Bloody Mary Telugu Movie Review: AHA OTT ప్లాట్ ఫామ్ ఈ మధ్య కాలం లో అద్భుతమైన మూవీస్ మరియు వెబ్ సిరీస్ లని నిర్మిస్తుంది, ఇది మొదలైనప్పుడు ఎవరికీ అసలు నమ్మకం కూడా లేదు కానీ ఇప్పుడు కొత్త కంటెంట్ తో AHA దూసుకుపోతుంది, రాబోయేరోజుల్లో మరిన్ని అద్భుతమైన కంటెంట్స్ వస్తుంది అనడం లో సందేహం లేదు. బ్లడీ మేరీ AHA నిర్మించిన చిత్రం, ట్రైలర్ తోనే మంచి ఆసక్తినిరేకెత్తించింది, ఈ మూవీ AHA లొ ఈరోజు అంటే ఏప్రిల్ 15, 2022 న AHA లొ విడుదలైంది, అయితే ఈ ఏ మేరకు ప్రేక్షకులకు నచ్చిందో మరియు ఈ మూవీ చూడదగినదా కాదా ఈ రివ్యూ లొ చూద్దాం.
కథ
మేరీ (నివేత పేతురాజ్ ), రాజు (రాజ్ కుమార్) మరియు భాష (కిరీటి ) ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఒకరోజు రాత్రి అనుకోకుండా ఒక ప్రమాదకరమైన సంఘటనలో ఇరుక్కుంటారు, వాళ్ళు ఎలా ఇరుక్కున్నారో కూడా వాళ్ళకి తెలీదు, అయితే వాళ్ళకి సంబంధం లేకుండా ఇరుక్కుపోయాం అనుకున్న వాళ్ళకి, కర్మ అనేది ఒకటి ఉంటుందని తెలుస్తుంది, గతం లో వాళ్ళు చేసిన పనులవల్ల వాళ్ళు ఈ సంఘటనలో ఇరుక్కున్నారు అని తెల్సుకొని అక్కడినుంచి ఎలాగైనా పారిపోవాలని ప్రయత్నం మొదలు పెడ్తారుఎం అయితే మేరీ అక్కడ ఉన్నవాళ్లందరిని చంపడం మొదలు పెడుతుంది, తన లో ఉన్న మరో మనిషిని చుసిన తన స్నేహితులు ఆశ్చర్యానికి గురవుతారు, అయితే తను ఆలా మారడానికి ఒక బలమైన కారణం ఉంటుంది. చివరకి వాళ్ళు ఎలా బయట పడ్డారు, మేరీ గతం ఏంటి అనేది మీరు మూవీ చూసి తెల్సులోవాలి.
బ్లడీ మేరీ మూవీ నటీనటులు
బ్లడీ మేరీ నటీనటులు, నివేత పేతురాజ్, బ్రహ్మాజీ, అజయ్, కిరీటి, రాజ్ కుమార్ మరియు తదితరులు, ఈ చిత్రం చందు మొండేటి దర్శకత్వం వహించగా, కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం అందించారు. కాల భైరవ సంగీతాన్ని అందుంచగా, టి జి నాగేశ్వర్ రావు గారు ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన నిర్మించారు.
సినిమా పేరు | బ్లడీ మేరీ |
దర్శకుడు | చందు మొండేటి |
నటీనటులు | నివేత పేతురాజ్, బ్రహ్మాజీ, అజయ్, కిరీటి, రాజ్ కుమార్ మరియు తదితరులు |
నిర్మాతలు | టి జి నాగేశ్వర్ రావు |
సంగీతం | కాల భైరవ |
సినిమాటోగ్రఫీ | కార్తీక్ ఘట్టమనేని |
ఓటీటీ రిలీజ్ డేట్ | ఏప్రిల్ 15, 2022 |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | AHA |
బ్లడీ మేరీ సినిమా ఎలా ఉందంటే?
బ్లడీ మేరీ చిత్రం అంత ఒక రాత్రి లో జరిగే కథ, మూవీ చాలా బాగా స్టార్ట్ అవుతుంది, దర్శకుడు పాత్రలని పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్లిన విధానం చాలా బాగుంది. కథ పూర్తి గా కర్మ అనే పాయింట్ మీద నే నడుస్తూ ఉంటుంది దర్శకుడు చాల బాగా హేండిల్ చేసాడని చెప్పొచ్చు. ముగ్గురి గతం వల్లే వాళ్ళు oka ప్రమాదకరమైన పరిస్థితిని ఎదురుచూస్తున్నారు అని చూపించిన విధానం చాల బాగుంది.
నివేత పేతురాజ్ బాగానే చేసిన కొన్ని సన్నివేశాల్లో తేలిపోయింది, కాకపోతే తన గతం గురించి మరియు తను అందరిని ఎందుకు చంపుతుంది దానికి గల కారణం చెప్పే సమయం లో వచ్చే సన్నివేశాల్లో చాల బాగా నటించింది, మిగతా నటీనటులు కూడా తమ పాత్రల మేరకు బాగానే చేసారు.
కాల భైరవ్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అయిందనే చెప్పాలి, మరియు దర్శకుడు ఈ చిత్రం లో కొంత సైకలాజికల్ పాయింట్స్ ని చాల బాగా దృష్టిలోకి తీసుకొచ్చాడు.
చివరగా, బ్లడీ మేరీ చూడదగిన చిత్రం, AHA లో ఉంది చూసేయండి.