని చెప్పవచ్చు. కామటిపురాలో వేశ్య స్థాయి నుంచి పవర్ఫుల్ లీడర్ గా గంగుబాయ్ ఎలా ఎదిగిందనేదాన్ని ఈ సినిమాలో చూపించారు సంజయ్ లీలా భన్సాలి.
గంగుబాయ్ నటీనటులు
గంగుబాయ్ కథియావాడి సినిమా స్క్రీన్ ప్లేను సంజయ్ లీలా భన్సాలి, ఉత్కర్షిని వశిష్ట రాశారు. సంజయ్ లీలా భన్సాలి ఈ మూవీని తెరకెక్కించారు. జయంతిలాల్ గడ, సంజయ్ లీలా భన్సాలి కలిసి ఈ చిత్రాన్ని భన్సాలి ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్స్ పై నిర్మించారు. సంచిత్ బల్హారా సంగీతాన్ని సమకూర్చగా సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు, సంజయ్ లీలా భన్సాలి ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు. అలియా భట్, విజయ్ రాజ్, శంతను మహేశ్వరి, అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రలు పోషించారు.
సినిమా పేరు | గంగుభాయ్ కథియావాడి |
నటీనటులు | అలియా భట్, విజయ్ రాజ్, శంతను మహేశ్వరి, అజయ్ దేవ్గన్ |
దర్శకులు | సంజయ్ లీలా భన్సాలి |
నిర్మాత | జయంతిలాలడ్ గాడ, సంజయ్ లీలా భన్సాలి |
సంగీతం | సంచిత్ బల్హారా |
సినిమాటోగ్రఫీ | సుదీప్ చటర్జీ |
బ్యానర్ | భన్సాలి ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్ |
గంగుబాయ్ ఎలా ఉందంటే?
అలియా భట్ నటన అద్భతంగా ఉంది. ఈ సినిమాను మూవీ లవర్స్ ఒక్కసారైనా తప్పకుండా చూడాలి. కథ, సినిమాటోగ్రఫీ కూడా మూవీ బాగా రావడానికి చాలా దోహదపడ్డాయి. కథ, నటన, సంగీతం, డైలాగ్స్ ఇలా అన్ని 24 ఫ్రేములు అద్భుతంగా వచ్చాయని చెప్పుకోవచ్చు. గంగుభాయ్ సినిమా చూడకపోతే ఓ మంచి చిత్రాన్ని మిస్ అయినట్టేనని అనుకోవచ్చు.