Parampara S2 Telugu Web Series Review: పరంపర వెబ్ సిరీస్ రివ్యూ

Parampara Season 2 Telugu Web Series Review: పరంపర అనేది ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ హాట్‌స్టార్‌లో విడుదలై, మొదటి సీజన్‌తో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సిరీస్. 2వ సీజన్ ఇప్పుడు అదే ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. ఈ సిరీస్ లో జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర వంటి ప్రతిభావంతులైన నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సిరీస్ యొక్క లోతైన సమీక్షలోకి వెళ్దాం మరియు ఈ సిరీస్ చూడొచ్చా లేదా అని తెలుసుకుందాం.

Parampara Telugu Web Series Review

కథ

గోపితో రచనకు ఉన్న సంబంధం గురించి నాయుడుకి నిజం తెలియడంతో సీజన్ 1 ముగుస్తుంది. నాయుడు గోపిని అరెస్ట్ కూడా చేయిస్తాడు. సురేష్ ఈ సందర్భాన్ని రచనను దగ్గరవడానికి వాడుకుంటాడు. నిస్సహాయంగా ఉన్న గోపి తండ్రి, తన కొడుకుని ఇంటికి ఎలాగైనా తిరిగి రప్పించి, అన్ని చక్కదిద్దాలని ప్రయత్నిస్తాడు. కాని నాయకుడిగా నాయుడు యొక్క అధికారంతో విసిగిపోయిన గోపి, అతనిని అధికారం నుండి తొలగించి, తన తండ్రిని ఆ స్థానంలో చూడాలనుకుంటాడు. ఆ తర్వాత ఏర్పడే పరిస్థితులే మిగిలిన కథ.

పరంపర 2 సిరీస్ నటీనటులు

ఈ సిరీస్ లో జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, ఆకాంక్ష సింగ్, ఇషాన్, నైనా గంగూలీ, దివి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణ విజయ్ & విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆర్కా మీడియా వర్క్స్ నిర్మాణంలో నిర్మించబడింది. ఈ సిరీస్ కి సంగీతం నరేష్‌ కుమారన్‌, కెమెరా SV విశ్వేశ్వర్‌, ఎడిటింగ్‌ తమ్మిరాజుకు అప్పగించారు.

సిరీస్ పేరుపరంపర 2
దర్శకుడుకృష్ణ విజయ్ & విశ్వనాథ్ అరిగెల
నటీనటులుజగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర, ఆకాంక్ష సింగ్, ఇషాన్, నైనా గంగూలీ, దివి
నిర్మాతలుఆర్కా మీడియా వర్క్స్
సంగీతంనరేష్‌ కుమారన్‌
సినిమాటోగ్రఫీSV విశ్వేశ్వర్‌
ఓటీటీ రిలీజ్ డేట్జులై 21, 2022
ఓటీటీ ప్లాట్ ఫార్మ్Disney+Hotstar

పరంపర 2 సిరీస్‌ ఎలా ఉందంటే?

కుటుంబంలో రాజకీయాలు సృష్టించడం ద్వారా మొదటి సీజన్‌లో సృష్టించిన ఆసక్తి తెలుగు సూపర్‌హిట్ చిత్రం ప్రస్థానం ని గుర్తుచేస్తుంది, అలాగే చాలా మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 1వ సీజన్‌లో కొన్నిసార్లు నెమ్మదిగా ఉన్నట్లు అనిపించినా, ప్రేక్షకులు సిరీస్‌ని పూర్తిగా వీక్షించేలా చేసింది. సీజన్ 2 ఇదే మార్గాన్ని అనుసరిస్తుంది మరియు పాత్రల మధ్య జరిగే సంఘర్షణను సరిగ్గా ప్రెజెంట్ చేయాల్సిన అవసరం ఉన్నందున, కొన్నిసార్లు స్క్రీన్‌ప్లే నెమ్మదిగా అనిపిస్తుంది. పాత్రల మధ్య జరిగే సంఘర్షణ, దానివల్ల వచ్చే సన్నివేశాలు ప్రతిదీ ఈ సీజన్‌లో మనల్ని అలరిస్తాయి.

నవీన్ చంద్ర నటుడిగా మరోసారి తన సత్తా చాటాడు, జగపతి బాబు బాగా చేసాడు, అయినా మనం ఇంతకుముందు ఆయన్ని ఇలాంటి పాత్రల్లో చాలాసార్లు చూసేసాం. శరత్ కుమార్ మునుపటి సీజన్‌లో లాగానే స్టైలిష్‌గా కనిపిస్తాడు మరియు కొన్ని సన్నివేశాలలో నటుడిగా తనదైన ముద్ర వేస్తాడు, కానీ అతని వాయిస్ డబ్బింగ్ కొద్దిగా నిరాశపరిచింది. ఆకాంక్ష సింగ్, ఇషాన్‌లు తమ పాత్రలకు న్యాయం చేసారు.

ప్రతి ఎపిసోడ్‌లో సిరీస్ రిచ్‌గా కనిపిస్తుంది. నిర్మాతలు దర్శకులకు అవసరమైన మేరకు బాగా ఖర్చు పెట్టారు. సిరీస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ SV విశ్వేశ్వర్ నాణ్యమైన విజువల్స్ అందించడంలో బాగా పనిచేశారు. దర్శకులు కృష్ణ విజయ్ & విశ్వనాథ్ అరిగెల ఈ సిరీస్‌ని ప్రతి పాయింట్‌లో ఆసక్తికరంగా చూపించడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారు.

చివరగా, పరంపర సీజన్-2 ఖచ్చితంగా అందరిని ఆకట్టుకునే ఒక రాజకీయ మరియు కుటుంబ కలహాల కథ. ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఈ సిరీస్ ని చూసేయండి.

సినిమా రేటింగ్: 3.75/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు