Pelli SandaD OTT Release Date: పెళ్లి సందడి ఓటిటి రిలీజ్ డేట్ కంఫర్మ్ అయింది. Disney Hotstar లో December 19న స్ట్రీమ్ చేయడానికి మూవీ మేకర్స్ సన్నద్ధమయ్యారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక, శ్రీలీల నటించిన ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ హిట్ అయినా విషయం తెలిసిందే. 1996 లో రాఘవేందర్ రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి ఆ కాలంలో బంపర్ హిట్ అయి కోట్లు కాలేచ్ట్ చేసింది. దానికి సీక్వెల్ గా డైరెక్టర్ గౌరీ రోణంకి ఈ సినిమాని తెరకెక్కించారు. అక్టోబర్ 15, 2021న థియేటర్స్ లో పెళ్లిసందడి రిలీజ్ అయింది. డాన్స్, రొమాంటిక్ sequence, స్క్రీన్ప్లే అద్భుతంగా సాగింది.
పెళ్ళి సందడి ఓటిటి రిలీజ్ డేట్ (Pelli SandaD OTT Release Date)
Pelli SandaD OTT Release Date: డిసెంబర్ 19, 2021
Pelli SandaD OTT Platform: Disney Hotstar
థియేటర్స్ లో ఈ సినిమా ఇప్పటికే 10 కోట్ల కలెక్షన్స్ రాబట్టుకుంది. ఇక కధ విషయానికి వస్తే.. వశిష్ట (రోషన్ మేక) ద్రోణాచార్య అవార్డు అందుకున్న బాస్కెట్ బాల్ ప్లేయర్, తన లవ్ స్టోరీ ని రాజేంద్ర ప్రసాద్ కి వినిపించడంతో స్టార్ట్ అవుతుంది. వశిష్ట, సహస్రతో (శ్రీలీల) లవ్ లో పడతాడు, ఇద్దరు ఘాడంగా ప్రేమించుకుంటారు. అయితే సహస్ర తండ్రి ప్రకాష్ రాజ్ ఆమె పెళ్లిని వెన్నెల కిశోర్ తో నిర్ణయిస్తారు. ఎలా సహస్ర, వశిష్ఠ ప్రేమ గెలుస్తుందోననేది ఈ మూవీ కోర్ కాన్సెప్ట్.
రాఘవేంద్ర రావు సమక్షంలో గౌరీ రోణంకి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. రోషన్, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించగా.. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి, అన్నపూర్ణ, సత్యం రాజేష్ ఇంకా మరికొందరు సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. ఎం. ఎం కీరవాణి సంగీతాన్ని అందించగా, సునీల్ కుమార్ నమ కెమెరాకి వర్క్ చేశారు. మాధవి కోవెలమూడి, శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి ఈ మూవీని ఆర్కే ఫిలిం అసోసియేట్స్ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో నిర్మించారు.
ఇవి కూడా చూడండి:
- Sky Lab Movie Review: స్కైలాబ్ మూవీ రివ్యూ
- Akhanda Movie Dialogues in Telugu: అఖండ మూవీ డైలాగ్స్
- Akhanda OTT release date: అఖండ ఓటిటి రిలీజ్ డేట్
- Akhanda 1st day collection: అఖండ మొదటి రోజు కలెక్షన్