Puzhu Telugu Dubbed Movie Review: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పులు ‘ఎట్టకేలకు సోనీలివ్‌లో విడుదలైంది. మమ్ముట్టి విరామం లేకుండా చాల సినిమాలు చేస్తున్నాడు, వాటిలో పులు ఒకటి, ట్రైలర్ చాలా భిన్నంగా కనిపించడంతొ అందరి దృష్టిని ఆకర్షించింది. మమ్ముట్టి కెరీర్ ప్రారంభం నుండి ప్రయోగాత్మక చిత్రాలను చేస్తూ వస్తున్నాడని మనందరికీ తెల్సిన విషయమే, పులు కూడా అత్యంత ప్రయోగాత్మక చిత్రాలలో ఒకటి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా Puzhu యొక్క లోతైన సమీక్షలోకి ప్రవేశిద్దాం మరియు చిత్రం చూడదగినదో కాదో తెలుసుకుందాం.
కథ
పులు కథ కఠినమైన తండ్రి మరియు మానసికంగా చెదిరిన కొడుకు యొసంబంధాన్ని సంబంధాన్ని వర్ణిస్తుంది. మరోవైపు, అతను సీక్రెట్ ఏజెంట్ గా పని చేస్తూ ఒక యాక్సిడెంట్ కేసు ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు, ఆ ప్రక్రియలో తన జీవితం మారిపోతుంది, చివరగా, తన కొడుకు తన పైన ద్వేషం పెంచుకోడానికి గల కారణం ఏంటి అనేది మీరు మూవీ చూసి తెల్సుకోవాలి.
మూవీ నటీనటులు
Puzhu నటీనటులు మమ్ముట్టి మరియు పార్వతి తిరువోతు, చిత్రానికి దర్శకత్వం రథీనా, ఛాయాగ్రహణం, తేని ఈశ్వర్, సంగీతం, జెక్స్ బేజాయ్ మరియు చిత్రానికి ఎస్ జార్జ్ నిర్మించారు, చిత్రానికి SonyLiv మద్దతునిచ్చింది.
సినిమా పేరు | పులు (Puzhu) |
దర్శకుడు | రథీనా |
నటీనటులు | మమ్ముట్టి మరియు పార్వతి తిరువోతు |
నిర్మాతలు | ఎస్ జార్జ్ |
సంగీతం | జెక్స్ బేజాయ్ |
సినిమాటోగ్రఫీ | తేని ఈశ్వర్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | మే 13, 2022 |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | సోనీ లివ్ |
సినిమా ఎలా ఉందంటే?
ట్రీట్‌మెంట్ పరంగా పులు విభిన్నమైన చిత్రం, కొత్త దర్శకురాలు రథీనా చిత్రాన్నిడీల్ చేసిన విధానం చాల బాగుంది. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ, వివిధ సంఘటనల వల్ల మానవ సంబంధాలు ఎలా మారుతాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
మలయాళ చిత్రాలు మాములుగాస్లో గ ఉంటాయి అది మనందిరికి తెల్సిన విషయమే, అయితే పులు కూడా ఈ కోవలోకి వస్తుంది, అయితే మూవీ డార్క్ వాతవరణం గాని, పాత్రలు డిజైన్ చేసిన విధానము సినిమా అంతటా మిమ్మల్ని కట్టిపడేస్థాయి . మమ్ముట్టి మరియు పార్వతిలు మొదటిసారిగా స్క్రీన్‌ను పంచుకున్నారు మరియు వారి కలయికలో వచ్చే సన్నివేశాలు చాల బాగా పండాయి అని చెప్పొచ్చు.
మమ్ముట్టి ఎప్పుడూ ఏలాంటి పాత్ర అయినా అవలీలగా పోషించ గలడు, ఈ చిత్రంలో kuda ఒక కఠినమైన తండ్రి మరియు సీక్రెట్ ఏజెంట్‌గా అతరెండు షేడ్స్ ని అద్భుతంగా చూపించాడు, ఇక పార్వతి ఎప్పటిలాగే అద్భుతంగా చేసింది మరియు మిగిలిన తారాగణం బాగా చేసింది.
ఇటీవలి కాలంలో బాగా వ్రాసిన కథలలో పులు ఒకటి, మరియు తల్లిదండ్రులు కఠినంగా ప్రవర్తించినప్పుడు పిల్లలు మానసికంగా ఎలా బాధపడతారో దర్శకుడు రథీనా అద్భుతంగా ప్రదర్శించారు.
Puzhu సాంకేతికంగా అద్భుతంగా ఉంటుంది, తేని ఈశ్వర్ యొక్కడార్క్ విజుఅల్స్ మరియు క్లోజప్ షాట్స్ మిమ్మల్ని పులు ప్రపంచంలోకి తీసుకెళ్తాయి మరియు జేక్స్ బెజోయ్ సంగీతం ప్రధాన హైలైట్‌లలో ఒకటి, అతను తన నేపథ్య సంగీతంతో పులు సినిమా ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. చివరగా, Puzhu తప్పక చూడవలసిన చిత్రం, అంతేకాకుండా, Puzhu గురించి వివరించడం కన్నా వీక్షిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ చిత్రం ప్రస్తుతం SonyLivలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది,వెంటనే చూసేయండి.
సినిమా రేటింగ్: 3.5/5
ఇవి కూడా చుడండి: