Sky Lab Movie Review: స్కైలాబ్ మూవీ రివ్యూ

Sky Lab Movie Review: 1970 దశకంలో నాసా ప్రయోగించిన satellite శకలాలు భూమిమీద పడబోతుందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అంతరిక్షంలో ఉన్న శకలాలనే స్కైలాబ్ అంటారు. అయితే ఈ స్కైలాబ్ కరీంనగర్ జిల్లా బండలింగంపల్లి లో పడబోతుందని వార్తలు పెద్ద ఎత్తున రావడంతో.. ఆ ఊర్లోని వారంతా భూములు, మేకలు, అమ్ముకొని వేరే ఊరికి వెళ్లిపోయారు. దీన్ని ఆధారం చేసుకొని విశ్వక్ కాండేరావు స్కైలాబ్ చిత్రాన్ని తెరకెక్కించారు.

Sky Lab Movie Review: స్కైలాబ్ మూవీ రివ్యూ

స్కైలాబ్ మూవీ రివ్యూ (Sky Lab Movie Review)

మూవీ: స్కైలాబ్

రేటింగ్: 3.0/5

దర్శకత్వం : విశ్వక్ ఖందేరావు

నటీ నటులు: సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ళ భరణి, తరుణ్ భాస్కర్ 

సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి

కెమెరా: ఆదిత్య జవ్వడి

ఎడిటర్: రవితేజ గిరిజాల

నిర్మాత: పృథ్వి పిన్నమరాజు

విడుదల తేది: డిసెంబర్ 4, 2021

ఇక కధ విషయానికి వస్తే.. డాక్టర్ ఆనంద్ (సత్యదేవ్) తన తాతగారి ఊరైన బండలింగంపల్లికి వచ్చి clinic స్టార్ట్ చేద్దామనుకుంటాడు. సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ) ఒకప్పుడు చాలా ధనికులుగా ఉండేవారు ప్రస్తుతం అతని కుటుంబం కష్టాల్లో ఉంది. గౌరీ (నిత్యామీనన్).. ఈమె జమీందారు కూతురు, అప్పుడే పట్నం నుంచి వచ్చిన ఆమె ఊర్లో మంచి రచయితగా రాణించాలనుకుంటుంది. వీరి ముగ్గురి లక్షల చుట్టే కదా తిరుగుతుంది. చాలా కామెడీతో ట్విస్టులతో సాగే ఈ సినిమాని ఒక్క సారి చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే: డైరెక్టర్ కధ ని బాగా రెడీ చేసుకున్నా దాన్ని ప్రెసెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారేమో అనిపిస్తుంది. మూవీ అసలు కదా సగం సినిమా అయిపోయిన తరువాత స్టార్ట్ అవుతుంది. ఎమోషన్స్, కామెడీ డ్రామాని మరింత బాగా పండించొచ్చు అని అనిపించింది. సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ పెరఫామెన్స్, నటన అద్భుతంగా ఉన్నా.. మూవీ ప్రెసెంటేషన్ వారికి హెల్ అవలేదని చెప్పుకోవచ్చు.

బాటమ్ లైన్: 1970 సెట్టైయింగ్ బాగుంది. కథ ప్రెసెంటేషన్ అంతగా బాగోలేదు. కామెడీ పండలేదు. సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ నటన కొంత సంతృప్తిని ఇచ్చింది.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు