Ghani Movie Review: గని మూవీ రివ్యూ

Ghani Movie Review: కోవిడ్ వల్ల చాలా సార్లు పోస్టుపోన్ అయిన వరుణ్ తేజ్ నటించిన గని మూవీ ఎట్టకేలకు ఈరోజు థియేటర్ లో రిలీజ్ అయింది.2 సంవత్సరాల తర్వాత వరుణ్ తేజ్ సినిమా థియేటర్ లో సందడి చేస్తుంది. మెగా అభిమానులు థియేటర్ లో సందడి చేస్తున్నారు. అయితే వరుణ్ తేజ్ ఈ సినిమాకోసం బాక్సర్ గా కనిపించడానికి చాలా కష్టపడ్డాడు. అయితే ఈ మూవీ ఎలా ఉందొ ఈ రివ్యూ లో మనం తెల్సుకుందాం.

Ghani Movie Review

కథ

గని (వరుణ్ తేజ్ )చిన్నతనం నుండి బాక్సర్ అవ్వాలని తన కోరిక,దానికోసం ఎంతో కస్టపడి శిక్షణ తీసుకుంటాడు, అయితే అనుకోని కారణాల వాళ్ళ గని అమ్మ బాక్సింగ్ వదిలేయమని అతని దగ్గర ఒట్టు వేయించుకుంటుంది, తన అమ్మ కి ఇచ్చిన మాటకోసం బాక్సింగ్ వదిలేస్తాడు, అయితే కొన్ని సంవత్సరాల తరువాత తను మళ్ళి బాక్సింగ్ ఆడాల్సి వస్తుంది, అయితే ఈసారి గని అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడా పోటీలో ఎలాగైనా ఛాంపియన్ అవ్వాలని అనుకుంటాడు, చివరగా గని అమ్మ బాక్సింగ్ ఎందుకు వదిలేయమంది, అతను బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాడా లేదా అనేది మిగతా కథ.

గని మూవీ నటీనటులు

వరుణ్ తేజ్ , సయామీ ఖేర్ , నదియా ,జగపతిబాబు ,ఉపేంద్ర సునీల్ శెట్టి, నవీన్ చంద్ర మరియి తదితరులు.కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించగా, అల్లు బాబీ చిత్రాన్ని నిర్మిచారు, జార్జ్ సి విల్లియమ్స్ ఛాయాగ్రహణం అందించగా, థమన్ ఎస్ సంగీతం సమకూర్చారు.

సినిమా పేరుగని
దర్శకుడుకిరణ్ కొర్రపాటి
నటీనటులువరుణ్ తేజ్ , సయామీ ఖేర్ , నదియా ,జగపతిబాబు ,ఉపేంద్ర సునీల్ శెట్టి, నవీన్ చంద్ర మరియి తదితరులు
నిర్మాతలుఅల్లు బాబీ
సంగీతంథమన్ ఎస్
సినిమాటోగ్రఫీజార్జ్ సి విల్లియమ్స్
ఓటీటీ రిలీజ్ డేట్ఇంకా ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ఇంకా ధ్రువీకరించలేదు

గని సినిమా ఎలా ఉందంటే?

వరుణ్ తేజ్ ఒక నటుడిగా ప్రతి సినిమాకి ఎదుగుతూనే ఉన్నాడు, తన ప్రతి సినిమాలో ఏదో కొత్త పాయింట్ ఉండేలా చూసుకుంటున్నాడు, తన మొదటి సినిమా నుండే అందరి హీరోల్లా కాకుండా ఒక కొత్త దారి ఎంచుకొని విజయవంతంగా దూసుకుపోతున్నాడు.
దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఒక మంచి కథ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు, అయితే ఒక మంచి కథని కమర్షియల్ గా చెప్పడం అంత తేలికైన విషయం కాదు, కానీ అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరిస్తూనే తాను చెప్పాలి అనుకున్నది చెప్పడం లో విజయవంతం అయ్యారు.
మనం చాల సినిమాలే చూసుంటాం బాక్సింగ్ నేపధ్యం లో , అయితే స్పోర్ట్స్ నేపధ్యం ఉన్న సినిమాలకి భావోద్వేగాలు చాల ఎక్కువుంటాయి ఇదే గని విషయం లో కూడా జరిగింది, వరుణ్ తేజ్ కూడా ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు, ఒక నటుడుగా మరో మెట్టు ఎక్కడని చెప్పొచ్చు.

జార్జ్ సి విల్లియమ్స్ కూడా సినిమాకి చాల మంచి విజుఅల్స్ అందించారు, ఇంతకముంది వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమాకి కూడా ఈయనే ఛాయాగ్రాహకుడు, అయితే థమన్ సంగీతం అంతగా ఆకట్టుకోలేదు.
చివరగా గని తప్పకుండ చూడాల్సిన చిత్రం.

సినిమా రేటింగ్: 2.5/5

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు