Ranga Ranga Vaibhavanga Movie Review: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి, తొలి సినిమా ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మరో హీరో పంజా వైష్ణవ్ తేజ్. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ నటించిన రెండో చిత్రం కొండపొలం డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్ ‘రంగ రంగ వైభవంగ’తో వచ్చాడు మరియు ఈ సినిమా ఈరోజు సెప్టెంబర్ 02, 2022న థియేటర్‌లలో విడుదలైంది. సమయాన్ని వృథా చేయకుండా ఈ సినిమా గురించి లోతైన సమీక్షలోకి వెళ్దాం, అలాగే ఈ సినిమాని థియేటర్లలో చూడొచ్చా లేదా అనేది తెలుసుకుందాం.
కథ
రిషి మరియు రాధ చిన్ననాటి స్నేహితులు, అయితే ఒక చిన్న సంఘటన ఈ స్నేహితులను శత్రువులుగా మారుస్తుంది. చిన్నతనంలో ఒక చిన్న సమస్యతో, తమలో ఎవరైనా మౌనాన్ని బ్రేక్ చేసేవరకు ఒకరితో ఒకరు మాట్లాడకూడదని నిర్ణయించుకుంటారు. వారి కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉన్నప్పటికీ, వాళ్ళిద్దరి మధ్య విభేదాలను పరిష్కరించడానికి వారు ఎంత ప్రయత్నించినా, రిషి మరియు రాధల అహం పెరుగుతూనే ఉంటుంది. ఇంత ద్వేషం, అహంభావం ఉన్నప్పటికీ రిషి, రాధ ఒకరినొకరు ఎలా ఆరాధించుకునేవారు, వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనేది మిగతా కథ.
రంగ రంగ వైభవంగ మూవీ నటీనటులు
రంగ రంగ వైభవంగ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, నవీన్ చంద్ర, సుబ్బరాజు, అలీ, ప్రభు, నరేష్, సత్య, రాజ్‌కుమార్ కసిరెడ్డి, హర్షిణి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం గిరీశయ్య మరియు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ మరియు ఛాయాగ్రహణం శాందత్ సైనుద్దీన్.
సినిమా పేరు | రంగ రంగ వైభవంగ |
దర్శకుడు | గిరీశయ్య |
నటీనటులు | పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, నవీన్ చంద్ర, సుబ్బరాజు, అలీ, ప్రభు, నరేష్, సత్య, రాజ్‌కుమార్ కసిరెడ్డి, హర్షిణి |
నిర్మాతలు | బివిఎస్ఎన్ ప్రసాద్ |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
సినిమాటోగ్రఫీ | శాందత్ సైనుద్దీన్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
రంగ రంగ వైభవంగ సినిమా ఎలా ఉందంటే?
రంగ రంగ వైభవంగ సినిమా మొదటి సన్నివేశం నుంచే ఊహించవచ్చు. ఈ తరహా కథలు చాలా తెలుగు సినిమాలలో కనిపిస్తాయి, ప్రధాన పాత్రలు చిన్నప్పటి నుండి ఎప్పుడూ ఏదో ఒక కారణంతో గొడవపడి, ఆ తర్వాత ప్రేమలో పడి ఒకరి పట్ల ఒకరికి ఉన్న అభిప్రాయాన్ని మార్చుకునే సమయంలోనే, వారి కుటుంబాల మధ్య గొడవలు ఏర్పడతాయి. ఇలాంటి పాయింట్‌పై ఎన్నో సినిమాలు వచ్చాయి. రంగ రంగ వైభవంగ కూడా అదే పద్ధతిని అనుసరిస్తుంది మరియు ఈ సినిమాలో చూడటానికి కొత్తది ఏమీ లేదు. అయితే ఈ సినిమాలో ఫ్రెండ్‌షిప్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫైట్స్, సాంగ్స్ ఇలా అన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. సినిమా మొదటి సగం లేదా 2వ సగంలో సినిమాలని విపరీతంగా చూసేవారిని ఆకర్షించే కొత్త సన్నివేశాలు లేవు.
ఇక నటన విషయానికి వస్తే తన తొలి సినిమాతోనే కాస్త మెప్పించిన పంజా వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో తన నటనతో మెప్పించలేకపోయాడు. అతను విభిన్న భావోద్వేగాలకు ఒకే రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అతని నటనని మెరుగుపరచడానికి అతను మరింత కష్టపడాలి. కేతికా శర్మ కూడా అందాల బొమ్మలా కనిపించినా, ఆమె నటన అంతగా లేదు. నవీన్ చంద్ర తనకు ఆఫర్ చేసిన పాత్రలో డీసెంట్ గా నటించాడు. సీనియర్ నటులు నరేష్, ప్రభు తమ పాత్రలను చక్కగా చేశారు. సత్య మరియు రాజ్‌కుమార్ కసిరెడ్డి కొన్ని నవ్వులు పూయించారు. హర్షిణి మరియు ఇతర నటీనటులు కథకు అవసరమైన విధంగా తమ వంతు కృషి చేశారు.
టెక్నికల్‌గా రంగ రంగ వైభవంగ యావరేజ్‌గా ఉంది. సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు గుర్తుంచుకునేలా లేవు మరియు గత కొన్ని సినిమాల నుండి, అతను చిత్రానికి తాను కంపోజ్ చేసిన పాటల నుండి నేపథ్య సంగీతాన్ని జోడించడం ప్రారంభించాడు, సన్నివేశాల అవసరానికి అనుగుణంగా కొత్తదాన్ని జోడించలేదు. శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు మరియు కొన్ని సన్నివేశాలు కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి, అయితే కొన్ని సన్నివేశాలు స్క్రీన్‌పై మరీ
ఎక్కువ రంగులతో కలవరపెట్టవచ్చు. బివిఎస్ఎన్ ప్రసాద్ దర్శకుడికి కావాల్సినంత స్వేచ్ఛనిచ్చాడు మరియు ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.
తమిళంలో ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌తో సక్సెస్‌ని రుచి చూసిన దర్శకుడు గిరీశయ్య, తెలుగు ప్రేక్షకులకు కొత్త కంటెంట్‌ని అందించడంలో విఫలమయ్యాడు. రంగ రంగ వైభవంగ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకర్షించే అన్ని అంశాలు ఉన్నప్పటికీ, ఈ సినిమా కథ మరియు కథనం నిరాశపరిచింది.
ఓవరాల్‌గా, రంగ రంగ వైభవంగా ఒక యావరేజ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు ఫన్ కోసం ఒకసారి చూడొచ్చు.
ప్లస్ పాయింట్లు:
నిర్మాణ విలువలు
కొన్ని ఎమోషనల్ మరియు కామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్లు:
హీరో హీరోయిన్
కథ
సంగీతం
సినిమా రేటింగ్: 2.5/5
ఇవి కూడా చుడండి: