James Movie Review: జేమ్స్ మూవీ రివ్యూ

James Movie Review: కన్నడ పవర్ స్టార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జేమ్స్ ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా ఈ రోజు కన్నడతో పాటు హిందీ, మళయాలం, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ అయింది. పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఆయన అభిమానులకు ఈ సినిమా పెద్ద పండగలా మారింది. రివ్యూ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పునీత్ రాజ్ కుమార్ ను మళ్లీ సినిమాల్లో చూడడమే మాకు పెద్ద సంతృప్తినిచ్చిందని జేమ్స్ సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమా రివ్యూకు సంబంధించిన మరిన్ని విశేషాశలను తెలుసుకుందాం.

James Movie Review

కథ

జేమ్స్ ఒక కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా చెప్పుకోవచ్చు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇందులో జె వింగ్స్ సీక్రెట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఆఫీసర్ సంతోష్ జేమ్స్ కుమార్ పాత్రలో నటించారు. మూవీలో ప్రత్యేకత ఏమిటి అంటే పునీత్ రాజ్ కుమార్ అన్ని శివరాజ్ కుమార్ ఈ సినిమాకు వాయిస్ అందించారు. ప్రియా ఆనంద్ జేమ్స్ లవర్ నిషా గయక్వాడ్ పాత్రలో నటించింది. బ్లాక్ మార్కెట్, కరప్షన్, స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోతాయి. వీటిని ఎదుర్కొనడానికి ప్రభుత్వంలోని పోలీస్ రక్షణ వ్యవస్తలో జేమ్స్ వింగ్ అనే ఓ సీక్రెట్ ఏజెన్సీ రన్ అవుతుంది. ఈ సీక్రెట్ ఎజెన్సీని జేమ్స్ కుమార్ (పునీత్ రాజ్ కుమార్) లీడ్ చేస్తాడు. కథ మొత్తం దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది.

జేమ్స్ మూవీ నటీనటులు

చేతన్ కుమార్ ఈ సినిమాకు కథ అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. పునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రలో నటించారు. అను ప్రభాకర్, శ్రీకాంత్, ఆర్.శరత్ కుమార్, హరీష్ పేరడి, తిలక్ శేఖర్, ముఖేశ్ రిషి, ఆదిత్య మీనన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. కిశోర్ పత్తికొండ ఈ మూవీని కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. చరణ్ రాజ్ సంగీతాన్ని సమకూర్చగా, స్వామి జె గౌడా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు, దీపు ఎస్ కుమార్ ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.

సినిమా పేరుజేమ్స్
దర్శకుడుచేతన్ కుమార్
నటీనటులుపునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, అను ప్రభాకర్
నిర్మాతలుకిశోర్ పత్తికొండ
సంగీతంచరణ్ రాజ్
సినిమాటోగ్రఫీస్వామి జె. గౌడ

జేమ్స్ సినిమా ఎలా ఉందంటే?

ఇండియన్ మూవీ లవర్, పునీత్ రాజ్ కుమార్ అభిమానులు తప్పకుండా చూడాల్సిన సినిమా జేమ్స్. పునీత్ పర్ఫామెన్స్, యాక్షన్, డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పునీత్ రాజ్ కుమార్ ఒక నటుడు మాత్రమే కాదు ఒ మంచి సామాజిక సేవకుడు కూడా తన చారిటీ ఆర్గనైజేషన్లతో ఎంతో మందికి ఎన్నో సేవలను అందించాడు. ఈ సినిమాలో పునీత్ కు తన అన్న శివకుమార్ వాయిస్ ను అందించడం ఒక హైలైట్. జేమ్స్ తప్పకుండా ప్రతీ భారతీయుడు చూడాల్సిన మూవీ.

మూవీ రేటింగ్ : 4.5 / 5

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు