Don Telugu Dubbed Movie Review: డాన్ మూవీ రివ్యూ

Don Telugu Dubbed Movie Review: శివకార్తికేయన్ తమిళ పరిశ్రమలో అత్యంత అద్భుతమైన నటులలో ఒకరు, తెలుగులో డాక్టర్ విజయం తర్వాత అతనికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్‌తో డాన్ అనే యాక్షన్ కామెడీ డ్రామా సినిమాతో మన ముందుకు వచ్చాడు. డాన్ ఎట్టకేలకు తమిళ్ మరియు తెలుగులో మే 13, 2022న విడుదలైంది మరియు ఈ చిత్రం విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుంది, అయితే ఇంకా లేట్ చేయకుండా డాన్ చిత్రం చూడదగినది కాదా అని తెలుసుకుందాం.

Don Telugu Dubbed Movie Review

కథ

డాన్ సినిమా కాలేజీ చుట్టూ తిరుగుతుంది, డాన్ (శివకార్తికేయ కాలేజీ కుర్రాడు, అతనికి చిన్నతనం నుండి అతని తండ్రి ఎల్లప్పుడూ చదువు యొక్క ప్రాముఖ్యత గురించి చెబూతు వస్తాడు మరియు చదువుకుంటేనే జీవితంలో బాగుంటారు అని నూరిపోస్తాడు, కానీ అతనికి చదువుపై ఆసక్తి ఉండదు మరియు అతను అతనికి జీవితం ఎం కావాలి అని కూడా ఆలోచన ఉండదు, దీంతో ప్రతిభను తెల్సుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదే సమయంలో అతను ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారతాడు ఎందుకంటే అతను విద్యార్థుల సమస్యకు అండగా నిలబడతాడు కాబట్టి, దింతో కాలేజ్ ప్రిన్సిపల్ కి తనకి గొడవ మొదలవుతుంది, అయినప్పటికీ, అతని స్నేహితుడి మరణంతో కథ వేరే మలుపు తిరుగుతుంది. చివరగా, అతను తన ప్రతిభను కనుగొంటాడా? అతని స్నేహితుడి మరణం తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.

డాన్ మూవీ పాట మూవీ నటీనటులు

శివకార్తికేయన్, ప్రియాంక మోహన్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, సూరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించగా, సినిమాటోగ్రఫీ కె.ఎమ్. భాస్కరన్, సంగీతం అనిరుధ్, బ్యానర్‌పై సుభాస్కరన్, శివకార్తికేయన్‌లు నిర్మించారు. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్.

సినిమా పేరుడాన్
దర్శకుడుసిబి చక్రవర్తి
నటీనటులుశివకార్తికేయన్, ప్రియాంక మోహన్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, సూరి
నిర్మాతలుసుభాస్కరన్, శివకార్తికేయన్‌
సంగీతంఅనిరుధ్
సినిమాటోగ్రఫీకె.ఎమ్. భాస్కరన్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

డాన్ సినిమా ఎలా ఉందంటే?

శివకార్తికేయన్ కేవలం నటుడే కాదు, ఈ చిత్రానికి నిర్మాతలలో ఒకడు మరియు అతను మంచి మాటల రచయిత కూడా.ఇక డాన్ సినిమా కథ కొత్తదేం కాదు , కాలేజ్ లైఫ్, స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ మొదలైనవాటితో మనం చాలా సినిమాలే చూసాం, కానీ డాన్ ని ఎంగేజ్ చేసేలా చేసింది కామెడీ, కామెడీ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది, మీరు కేవలం 2న్నర గంటలు కామెడీ కోసం కూర్చోవచ్చు. ఈ సినిమాలో ఎమోషన్స్ లోపించాయి అని చెప్పొచ్చు.

ఇక సినిమా బాగా మొదలవుతుంది కానీ 15 నిమిషాల తర్వాత సాధారణ కాలేజీ డ్రామా కిందకు వస్తుంది. కానీ దర్శకుడు సిబి చక్రవ ఒక ముఖ్యమైన సమస్యను ప్రస్తావించారు, ఇక్కడ చాలా మంది వ్యక్తులు తమ కోసం జీవించకుండా ఇతరుల కోసం జీవిస్తారు మరియు ఆ పాయింట్ చాలా మంది యువకులకు కనెక్ట్ అవుతుంది.

ఫస్ట్ హాఫ్ ఫన్నీ సీన్స్ మరియు సాంగ్స్‌తో సాగుతుంది, ఫస్ట్ హాఫ్‌లో కొత్తదనం ఏమీ కనిపించదు, అయితే స్టూడెంట్ డాన్ మరియు ప్రిన్సిపల్ మధ్య ఫైట్ ప్రారంభమైనప్పుడు సెకండ్ హాఫ్ ఆసక్తి కరంగ మారుతుంది అయితే క్లైమాక్స్ ఇంకా కొంచెం బాగుండాల్సింది.

శివకార్తికేయ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో చంపేశాడు మరియు ఎస్‌జె సూర్య కాలేజ్ ప్రిన్సిపల్ గా అద్భుతంగా చేసాడు, సూరి అతని పాత్రకి న్యాయం చేసాడు, ప్రియాంక అరుల్ మోహన్ అందంగా కనిపించారు, కానీ ఆమె నటించడానికి స్కోప్ లేదు మరియు మిగిలిన నటీనటులు బాగా చేసారు.

కె.ఎం.భాస్కరన్ సినిమాటోగ్రఫీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు, అనిరుద్ సంగీతంతొ ఎప్పుడూ నిరాశపరచడు మరియు మిగతా టెక్నికల్ టీమ్ తమ వంతుగా బాగా చేసారు.

చివరగా, డాన్ అనేది ఒక సారి చూడదగిన చిత్రం అయితే డాన్ ని యువకులు తప్పక చూడవలసిన చిత్రం

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు