1996 Dharmapuri Movie Review: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ 1996 ధర్మపురి అనే చిత్రానికి నిర్మాతగా మారారు. నిర్మాతగా ఉండటం అంత తేలికైన పని కాదు, ఎందుకంటే సినిమా ప్రమోషన్స్‌లో నిర్మాత శ్రద్ధ వహించాలి ఎందుకంటే ప్రమోషన్లు సినిమాను ప్రేక్షకులకు దగ్గరకి తీసుకెళ్తాయి, అయితే, శేఖర్ మాస్టర్ ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసారు, అతని జబర్దస్త్ స్నేహితులు మరియు నాగబాబు గారు కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశారు. ఎట్టకేలకు,ఈరోజు ఏప్రిల్ 22, 2022న థియేటర్‌లలో విడుదలైంది. మరింక ఆలస్యం చేయకుండా, ఈ చిత్రం చూడదగినదేనా లేదా అనేది ఈ రివ్యూ లొ చూద్దాం.
కథ
కథ 1996లో ధర్మపురిలో జరుగుతుంది, అక్కడ తన తండ్రికి వ్యవసాయంలో సహాయం చేసే సూరి (గగన్ విహారి) ఒక రోజు నాగమల్లి (అపర్ణా దేవి)తో ప్రేమలో పడతాడు. అయితే,మొదట్లో,ఆమె అతని ప్రేమను తిరస్కరించిన, కొంతకాలం తర్వాత ఆమె అంగీకరిస్తుంది అయితే అంతా సజావుగా ఉంది అనుకుంటున్న టైం లో వీరి ప్రేమ విషయం నాగమల్లి, తండ్రి పటేల్ కి తెలుస్తుంది. పటేల్ ఉన్నత కులానికి చెందినవాడు,నాగమల్లి తండ్రి అయిన పటేల్ సూరిని చంపడానికి ప్రయత్నించినప్పుడు కథ వేరే మలుపు తిరుగుతుంది, అయితే ఇక్కడ నాగమల్లి లొ అనుహాయమైన మార్పు వచ్చి తన తండ్రిని చంపాలని నిర్ణయించుకుంటుంది, చివరగా వరు కలిసి ఉంటారా లేదా అని తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
1996 ధర్మపురి మూవీ నటీనటులు
1996 ధర్మపురిలో గగన్ విహారి, అపర్ణా దేవి ప్రధాన పాత్రలు పోషించారు మరియు నాగ మహేష్, శేకర్ కళ్యాణ్, జనార్దన్ మరియు ఇతరులు కూడా నటించారు, జగత్ రచన మరియు దర్శకత్వం వహించారు, సినిమాటోగ్రఫీ అందించింది కృష్ణ ప్రసాద్, సంగీతం ఓషో వెంకట్ మరియు నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి.
సినిమా పేరు | 1996 ధర్మపురి |
దర్శకుడు | జగత్ |
నటీనటులు | గగన్ విహారి, అపర్ణా దేవి ,నాగ మహేష్, శేకర్ కళ్యాణ్, జనార్దన్. |
నిర్మాతలు | భాస్కర్ యాదవ్ దాసరి |
సంగీతం | ఓషో వెంకట్ |
సినిమాటోగ్రఫీ | కృష్ణ ప్రసాద్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ఇంకా ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ఇంకా ధ్రువీకరించలేదు |
1996 ధర్మపురి సినిమా ఎలా ఉందంటే?
మనం ఇంతకముందు కులం,పరువు హత్య నేపథ్యంలో సాగే సినిమాలు మనం చాలానే చూశాం, ఈ సినిమా కూడా ఆ కోవలోకె వస్తుంది, ఈ సినిమాలో కథ కొత్తగా లేకపోవడం ఒక మైనస్ అని చెప్పొచ్చు, అయితే గ్రామీణ నేపథ్యం మరియు ప్రేమకథ కారణంగా ప్రేక్షకులు ఎంగేజ్ కావచ్చు.
ఈ సినిమా కొన్ని రకాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు చాలానే ఉన్నాయ్ అయితే ఇది అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అయితే కాదు , సినిమా బాగానే స్టార్ట్ అయినా తరువాత బోర్ కొట్టడం స్టార్ట్ అవుతుంది, ప్రేమ సన్నివేశాలు బాగా డిజైన్ చేసారని చెప్పొచ్చు, అయితే సినిమా బ్యాక్‌డ్రాప్ కొత్తగా లేనందు వల్ల సినిమాకొత్తగా అయితే అనిపించదు, గగన్ విహారి తన పాత్రకు న్యాయం చేసాడు మరియు నాగమల్లిగా హీరోయిన్ అపర్ణాదేవిని మనం అభినందించాలి, ఆమె కేరళకు చెందినది, కానీ నాగమల్లిగా తెలంగాణ యాసతో అద్భుతంగా నటించింది , మిగిలిన నటీనటులు జస్ట్ ఓకే.
కథనం ఫ్రెష్‌గా లేకపోయినా ప్రేమ సన్నివేశాలను బాగా డిజైన్ చేయడంతో దర్శకుడు జగత్ విజయవంతమయ్యారు, సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది కానీ సినిమాటోగ్రఫీ అంతగా కుదరలేదు, కృష్ణ ప్రసాద్ ఓవర్‌షాచురేటెడ్ కలర్స్‌ని వాడారు, అవి అస్సలు ఆకట్టుకోలేదు. ఓషో వెంకట్ సంగీతం సినిమాకు వెన్నెముకగా నిలుస్తుంది, అతను తన నేపథ్య సంగీతంతో చాలా సన్నివేశాలకు ప్రాణం పోసాడు. చివరగా, 1996 ధర్మపురి ఒక సారి చూసే సినిమా, పక్కా కమర్షియల్ అంశాలతో కూడిన గ్రామీణ నేపథ్య చిత్రాలను ఇష్టపడే వారూ ఈ చిత్రం చూడొచ్చు.
సినిమా రేటింగ్: 2.5/5
ఇవి కూడా చుడండి: