ET Movie Review: ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న సూర్య ఈటీ సిినమా ఎట్టకులకు థియేటర్లలో గ్రాండ్ గా తెలుగు, తమిళ్, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. మహిళలలకు ఎలా భరోసాని, భద్రతను కల్పించాలో ఈ మూవీ ద్వారా దర్శకుడు అద్భుతంగా చెప్పాడు. స్త్రీల సమస్యలపై పోరాటే పాత్రలో కన్నభిరన్ గా సూర్య అద్భుతంగా నటించారు. ఈటీ సినిమాను పండిరాజ్ రచించడంతో పాటు ఆయకే దీనికి దర్శకత్వం వహంచారు.
కథ
ఈటీ సినిమా మొత్తం యాక్షన్ ప్యాక్డ్ చిత్రం అని చెప్పుకోవచ్చు. లాయర్ కన్నభిరాన్ గా సూర్య ప్రధాన పాత్రను పోషించాడు. ప్రియాంక అరుల్ మోహన్ ఆయన భార్య ఆధిని కన్నబిరాన్ గా నటించింది. ఈ సినిమాలో మెయిన్ విల్ ఇన్బా పాత్రలో వినయ్ రాయ్ నటించారు. స్త్రీలను కించపరుస్తూ, తక్కువచేసి వాళ్లను హింసిస్తుంటాడు ఇన్బా. దీన్ని వ్యతిరేకిస్తూ కన్నబిరాన్ మహిళలు పక్షాన నిలబడతాడు. కథ మొత్తం ఈ కాన్సప్ట్ చుట్టే తిరుగుతుంటుంది.
ఈటీ మూవీ నటీనటులు
పండిరాజ్ ఈ మూవీని రచించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. కలానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై దీన్ని నిర్మాంచారు. సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, వినయ్ రాయ్, సత్యరాజ్, రాజకిరన్ ప్రధాన పాత్రలో నటిస్తారు.
డి ఇమ్మాన్ సంగీతాన్ని సమకూర్చగా, ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫిీని హ్యాండిల్ చేశారు. రుబెన్ ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.
సినిమా పేరు | ఈటీ |
దర్శకుడు | పండిరాజ్ |
నటీనటులు | సూర్య, ప్రియాంక్ అరుల్ మోహన్, వినయ్ రాయ్, సత్యరాజ్, రాజ్ కిరణ్ |
నిర్మాతలు | కళానిధి మారన్ |
సంగీతం | డి. ఇమ్మన్ |
సినిమాటోగ్రఫీ | ఆర్. రత్నవేలు |
సినిమా ఎలా ఉందంటే?
2022 లో వచ్చిన మంచి మెసెజ్ ఓరియంటడ్ సినిమా ఈటీ. అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. జైభీమ్ ఎంత మంచి చిత్రమో ఈ ఈటీ కూడా అంతే మంచి సినిమా. మహిళల హక్కులను, గౌరవాన్ని కాపాడే లాయర్ గా సూర్య అద్భుతంగా నటించారు. సౌత్ ఇండియాలో ఇలాంటి సందేశాత్మక చిత్రాలను చెయ్యాలంటే అది సూర్యకే సాధ్యం.