Acharya Movie Review: ఆచార్య మూవీ రివ్యూ

Acharya Movie Review: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆచార్య, చిరంజీవి మరియు రామ్‌చరణ్ మొదటిసారిగా ఫుల్-లెంగ్త్ పాత్రలను పోషించారు , భారీ అంచనాలతో ఈ చిత్రం ఈ రోజు ఏప్రిల్ 29, 2022 న థియేటర్లలో విడుదలైంది.అయితే. వీరిద్దరినీ తెరపై చూసి అభిమానులు ఫిదా అయిపోవడంలో ఎటువంటి సందేహం లేదు, అయితే, ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ స్పందన వస్తోంది, విమర్శకులు కూడా పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. వీటన్నింటికీ మించి ఆచార్య సినిమా చూడదగినదేనా ఈ సినిమాలో ఏం వర్కవుట్ అయ్యిందో ఈ రివ్యూలో చూద్దాం.

Acharya Movie Review

కథ

ఆచార్య కథ ధర్మస్థలి పిలువబడే ఉర్లో జరుగుతుంది. అక్కడ ఒకప్పుడు ధర్మస్థలి కి శిష్యుడిగా ఉన్న బసవ (సోనూ సూద్) ధర్మస్థలిలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను చేస్తూఉంటాడు. బసవ మరియు అతని అనుచరుల నుండి అక్కడి గ్రామస్థులు సమస్యలను ఎదుర్కుంటారు,ఇక ధర్మస్థలి బసవ చేతికి వెళ్ళిపోతుంది, అప్పుడే అక్కడి గ్రామస్థులు ఇక ఈ ధర్మస్థలి ని, మమ్మల్ని కాపాడేవారే లేరా అని అనుకుంటుంటుండగా ఆచార్య వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు, బసవ యొక్క చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. చివరగా ఆచార్య ధర్మస్థలికి ఎందుకు వచ్చాడు? ఆచార్య మరియు సిద్ధ మధ్య సంబంధం ఏమిటి? ఈ సమాధానాలన్ని తెల్సుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే

ఆచార్య మూవీ నటీనటులు

ఆచార్య లో చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్, తనికెళ్ల భరణి తదితరులు నటించగ ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు , ఛాయాగ్రహణం ఎస్.తిరునావుక్కరసు, సంగీతం మణిశర్మ, నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుఆచార్య
దర్శకుడుకొరటాల శివ
నటీనటులుచిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్, తనికెళ్ల భరణి తదితరులు
నిర్మాతలునిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సంగీతంమణిశర్మ
సినిమాటోగ్రఫీఎస్.తిరునావుక్కరసు
ఓటీటీ రిలీజ్ డేట్ఇంకా ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ఇంకా ధ్రువీకరించలేదు

ఆచార్య సినిమా ఎలా ఉందంటే?

చిరంజీవి మరియు రామ్‌చరణ్ తొలిసారిగా పూర్తి స్థాయి పాత్రలతో స్క్రీన్ ని పంచుకున్నారు, ఈ ఇద్దరు వ్యక్తులు ఈ చిత్రానికి USP (యూనిక్ సెల్లింగ్ పాయింట్).కథను అస్సలు పట్టించుకోకుండా కేవలం వారిని తెరపై చూసేందుకు అభిమానులు, సినీ ప్రేమికులు థియేటర్లకు వెళ్లారు అనడం లో సందేహం లేదు, స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ దర్శకుడు కొరటాల శివ తన కథతో ప్రేక్షకులని మెప్పించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి, అయితే అభిమానులని అలరించాడని మంచి డాన్సులు ఫైట్స్ మరియు హీరో ఎలివేషన్లు బాగానే ఉన్న, అవి సినిమాని విజయవంతం చేయలేవు. అయితే మహేశ్‌బాబు వాయిస్‌ ఓవర్‌తో ఆసక్తికరంగా మొదలై, ఆ తర్వాత, విలన్ అరాచకాలు, ప్రజల కష్టాలు,వెంటనే వాళ్ళని కాపాడారని హీరో రావడం,ఇలా ఆచార్య ఒక సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌లోకి వెళ్తుంది. అయితే చిరంజీవి ధర్మస్థలిలో అడుగుపెట్టినప్పుడు కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇక ద్వితీయార్థం సిద్ధ మరియు ఆచార్య ఇద్దరు ఎలా కలిశారు అనే నక్సలైట్ సన్నివేశాలు బాగానే వర్కౌట్ అయ్యాయి, అయితే ఇక్కడ సినిమా చూస్తున్నంతసేపు ఇది ఇక్కడ కొరటాల శివ మార్క్ సినిమా అయితే కాదు అని అర్తహమైపోతుంది అందం లో సందేహం లేదు. సాగదీసిన సన్నివేశాలతో ద్వితీయార్థం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.
సిద్ధ పాత్రలో రామ్‌చరణ్ తన పాత్రకి న్యాయం చేసాడు, ఇటీవల రామ్‌చరణ్ RRR లో అద్భుతమైన
నటనను ప్రదర్శించాడు, మనం ఆ అంచనాలతో వెళితే అతను మనల్ని నిరాశపరచవచ్చు. మరియు ఆచార్యగా చిరంజీవి అద్భుతంగా నటించాడు అయితే తెర మీద ఎంత గ్యాప్ వచ్చిన తన స్టైల్ మరియు మేనరిజం ఎప్పటికి అలాగే ఉంటుందని మరోసారి నిరూపించాడు. మరియు చిరంజీవి తెరపై చాలా అందంగా కనిపిస్తాడు. నీలాంబరిగా పూజా హెగ్డే అంతగా ఆకట్టుకోలేదు కేవలం తన పాత్రను సిద్ధా యొక్క ప్రేమ సన్నివేశాలకు మాత్రమేరూపానందించారు అనిపిస్తుంది. మరియు మిగిలిన నటీనటులు వారి పాత్రలకి న్యాయం చేసారు.

కొరటాల శివ తెలుగు చిత్ర పరిశ్రమలోని మాస్ దర్శకుల్లో ఒకరు. అతను ఎక్కువగా మాట్లాడడు కానీ తన సినిమాల ఎక్కువగా మాట్లాడతాయి, తన చిత్రాలతో ప్రేక్షకులతో సంభాషించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు మరియు సమాజానికి సందేశం ఇవ్వాలనుకునే తపన ప్రతి చిత్రంలో మనం స్పష్టంగా చూడవచ్చు, అలాంటి చిత్రాలను కమర్షియల్ ఫార్మాట్‌లో తీయడం అంత తేలికైన విషయం కాదు, కానీ అందులో అతను మాస్టర్ అయ్యాడు అని చెప్పొచ్చు , అయితే, ఆచార్య అస్సలు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాదు మరియు కొరటాల శివ తరహా సినిమా కూడా కాదు, అతను ఈ సినిమాతో తనలో ఉన్న మాస్ దర్శకుణ్ణి ప్రదర్శించాడు అని చెప్పొచ్చు అతను ఇద్దరు స్టార్‌లను చాలా బాగా హేండిల్ చేసాడు కానీ కథ మీద ఇంకాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది .

టెక్నికల్‌గా ఆచార్య ఉన్నతంగా కనిపిస్తుంది , తెర వెనుక అసలైన హీరో మాత్రం ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ అని చెప్పొచ్చు, భారీ టెంపుల్ సెట్‌లతో ధర్మస్థలి అనే ప్రపంచాన్ని అద్భుతంగా సృష్టించాడు, సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది, కలర్ టోన్ మరియు లైటింగ్ అద్భుతంగా ఉంది, మణిశర్మ సంగీతం అంతగా ఆకట్టుకోదు ఒక్క బలే బలే బంజారా తప్ప అయితే నేపధ్య సంగీతం లో మార్క్ చూపించాడు, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కి అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కి తెర మిద చాల సన్నివేశాలు బాగా వర్క్‌అవుట్ అయ్యాయి.
చివరగా, చిరంజీవి మరియు రామ్‌చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఆచార్యని ఖచ్చితంగా చూడొచ్చు.

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు