Lakshya Movie Review: చాక్లెట్ బాయ్ లా కనిపించే నాగశౌర్య ఒక్క సారిగా 8 ప్యాక్ తో టాలీవుడ్ ని షేక్ చేసాడు. నాగశౌర్య, జగపతి బాబు, కేతిక శర్మ, సచిన్ ఖేడేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “లక్ష్య” థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. స్పోర్ట్ కాన్సెప్ట్ తో ఇప్పటివరకు చాలా మూవీస్ వచ్చాయి. కానీ ఆర్చరీ (విలు విద్య) స్పోర్ట్ బేస్ తో వచ్చిన మూవీస్, తెలుగులో అసలు లేవనే చెప్పాలి. ఆడియన్స్ హై ఎక్సపెక్టషన్స్ ని ఈ సినిమా రీచ్ అయిందనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఈ సినిమాకి మంచి టాక్ వినిపిస్తుంది. మొదటి వారమే ఈ సినిమా 20 కోట్లు కలెక్షన్స్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
లక్ష్య మూవీ రివ్యూ (Lakshya Movie Review)
ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి, ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. నారాయణ్ దాస్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. కాలభైరవ సంగీతాన్ని అందించగా.. రామ్ కెమెరా మెన్ గా వర్క్ చేశారు.
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. నాగ శౌర్య ఆర్చరీ స్పోర్ట్ ప్లేయర్ గా ప్రధానపాత్రలో కనిపిస్తాడు. జగపతి బాబు నాగ శౌర్యకి కోచ్ గా నటించారు. కేతిక శర్మ హీరోయిన్ గా అద్భుతంగా నటించింది. డైరెక్టర్ ధీరేంద్ర సంతోష్ అన్నట్లుగా ఈ స్పోర్ట్ డ్రామా మూవీ అన్నిమూవీస్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టకుండా అద్భుతంగా తెరకెక్కించారు.
ఈ సినిమాలో నాగ శౌర్య 8 ప్యాక్ లో కనిపించాడు. 8 ప్యాక్ లో కనిపించడానికి నాగశౌర్య చాలా కష్టపడ్డాడు. 8 ప్యాక్ అలాగే కనిపించడానికి మూడు రోజులపాటు అసలు మంచినీరే తాగలేదంటే నాగశౌర్య డెడికేషన్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే “రొమాంటిక్” మూవీ తో తన అంధ చందాలతో యూత్ ని మత్తులో ముంచుతున్న కేతిక.. ఈ సినిమాలో అద్భుతం గా యాక్ట్ చేశారు. ఆలస్యం చేయకుండా ఈ సినిమాను చూసెయ్యండి. స్పోర్ట్ డ్రామా అయినప్పటికి భిన్నమైన కాన్సెప్ట్ ఉంది కాబట్టి మీరు బోర్ ఫీల్ కారు.
మూవీ రేటింగ్ (3.5/5) సూపర్ హిట్
ఇవి కూడా చూడండి:
- Muddy Review : మడ్డి రివ్యూ
- Muddy Boxoffice Collections: మడ్డి బాక్సాఫీస్ కలెక్షన్స్
- Gamanam Movie Review: గమనం మూవీ రివ్యూ
- Gamanam Box Office Collection: గమనం బాక్స్ ఆఫీస్ కలెక్షన్