The Warriorr Telugu Movie Review: ది వారియర్ తెలుగు మూవీ రివ్యూ

The Warriorr Telugu Movie Review: రామ్ నటించిన చిత్రం ది వారియర్, ఇది గత కొన్ని రోజులుగా చాలా బజ్ క్రియేట్ చేస్తోంది అయితే లింగుసామి మరియు రామ్ కలయిక ఒక కారణం అని చెప్పొచ్చు, అయితే, ట్రైలర్విడుదల అయ్యాక అంచనాలుతార స్థాయికి చేరుకున్నాయి, అయితే ఈ భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఎట్టకేలకు ఈరోజు జూలై 14, 2022న విడుదల చేసింది, అయితే, చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది ఏది ఏమైనా ఇక ఆలస్యం చేయకుండా ఈ చిత్రం చూడదగినదో లేదో చూద్దాం.

The Warriorr Telugu Movie Review

కథ

పోలీసు అధికారి అయిన సత్య(రామ్ పోతినేని) DSPగా ప్రమోషన్ పొంది, కర్నూలులో DSPగా బాధ్యతలు స్వీకరిస్తాడు, అక్కడ కర్నూలు నగరం గురు(ఆది పినిశెట్టి) అనే అత్యంత పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ చేతులో ఉంటుంది, అయితే, సత్య నగరంలో తన చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఆపడానికి గురుతో గొడవకి దిగడంతో కథ మలుపు తిరుగుతుంది, అదే సమయంలో సత్య వృత్తిరీత్యా రేడియో జాకీ అయిన విజిల్ మహాలక్ష్మి (కృతి శెట్టి)ని కలుస్తాడు అయితే,ఇక్కడే కథలో ట్విస్ట్ పుడుతుంది. చివరకు అది ఏమిటి? సత్య గురుని ఎలా హ్యాండిల్ చేసాడు? మరియు ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు సినిమా చూడాల్సిందే.

ది వారియర్ మూవీ నటీనటులు

రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా మొయిదు, దర్శకత్వం లింగుసామి వహించిన ఈ చిత్రానికి , ఛాయాగ్రహణం: సుజిత్ వాసుదేవ్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.

సినిమా పేరుది వారియర్
దర్శకుడులింగుసామి
నటీనటులురామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా మొయిదు
నిర్మాతలుశ్రీనివాస చిట్టూరి
సంగీతందేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీసుజిత్ వాసుదేవ్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

ది వారియర్ సినిమా ఎలా ఉందంటే?

మనం ఇదివరకు చాలా COP డ్రామాలు మరియు పోలీస్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలను చూశాము అయితే ది వారియర్ విషయానికి వస్తే రామ్ మరియు మేకర్స్ ఈ చిత్రం రెగ్యులర్ కాప్ డ్రామా కాదని ఇంటర్వ్యూల్లో చెప్పారు, ఈ చిత్రం సాధారణ పోలీసు చిత్రంగా కనిపించినప్పటికీ దానికి కారణం ప్రేక్షకులు థియేట్రికల్ అనుభవాన్ని ఆస్వాదించాలని నిర్మాతల ఉద్దేశ్యంతో చాలా దాచి ఉంచారు.

రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల మాదిరిగానే హీరో పరిచయం మరియు అతని ప్రపంచాన్ని పరిచయం చేయడంతో సినిమా మొదలవుతుంది ఆ తరువాత విలన్‌ను పరిచయం చేస్తారు, అయితే, గురుతో సత్య ముఖాముఖితో సినిమా ఆసక్తికరంగా మారుతుంది,చిత్రం యొక్క మొదటి సగం సాధారణ పోలీసు మరియు విలన్ యొక్క ఫైట్ తో గడిచి పోతుంది మరియు రెండవ సగం చిత్రానికి వెన్నెముక అని చెప్పొచ్చు ఎందుకంటే చిత్రం యొక్క ప్రధాన భావోద్వేగం ద్వితీయార్ధంలోనే ఉంటుంది మరియు ఇది చాలా బాగా పనిచేసింది కూడా, పైగా సెకండాఫ్ చాలా బాగా రాసారు.సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూస్తున్నట్లు అనిపించవచ్చు.

ప్రమోషన్స్‌లో రామ్‌ చెప్పినట్లుగా, థియేటర్లలో ఉత్తేజపరిచేందుకు చాలా ఎలిమెంట్స్ దాచి ఉంచాము అని అలాగే థియేటర్ లో విజిల్స్ వేసే సన్నివేశాలు చాలానే ఉంటాయి హీరో మరియు హీరోయిన్ ట్రాక్ సినిమా ప్రవాహానికి భంగం కలిగించినప్పటికీ హీరోయిక్ మూమెంట్, విలన్ ఎలివేషన్స్‌ అన్నిమిమ్మల్ని తప్పకుండా ఉత్తేజపరుస్తాయి.మరియు ఎమోషన్స్ అన్నీ బాగానే పండాయి అని చెప్పొచ్చు, అయితే, క్లైమాక్స్ ఇంకా బాగుండాల్సింది

రామ్ రొమాంటిక్ చిత్రాలకు ప్రసిద్ది చెందాడు, ఎందుకంటే అతను కొన్ని యాక్షన్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలను ప్రయత్నించినప్పటికీ,ఏ సినిమా కూడా బాగా ఆడలేదు, అతను ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ కొట్టిన తర్వాత అతను పూర్తిగా ఆక్షన్ సినిమాలపై దృష్టి సారించాడు.రామ్‌కి పోలీస్ పాత్ర చేయడం ఇదే మొదటిసారి అయినప్పటికీ సత్యగా రామ్ తన మేక్ఓవర్, అతని డైలాగ్ డెలివరీ ప్రతిదీ అధిభూతంగా ఉంటుంది అయితే ఇది అతని కెరీర్‌లో అత్యుత్తమ నటన అని మనం చెప్పగలం, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి బాగానే ఉంది ఆమెకు నటించడానికి మరియు స్కోప్ లేదు అయితే, ఆమె బుల్లెట్ మరియు విజిల్ సాంగ్‌లో రామ్‌తో అద్భుతంగా డాన్స్ చేసింది మరియు నదియాకు మంచి పాత్ర లభించింది మరియు మిగిలిన నటీనటులు తమ నటనను ప్రదర్శించారు.

లింగుసామి స్టైలిష్ యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి చెందాడు, ఎందుకంటే అతను తమిళంలో కొన్ని ఉత్తమ చిత్రాలను తీశాడు అవి రన్, పందెం కోడి మరియు ఆవారా వంటి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం, అయినప్పటికీ, సరైన భావోద్వేగాలతో కూడిన స్టైలిష్ యాక్షన్ చిత్రాలు అతిపెద్ద బలం. లింగుసామి మార్క్ టేకింగ్ చూడగలిగే సన్నివేశాలు చాలానె ఉన్నాయ్, అయితే, అతను ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో విజయం సాధించాడు

సాంకేతికంగా ది వారియర్అద్భుతంగా కనిపిస్తుంది సుజిత్ వాసుదేవ్ యొక్క విజువల్స్ సినిమాకు సరిపోయేలా ఉంది DSP పాటలు బుల్లెట్ మరియు విజిల్ వంటి చార్ట్‌ బస్టర్‌లుగా నిలిచాయి. అయినప్పటికీ, అతను తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు, మరియు మిగిలిన డిపార్ట్‌మెంట్ బాగా చేసింది.

చివరగా, ది వారియర్ పైసా వసూల్ చిత్రం మరియు ఎవరైనా థియేటర్ అనుభవాన్ని ఆస్వాదించాలనుకుంటే, వారియర్ తప్పక చూడవలసిన చిత్రం.

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు