Nallamala Movie Review: బిగ్ బాస్ ఫేమ్ అమిత్ తివారి ప్రధాన పాత్రలో నటించిన నల్లమల మూవీ ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఊహించినట్లుగానే సినిమా మంచి టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఇప్పటి వరకు సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసిన అమిత్ తివారి ఈ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడని అనుకోవచ్చు. రవి చరణ్ ఈ మూవీకి కథను రచించి ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ రివ్యూకు సంబంధించిన మరిన్ని విశేషాలను మనము ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
కథ
నల్లమల్ చిత్రం ఓ కంప్లీట్ యాక్షన్ డ్రామా చిత్రంగా చెప్పుకోవచ్చు. అడవి, ఊళ్ల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. అమిత్ తివారి పశువుల కాపరి పాత్రలో నటిస్తాడు. భాను శ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. అడవిలో ఉన్న సంపదను కాజేయడానికి కొందరు క్రిమినల్స్ ప్లాన్ వేస్తారు. వారి ప్లాన్ ను ఎలా అమిత్ తివారి తిప్పికొట్టాడనేదే ఈ మూవీ ప్రధాన కాన్సెప్ట్.
నల్లమల సినిమా నటీనటులు
అమిత్ తివారి, భాను శ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. నాజర్, తనికెళ్ల భరని, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, శవర్ అలి, ఛత్రపతి శేఖర్, కాశి విశ్వనాథ్, చలాకి చంటి, ముక్కు అవినాశ్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. రవి చరణ్ ఈ మూవీకి కథ మాటలు అందించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. ఆర్ఎం ఈ మూవీని నమో క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. పీఆర్ సంగీతాన్ని సమకూర్చగా, వేణు మురళి సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.
సినిమా పేరు | నల్లమల |
దర్శకుడు | రవి చరణ్ |
నటీనటులు | అమిత్ తివారి, భాను శ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, |
నిర్మాతలు | ఆర్.ఎం |
సంగీతం | పీఆర్. |
సినిమాటోగ్రఫీ | వేణు మురళి |
సినమా ఎలా ఉందంటే?
నల్లమల చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ అద్భుతంగా తెరకెక్కించారు. డైలాగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీకి ప్లస్ పాయింట్స్ ఇవ్వచ్చు. అమిత్ తివారి నటన కూడా బాగుంది. ఫ్లాప్ అయిన పెద్ద సినిమాలు చూడడం కంటే ఈ సినిమా చూస్తే మంచి కిక్ వస్తుంది. కుటుంబ సమేతంగా చూడతగ్గ సినిమా నల్లమల