Oke Oka Jeevitham Movie Review: నటుడు శర్వానంద్ చాలా బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు మరియు అతని గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. అతని చివరి చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ కూడా డిజాస్టర్‌గా ప్రకటించబడింది, అయినా డీలా పడిపోకుండ అతను ‘ఒకే ఒక జీవితం’ అనే కొత్త కాన్సెప్ట్ చిత్రంతో మల్లి మన ముందుకు వచ్చాడు, ఈ సినిమా ఇదే రోజు తమిళంలో ‘కణం’ టైటిల్‌తో విడుదలైంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించడంలో శర్వానంద్ సక్సెస్ అయ్యాడో లేదో తెలుసుకోవడానికి ఈ సినిమా వివరణాత్మక సమీక్షలోకి వెళ్దాం.
కథ
మంచి గాయకుడు కావాలనుకునే ఆది, ఎక్కువ మంది వ్యక్తుల ముందు ప్రదర్శన చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటాడు. అతని స్నేహితులు శీను మరియు చైతూ వారి జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ ముగ్గురు స్నేహితులు ఒక శాస్త్రవేత్తను కలుస్తారు, అతను కాలక్రమేణా మనిషి ప్రయాణించగలడని నమ్ముతాడు. తన అమ్మని ఎలాగైనా ఒక్కసారైనా కలవాలని గతంలోకి ప్రయాణించడానికి డిసైడ్ అవుతాడు ఆది. ఈ నిర్ణయం తర్వాత ఆది, శీను, చైతు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది మిగతా కథ.
ఒకే ఒక జీవితం మూవీ నటీనటులు
ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్, అలీ, రవి రాఘవేంద్ర, యోగ్ జప్పె, మధునందన్, జై ఆదిత్య, నిత్యరాజ్, & హితేష్ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీ కార్తీక్ వహించారు. నిర్మాతలు ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జేక్స్ బిజోయ్ మరియు సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్.
సినిమా పేరు | ఒకే ఒక జీవితం |
దర్శకుడు | శ్రీ కార్తీక్ |
నటీనటులు | శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్, అలీ, రవి రాఘవేంద్ర, యోగ్ జప్పె, మధునందన్, జై ఆదిత్య, నిత్యరాజ్, & హితేష్ |
నిర్మాతలు | ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు |
సంగీతం | జేక్స్ బిజోయ్ |
సినిమాటోగ్రఫీ | సుజిత్ సారంగ్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
ఒకే ఒక జీవితం సినిమా ఎలా ఉందంటే?
తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలు చాలా అరుదుగా చూస్తుంటాం. బహుశా తెలుగులో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఉన్న ఫుల్ లెంగ్త్ మూవీ ఆదిత్య 369 మాత్రమే. ఇలా చూస్కుంటే ఒకే ఒక జీవితం రెఫ్రెషింగ్ కంటెంట్, ఎందుకంటే మనం థ్రిల్లర్స్, డ్రామాలు, రొమాన్స్ వంటి ప్రత్యేకమైన జానర్‌లను మాత్రమే చూస్తున్నాము. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. కానీ సినిమా కథనంలో కొన్ని లోపాలున్నాయనేది నిజం, అది కొంత మంది ప్రేక్షకులకు బోరింగ్ అనిపించవచ్చు. టైమ్ ట్రావెల్, డెస్టినీ అనే కాన్సెప్ట్‌ని వివరించడానికి సినిమా ప్రయత్నించిన విధానం ప్రశంసనీయం.
ఇక నటన విషయానికి వస్తే తల్లిని ప్రేమించే ఆదిగా శర్వానంద్ ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లో అతని నటన అతను ఎంత మంచి నటుడో స్పష్టంగా చూపిస్తుంది. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత తెలుగులో తెరపై కనిపించిన అమల అక్కినేని ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా కనిపించింది. రీతూ వర్మకు స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఆమె తన వంతు పాత్రను బాగానే చేసింది. ‘వెన్నెల’ కిషోర్, ప్రియదర్శి కూడా తమ పాత్రలను చక్కగా పోషించి కొన్ని సన్నివేశాల్లో నవ్వులు పూయించారు. నాజర్ ఎప్పుడూ క్యారెక్టర్‌లో జీవించి, నమ్మశక్యంగా కనిపిస్తాడు. మిగతా నటీనటులందరూ కథకు అవసరమైన విధంగా తమ వంతు పాత్రను చక్కగా చేశారు.
టెక్నికల్‌గా ఓకే ఒక జీవితం సినిమా ఓకే అనిపించింది. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం బాగుంది, అమ్మ పాట & ఒకటే కదా పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సినిమా మూడ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు మరియు కొన్ని షాట్లు తెరపై అందంగా కనిపిస్తాయి. సినిమాలో బడ్జెట్ పరంగా కొన్ని రాజీలను చూడవచ్చు మరియు VFX కోసం ఎక్కువ బడ్జెట్ అవసరం కాబట్టి ఇది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ సినిమాలకు సాధారణం. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.
దర్శకుడు శ్రీ కార్తీక్ తన మేకింగ్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఈ నూతన దర్శకుడు టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్‌ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అందరికీ అర్థమయ్యేలా డీల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.
ఓవరాల్‌గా చెప్పాలంటే, తెలుగులో ఎమోషనల్ డ్రామా కలగలిసిన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌పై వచ్చిన ఓకే ఒక జీవితం చాలా మంచి ప్రయత్నం. కొత్త కంటెంట్ కోసం ఈ చిత్రాన్ని ఖచ్చితంగా థియేటర్లలో చూడవచ్చు.
ప్లస్ పాయింట్లు:
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్
దర్శకత్వం
నటీనటుల పనితీరు
మైనస్ పాయింట్లు:
కొన్ని సాగదీసిన సన్నివేశాలు
సినిమా రేటింగ్: 3.75/5
ఇవి కూడా చుడండి: