Fahadh Faasil’s Dongata Telugu Review: ఫహద్ ఫాసిల్ యొక్క అత్యంత అద్భుతమైన చిత్రాలలో ఒకటైన తొండిముతాళుమ్ దృకసాక్షియుమ్. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ ఆహా తెలుగులోకి ఈ చిత్రంని దొంగాట అనే టైటిల్‌తో డబ్ చేసింది. ఈ చిత్రం ఈరోజు మే 06, 2022, ఆహాలొ విడుదలైంది. తొండిముతాళుమ్ దృకసాక్షియుమ్ అనే చిత్రం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు మరియు ఈ చిత్రానికి 3 జాతీయ అవార్డులు వచ్చాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా, దొంగాట ఎలా ఉందొ ఈ రివ్యూ లో చూద్దాం.
కథ
దొంగాట కథ ఒక సాధారణ జంట ప్రసాద్ (సూరజ్ వెంజరమూడ్), మరియు శ్రీజ (నిమిషా సజయన్) జీవితాలను వర్ణిస్తుంది,కులాంతర వివాహం చేసుకున్న ఈ నూతన వధూవరులు, వారి జీవితలో చాలా సమస్యలను ఎదుర్కుంటు ఉంటారు. బతుకుదెరువు కోసం ప్రసాద్, శ్రీజలు తన బంగారు గొలుసును అమ్మాలని నిర్ణయించుకున్నప్పటికీ, పాపం అదే సమయంలో చాకచక్యంగా ఓ అమాయక దొంగ బస్‌లొ ప్రయాణిస్తుండగా బంగారు గొలుసును దొంగిలిస్తాడు, ఆ దొంగపై దంపతులు కేసు నమోదు చేసిన తరువాత , పోలీసులు విచారణ ప్రారంభిస్టారూ. అతను నేరాన్ని అంగీకరించడానికి నిరాకరించాడు. చివరగా, అతను కేసును అంగీకరిస్తాడా,తరువాత ఏమి జరిగింది అనేది మిగిలిన కథ?.
దొంగాట మూవీ నటీనటులు
దొంగాటలో ఫహద్ ఫాసిల్, సూరజ్ వెంజరమూడ్, నిమిషా సజయన్, అలెన్సియర్ లే లోపెజ్ నటించారు. మరియు ఈ చిత్రానికి దిలీష్ పోతన్ దర్శకత్వం వహించారు, సినిమాటోగ్రఫీని రాజీవ్ రవి నిర్వహించారు, సంగీతం బిజిబాల్ అందించారు మరియు ఈ చిత్రాన్ని ఊర్వశి థియేటర్స్ బ్యానర్‌పై సందీప్ సేనన్ మరియు అనీష్ ఎం థామస్ నిర్మించారు.
సినిమా పేరు | దొంగాట |
దర్శకుడు | దిలీష్ పోతన్ |
నటీనటులు | ఫహద్ ఫాసిల్, సూరజ్ వెంజరమూడ్, నిమిషా సజయన్, అలెన్సియర్ లే లోపెజ్ |
నిర్మాతలు | సందీప్ సేనన్ మరియు అనీష్ ఎం థామస్ |
సంగీతం | బిజిబాల్ |
సినిమాటోగ్రఫీ | రాజీవ్ రవి |
ఓటీటీ రిలీజ్ డేట్ | మే 06, 2022 |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ఆహా |
దొంగాట సినిమా ఎలా ఉందంటే?
ఈ చిత్రానికి ఫహద్ ఫాసిల్, సూరజ్ వెంజరమూడ్, నిమిష్ సజయన్ ఈ ముగ్గురూ సరిపోతారు. మన దైనందిన జీవితానికి సంబంధించిన కొన్ని అందమైన పాత్రలను రూపొందించడంలో దిలీష్ పోతేన్ విజయవంతం అయ్యాడు . సినిమా సాధారణ కథాంశంతో ఉన్నప్పటికీ దిలీష్ పోతేన్ చాలా అందంగా తెరకెక్కించాడు.
దొంగగా ఫహద్ ఫాసిల్ కేవలం పాత్రలో జీవించాడు, అతని అమాయకత్వం, అతని చాకచక్యంతో అద్భుతంగా నటించాడు. మరియు సూరజ్ వెంజరమూడు కూడా తన పాత్రకు న్యాయం చేసాడు, మధ్యతరగతి భర్త యొక్క ఆలోచన ప్రక్రియ, మరియు బాడీ లాంగ్వేజ్ అతను చాల బాగా పోషించాడు, మరియు నిమిషా సజయన్ మధ్యతరగతి గృహిణి పాత్రలో పర్ఫెక్ట్ గా సూట్ అయింది మనకు ఉన్న అద్భుతమైన నటీమణులలో నిమిషా సజయన్ ఒకరు. మరియు మిగిలిన నటీనటులు తమ పాత్రను బాగా చేసారు.
దిలీష్ పోతేన్ మనం రోజు చూసే పాత్రలను పాత్రలను రూపొందించడంలో విజయం సాధించాడు, మరియు అతను ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసాడు, హాస్య సన్నివేశాలు మరియు విచారణ సన్నివేశాలు బాగానే సాగుతాయి, అయితే సినిమా వేగం కొంచెం నెమ్మదిగా ఉంటుంది , అయితే మీరు పాత్రలతో ప్రయాణించడం ప్రారంభించిన తర్వాత మీరు సినిమాను ఆస్వాదిస్తారు. .
దొంగాట టెక్నికల్‌గా బ్రిలియంట్‌గా ఉంది, క్లోజప్ షాట్‌లలో రాజీవ్ రవి అద్భుతాన్ని మనం చూడవచ్చు. ప్రతి సన్నివేశంలో బిజీపాల్ సంగీతం బాగా కుదిరింది.
చివరగా. అద్భుతమైన ప్రదర్శనలు మరియు అందమైన కథనం కోసం దొంగాట తప్పక చూడవలసిన చిత్రం. ఈ సినిమాని మిస్ అవ్వకుండా , ఆహాలో చూసేయండి.
సినిమా రేటింగ్: 3/5
ఇవి కూడా చుడండి:
- Bhala Thandhanana Movie Review: భళా తందనానా మూవీ రివ్యూ
- Keerthy Suresh’s Chinni Movie Review: కీర్తి సురేష్ చిన్నిమూవీ రివ్యూ
- Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Review: అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ రివ్యూ