Rajasekhar ‘Shekar’ Telugu Movie Review: శేఖర్ తెలుగు మూవీ రివ్యూ

Shekar Telugu Movie Review: యాంగ్రీ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ 2 దశాబ్దాల క్రితం అగ్ర హీరోలలో ఒకడు, ఇప్పటికీ అతను హీరోగా కొనసాగుతూ చాల సినిమాలు చేస్తున్నాడు, అందులో భాగంగా అతని తాజా చిత్రం ‘శేఖర్’ గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో చాలావినిపిస్తున్న సినిమా అయితే కరోనా కారణంగా సినిమా చాలాసార్లు వాయిదా పడి ఇప్పుడు ఎట్టకేలకు ఈ చిత్రం ఈరోజు మే 20, 2022న విడుదలైంది మరియు చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది, కాబట్టి ఈ చిత్రం చూడదగ్గదా లేదా అనే దానిపై లోతైన సమీక్షలోకి వెళ్దాం.

Shekar Telugu Movie Review

కథ

శేఖర్ (రాజ శేఖర్) రిటైర్డ్ పోలీసు అధికారి మరియు క్రైమ్ సన్నివేశాలను పరిశోధించడంలో నిపుణుడు మరియు ఒక్క క్షణంలో నేరస్థుడిని కనుగొనడంలో మాస్టర్, అతని నైపుణ్యాన్ని ఉపయోగించి, ప్రస్తుత పోలీసు అధికారులు డబుల్ మర్డర్ కేసును ఛేదించడానికి అతని సహాయం తీసుకుంటారు ఈ ప్రాసెస్ లో అతని భార్య ఇందు (ఆత్మీయ రాజన్) నుండి విడిపోయిన అతని జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి, ఒకరోజు ఇందు యాక్సిడెంట్ కి గురవుతుంది, అయితే ఇందు దురదృష్టవశాత్తు ఆసుపత్రిలో చనిపోతుంది, వెంటనే శేఖర్ తన తన ఇన్వెస్టిగేషన్ ని ప్రారంభిస్తాడు, అయితే తన భార్య యాక్సిడెంట్‌తో చనిపోలేదని,ఎవరో హత్య చేశారని తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది. చివరకు భార్యను హత్య చేసింది ఎవరు? అతను కేసును పరిష్కరిస్తాడా? ఇందు అతని నుండి ఎందుకు విడిపోయింది? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

శేఖర్ మూవీ నటీనటులు

డా.రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్ కుబ్చంధాని, అభినవ్ గోమతం, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవివర్మ, శ్రవణ్ రాఘవేంద్ర, మరియు ఈ చిత్రానికి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించగా, సినిమాటోగ్రఫీ మల్లికార్జున్ నారగాని, సంగీతం సమకూర్చారు అనూప్ రూబెన్స్ మరియు పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్, త్రిపుర క్రియేషన్స్ బ్యానర్లపై బీరం సుధాకర రెడ్డి, బొగ్గరం వెంకట శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుశేఖర్
దర్శకుడుజీవిత రాజశేఖర్
నటీనటులుడా.రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్ కుబ్చంధాని, అభినవ్ గోమతం, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవివర్మ, శ్రవణ్ రాఘవేంద్ర
నిర్మాతలుబీరం సుధాకర రెడ్డి, బొగ్గరం వెంకట శ్రీనివాస్
సంగీతంఅనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీమల్లికార్జున్ నారగాని
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

శేఖర్ సినిమా ఎలా ఉందంటే?

థ్రిల్లర్ మరియు ఇన్వెస్టిగేటివ్ సినిమాలు ఎప్పుడూ బోర్ కొట్టవు, ఈ ఆధునిక కాలంలో కథాంశం ప్రత్యేకంగా ఉండాలి, అయితే ఇది జోజు జార్జ్ యొక్క మలయాళ సూపర్‌హిట్ చిత్రం జో సెఫ్(2018)కి రీమేక్, మేకర్స్ మాత్రం ఇది రీమేక్ అని ఎక్కడ చెప్పలేదు. కానీ జోసెఫ్ గురించి తెలిసిన వారికి తెలుస్తుంది, 2018 లో ఇది అద్భుతమైన కథ మరియు ప్రత్యేకమైన కథాంశం మరియు పాత్ర రూపకల్పన, కానీ 2022 విషయానికి వస్తే ఇది అంత ప్రత్యేకమైన కథాంశం కాదు మరియు శేఖర్ లో చాలా రొటీన్ సన్నివేశాలు కలిగి ఉండడం వల్ల బహుశా అది సినిమాకు లోపమేమో.

శేఖర్ సినిమా బాగా ప్రారంభమవుతుంది, దర్శకురాలు హీరో ప్రపంచంలోకి వెళ్ళడానికి ఎక్కువ సమయమ తీసుకోకుండా కథ ని చెప్పే ప్రయటం చేసారు, కానీ సినిమా వెళ్లే కొద్దీ ప్రేక్షకులకి ఇది థ్రిల్లర్ సినిమా నా అని అనిపిస్తుంది? సినిమాలో కొన్ని ట్విస్ట్‌లు మరియు మలుపులు ఉన్నాకూడా కానీ అవి కథలో సరిగ్గా ఇమడలేదు, శేఖర్ పాత్రలో రాజశేఖర్ ఓకే, అతనికి వయసు మనం స్పష్టంగా చూడవచ్చు, పాత్ర రిటైర్డ్ కాప్ అయినప్పటికీ, ఆ పాత్ర దర్యాప్తు చేసేటప్పుడు కొంత ఆక్టివ్ నెస్ కావాల్సి వస్తుంది, కానీ దర్యాప్తు చేసేటప్పుడు అతను శారీరకంగా బలహీనంగా ఉన్నట్టు అన్పిస్తుంది, రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ అదే పాత్రను పోషించారు. ఆమె కొన్ని భాగాలలో బాగుంది మరియు మిగిలిన తారాగణం బాగా చేసింది.

జీవితా రాజశేకర్ దర్శకురాలిగా కొత్త కాదు, నేటి చిత్రాల నిర్మాణ విధానంలో చాలా మార్పు వచ్చింది మరియు ప్రేక్షకులను కట్టిపడేయడంలో పూర్తిగా విఫలమైనందున ఆమె తనను తాను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. మరియు మల్లికార్జున్ నారగాని సినిమాటోగ్రఫీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు మరియు అనూప్ రూబెన్స్ సంగీతం థ్రిల్లర్ సినిమాలకు సరిపోలేదు కానీ ప్రయత్నించారు కానీ అది సరిగ్గా కుదరలేదు మరియు మిగిలిన టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ తమ వంతు బాగా చేసారు.

చివరగా, శేఖర్ అన్ని వర్గాల ప్రేక్షకుల కోసం తీసింది కాదు మరియు మీరు థ్రిల్లర్‌ల అభిమాని అయితే, మీరు ఒకసారి ప్రయత్నించవచ్చు.

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి:

 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు