Aadavallu Meeku Johaarlu Movie Review: ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ రివ్యూ

Aadavallu Meeku Joharlu Movie Review: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు థియేటర్లలో ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. రిలీజ్ కు ముందు నుంచే ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని ఊహించారు. అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. 2022లో వచ్చిన మంచి ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు అని చెప్పుకోవచ్చు” ఈ సినిమా రివ్యూకి సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం.

Aadavallu Meeku Joharlu Movie Review

కథ

కథ విషయానికి వస్తే.. శర్వానంద్ ఓ పెళ్లి కాని “చిరు” పాత్రలో కనిపిస్తాడు. అతనికి పెళ్లి చేయడానికి వాళ్ల కుటుంబ సభ్యులు అనేక సంబంధాలు చూస్తారు. అయితే ఎక్కడా సెట్ అవదు. చివరికి ఓ సంబంధం కుదురుతుంది. ఆ సంబంధం ఆడపిల్లగా ఆద్య పాత్రలో రష్మికా మందన, ఆమె తల్లిగా కుష్బు నటించారు. అయితే ఆద్య కుటుంబం వాతావరణం, పెళ్లి తర్వాత ఆద్య తల్లి చెప్పే రూల్సు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. అప్పటి నుంచి ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. చివరికి ఏమైందో తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

నటీనటులు

కిశోర్ తిరుమల ఈ మూవీని రచించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. శర్వానంద్, రష్మికా మందన, ఖుష్బు, రాధికా శరత్ కుమార్, ఊర్వశి ప్రధాన పాత్రలో నటించారు. వెన్నెల కిశోర్, రవి శంకర్, ప్రదీప్ రావత్, సత్య, గోపరాజు రమణ, బెనర్జీ, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నైరి సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు.

ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ రివ్యూ (Aadavallu Meeku Johaarlu Movie Review)

సుధాకర్ చెరుకూరి ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్ బ్యానర్స్ పై నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీని, ఎ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.

మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు
దర్శకత్వంకిశోర్ తిరుమల
నటీనటులుశర్వానంద్, రశ్మిక మందన, ఖుష్బు, రాధికా శరత్ కుమార్, ఊర్వశి
ప్రొడ్యూసర్సుధాకర్ చెరుకూరి
సంగీతందేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీసుజిత్ సారంగ్
ఎడిటింగ్ఎ. శ్రీకర్ ప్రసాద్

 

సినిమా ఎలా ఉందంటే

మొత్తం ఫ్యామిలీ కలిసి చూడదగ్గ మంచి సినిమా. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కడుపుబ్బా నవ్వించే సీన్లు అనేకం ఉన్నాయి. స్టోరీ, డైలాగ్స్ చాలా కొత్తగా ఉన్నాయి. శర్వానంద్ యాక్టింగ్ ఈ మూవీకి మంచి ప్లస్ అయింది. ఖుష్బు, రాధికా, ఊర్శశి లాంటి సీనియర్ హీరోయిన్లు ఒక్క సినిమాలో కనపడడం మూవీ లవర్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది.

మూవీ రేటింగ్ : 3.5

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు