Director Movie Review: ఆషిష్ గాంధీ ప్రధాన పాత్రలో నటించిన డైరెక్టర్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇటీవల్ ఉనికి, నాటకం చిత్రాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్న ఆశిశ్ గాంధీ మరో సారి మంచి సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఊహించినట్లుగానే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఆశిష్ గాంధి, ఐశ్వర్య రాజ్ భకుని ప్రధాన పాత్రలను పోషించారు. కిరణ్ పొన్నాడ, కార్తిక్ క్రిష్ణ కలిసి దీనికి దర్శకత్వం వహించారు.
కథ
డైరెక్ట్ మూవీ ఓ థ్రిల్లర్ డ్రామా అని చెప్పుకోవచ్చు. మంచి డైరెక్టర్ కావాలనుకునే పాత్రలో ఆశిశ్ గాంధీ ప్రధాన పాత్రను పోషిస్తారు. ఐశ్వర్య రాజ్ భకుని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఆశిశ్ గాంధీ ఎంతో మందికి తను రాసుకున్న కథను వివరిస్తాడు, ఎలా దర్శకత్వం చేయాలో చెబుతుంటాడు.. అయితే ఈ క్రమంలోనే కొన్ని సంఘటనల ద్వారా కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. కొన్ని హాలుసినేషన్స్ ను ఆశిశ్ గాంధీ లోనవుతాడు.
డైరెక్టర్ మూవీ నటునటులు
ఆశిష్ గాంధీ, ఐశ్వర్య రాజ్ భకుని ఇందులో ప్రధాన పాత్రలను పోషించారు. మైరినా సింగ్, కార్తిక్ శివ, అంట్ర రౌత్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. కిరణ్ పొన్నాడ, కార్తిక్ క్రిష్ణ కలిసి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ దీపాల, నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను విజన్ సినిమాస్ బ్యానర్ పై నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతాన్ని సమకూర్చగా, ఆదిత్య వర్ధన్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. బి. నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.
సినిమా పేరు | డైరెక్టర్ |
దర్శకుడు | కిరణ్ పొన్నాడ, కార్తిక్ క్రిష్ణ |
నటీనటులు | ఆశిశ్ గాంధీ, ఐశ్వర్య భకుని, మైరినా సింగ్, కార్తిక్ శివ, అంత్ర రౌత్ |
నిర్మాతలు | శ్రీకాంత్ దీపాల, నాగం తిరుపతి రెడ్డి |
సంగీతం | సాయి కార్తిక్ |
సినిమాటోగ్రఫీ | ఆదిత్య వర్దన్ |
సినిమా ఎలా ఉందంటే?
చిన్న బడ్జెట్ తో దర్శకులు అద్భుతంగా మూవీని త్రిల్లింగ్ తెరకెక్కించారు. సినిమాను ఓ సారి చూడవచ్చు. స్క్రిప్ట్, డైరెక్షన్ మరింత బాగా చేసి ఉంటే బాగుండేది. నటన నటనలా ఉండకూడదు అని ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు. నటీనటులు రియాలిటీలో ఉన్నట్లుగా నటించలేదు. అయినా కూడా డైరెక్టర్ సినిమాను బోర్ కొట్టకుండా ఓ సారి చూడవచ్చు.
మూవీ రేటింగ్: 2.5 / 5