ఈవారం రిలీజ్ఈ అవుతున్న సినిమాలు: వారం థియేటర్లలో ఓటీటీల్లో చాలా పెద్ద సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. మూవీ లవర్స్ కి ఇది పెద్ద పండగనే చెప్పుకోవచ్చు. కొందరు మూవీ లవర్స్ ఏ సినిమా ముందు థియేటర్లలో చూడాలో అర్ధం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ వారం అంటే డిసెంబర్ 17 వరకు 6 భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో ఓటీటీల్లో కలిపి రిలీజ్ అవుతున్నాయి. వాటి వివరాలు చూసెద్దాం.
ఈ వారం విడుదలవుతున్న సినిమాలు
పుష్ఫ (Pushpa)
పుష్ప సినిమా భారీ బడ్జెజ్ ప్యాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ లో మొదటిసారి ఎంట్రీ ఇస్తున్న చిత్రం. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 17న ఐదు భాషల్లో.. అంటే తమిళ్, కన్నడ, మళయాళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది.
స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ (Spider man no way home)
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ అవైటింగ్ సినిమ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. భారత్ లో ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో డిసెంబర్ 16న రిలీజ్ అవుతుంది. ఇక కథ విషయానికి వస్తే స్పైడర్ మ్యాన్ ఐడెంటటీ రివీల్ అవుతుంది. పీటర్ డాక్టర్ స్ట్రేంజ్ ని సహాయం కోరతాడు. తర్యాత ఏమవుతుందనేదే మేయిన్ స్టోరీ.
బ్యాక్ డోర్ (Back Door)
పూర్తి రొమాంటిక్ కథాంశంలో తెరకెక్కుతున్న ససిమా “బ్యాక్ డోర్” డిసెంబర్ 18న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. కర్రి బాలాజీ సినిమాని డైరెక్ట్ చేయగా శమ్న కాసిం, తేజ త్రిపురన ప్రధాన పాత్రల్లో నటించారు. మ్యారీడ్ వుమెన్ యంగ్ లవర్ తో సాగే రొమాటిక్ కథతో సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు.
మా కథలు (Maa Kathalu)
మా కథలు సినిమా డిసెంబర్ 17న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. విజయ్ పెందుర్తి ఈ సినిమా కథని రాయడంతో పాటు దర్శకత్వం వహించారు. ఐదు మంది వివిధ సమస్యల్లో ఉంటారు. ఈ ఐదుమంది ఒకరినొకరు కలుసుకొన్నప్పుడు కథ ఎలా అడ్డం తిరుగుందనేది మెయిన్ కాన్సెప్ట్.
మరక్కర్ (Marakkar)
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా మరక్కర్. ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో రిలీజ్ అయి 150 కోట్లను కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 17న తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ లో కూడా రిలీజ్ అవుతుంది.
అనుభవించు రాజ ( Anubhavinchu Raja)
ఉయ్యాల్ జంపాల ఫేమ్ అజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సినిమా “అనుభవించు రాజ”. ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో రిలీజ్ అయిది. ఆహా ఓటీటీలో డిసెంబర్ 17న రిలీజ్ కాబోతుంది. ఆస్తి బాగా ఉన్న జమిందర్ మనవడి పాత్రలో అజయ్ అద్భుతంగా నటించారు. పూర్తి కామెడీ జానర్ లో సాగే ఈ మూవీని శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్ట్ చేశారు.
ద కంజూరింగ్ 3 (The Conjuring 3)
రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన హారర్ మూవీ ” ద కంజూరింగ్ 3″. డిసెంబర్ 15న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలకి సిద్ధంగా ఉంది. మంచి థ్రిల్, హారర్ కావాలంటే ఈ సినిమాని మిస్ అవకండి. మైఖేల్ చేవ్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు వచ్చిన ధ కంజూరింగ్ మూవీ సీక్వెల్ గా దీనిని నిర్మించారు.
ఇవి కూడా చూడండి: