Clap Movie Review: క్లాప్ మూవీ రివ్యూ

Clap Movie Review: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ క్లాప్ ఎట్టకేలకు సోనీలివ్ ఓటీటీ ఫ్లాట్ఫారంలో నేరుగా మార్చ్ 11న తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలైంది. తొలి రోజే ఈ చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగులో వచ్చిన అనేక మంచి స్పోర్ట్స్ డ్రామా చిత్రాల్లో ఈ క్లాప్ మూవీ కూడా నిలిచిపోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను మనము తెలుసుకుందాం.

Clap Movie Review

కథ

క్లాప్ ఒక స్పోర్ట్స్ డ్రామా చిత్రం. ఆది పినిశెట్టి ఒక అథ్లెట్ గా ప్రధాన పాత్రపోషిస్తాడు. యాక్సిడెంటల్ గా అతని ఒక కాలు పోతుంది. ఇక ఎప్పటికీ పరిగెత్తలేదు. అప్పుడే అతనికి ఓ అమ్మాయిలో మంచి అథ్లెట్ లక్షణాలు కనిపిస్తాయి. ఆమెను ఓ సక్సస్ ఫుల్ అథ్లెట్ గా ఎలా తయారు చేస్తారనేది ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్.

క్లాప్ మూవీ నటీనటులు

ఆదిపినిశెట్టి, ఆకాంక్షసింగ్, క్రిష కురూప్ ప్రధాన పాత్రలు పోషించారు. బ్రహ్మాజీ, నాజర్, ప్రకాశ్ రాజ్, మైమ్ గోపి, మునిష్కాంత్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. ప్రిథ్వి ఆదిత్య ఈ మూవీని రచించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు.

రామాంజనేయులు జవ్వాజి, ఎం రాజశేఖర్ రెడ్డి ఈ మూవీని బిగ్ ప్రింట్ పిక్చర్ బ్యానర్స్ పై నిర్మించారు. మ్యూజికల్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చగా, ప్రవీన్ కుమార్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు, రగుల్ ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.

సినిమా పేరుక్లాప్
దర్శకుడుప్రిథ్వి ఆదిత్య
నటీనటులుఆదిపినిశెట్టి, ఆకాంక్షసింగ్, క్రిష కురూప్ ప్రధాన పాత్రలు పోషించారు. బ్రహ్మాజీ, నాజర్, ప్రకాశ్ రాజ్, మైమ్ గోపి, మునిష్కాంత్
నిర్మాతలురామాంజనేయులు జవ్వాజి, ఎమ్ రాజా శేఖర్ రెడ్డి
సంగీతంఇళయరాజా
సినిమాటోగ్రఫీప్రవీణ్ కుమార్

 

సినిమా ఎలా ఉందంటే?

క్లాప్ ఓ మంచి స్పోర్ట్స్ డ్రామా చిత్రం. ఆదిపినిశెట్టి యాక్టింగ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. కథ కూడా బ్రహ్మాండంగా ఉంది. కుటుంబ సమేతంగా చూడతగ్గ సినిమా క్లాప్ మూవీ. డైలాగ్స్ మరింత బాగా రాసి ఉంటే బాగుండేది.

మూవీ రేటింగ్ : 3.5 / 5

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు