Radhe Shyam Movie Review: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటింగ్ ప్యాన్ ఇండియన్ మూవీ రాధే శ్యామ్ ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా తెలుగు, తమిళ్, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ రోజు మార్చ్ 11న పెద్ద పండగనే చెప్పుకోవచ్చు. అనేక వాయిదాల తరువాత, రాధేశ్యాం థియేటర్లలో రిలీజ్ అయింది. రాధే శ్యామ్ పైన అందరికీ భారీ అంచానాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే దర్శకుడు ఎక్కడా తగ్గకుండా మూవీని తెరకెక్కించారు.
కథ
రాధే శ్యామ్ ఒక రొమాంటిక్ ఫ్యాంటసీ చిత్రం. ఈ మూవీలో ప్రభాస్ జ్యోషిష్యం చెప్పె విక్రమాదిత్య పాత్రలో నటిస్తాడు. పూజా హెగ్డే డాక్టర్ ప్రేరణగా కనిపిస్తుంది. ప్రపంచంలోనే టాప్ జ్యోతిష్యుల్లో ఒకరిగా విక్రమాదిత్య ఎదుగుతాడు. ఎవ్వరి చెయ్యి చూసైనా సరే వారి జాతకం, భవిష్యత్తును ఇట్టే చెప్పేస్తాడు. రెండవసారి చూడడు.
అయితే అదే జ్యోతిష్యం విక్రమాదిత్యకు చేదును చవిచూపిస్తుంది. భవిష్యత్తులో తాను ప్రేమించిన ప్రేరణ దూరమవుతుందని గ్రహిస్తాడు. అది తప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాడు. చివరిగా విక్రమాదిత్య విజయం సాధిస్తాడు, తన ప్రేమను కాపాడుకుంటాడా అనేది మెయిన్ కాన్సెప్ట్.
నటీనటులు
రాధేశ్యాం సినిమాకు రాధా క్రిష్ణ కథ రచన చేయడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషించారు. భాగ్యశ్రీ, క్రిష్ణం రాజు, సత్యరాజ్, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, మురలి షర్మ, కున్నల్ రాయ్ కపూర్, సత్యన్, జయరాం, ఫ్లోరా జాకబ్, సాష చెత్రి సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు.
భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదా కలిసి ఈ మూవీని టిసిరీస్, యూవీ క్రియేషన్ బ్యానర్స్ పై నిర్మించారు. ఎస్ తమన్, సంచిత్ బాత్రా, జస్టిన్ ప్రభాకరన్, మితూన్, అమాల్ మలిక్ కలిసి దీనికి సంగీతాన్ని సమకూర్చారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేయగా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.
సినిమా పేరు | రాధే శ్యాం |
దర్శకుడు | రాధా క్రిష్ణ కుమార్ |
నటీనటులు | ప్రభాస్, పూజా హెగ్డే, భాగ్యశ్రీ, క్రిష్ణం రాజు, సత్యరాజ్, జగపతి బాబు |
నిర్మాతలు | భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదా |
సంగీతం | ఎస్ తమన్, సంచిత్ బాత్రా |
సినిమాటోగ్రఫీ | మనోజ్ పరమహంస |
మూవీ ఎలా ఉందంటే
రాధే శ్యాంను ప్రతీ ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. కుటుంబ సమేతంగా వెళ్లి మిస్ కాకుండా చూడాలి. ఉహించిన దానికంటే దర్శకుడు ఈ మూవీని మరింథ అద్భుతంగా తెరకెక్కించారు. జ్యోతిష్యంలో ఇన్ని విషయాలు ఉంటాయని రాధేశ్యాం చూసిన తరువాతే నాకు తెలిసింది. బోర్ పదాన్ని పక్కన బెడితే, రాధే శ్యాంను10 సార్లు కూడా చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు.
మూవీ రేటింగ్ : 4.5 / 5