Crazy Fellow Movie Review: క్రేజీ ఫెలో తెలుగు మూవీ రివ్యూ

Crazy Fellow Movie Review: ఫ్లాప్‌లు ఉన్నప్పటికీ, ఆది సాయికుమార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు, ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆది సాయికుమార్ 1 సంవత్సరంలొ దాదాపు 9 సినిమాలు చేసాడు, ఇన్ని ప్లాపులు వచ్చిన ఇంకా అతనికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ ఎలా వస్తున్నాయో అనేది ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏది ఏమైనప్పటికి క్రేజీ ఫెలో ట్రైలర్ బజ్ క్రియేట్ చేయడంలో విఫలమైంది, అయితే ప్రీ-రిలీజ్ ఈవెంట్కి శర్వానంద్ హాజరైన తర్వాత సినిమా మంచి బజ్‌ని సృష్టించింది, అయితే క్రేజీ ఫెలో ఈరోజు అక్టోబర్ 14, 2022 న విడుదలైంది, ఇక ఆలస్యం చేయకుండా లోతైన సమీక్షలోకి వెళ్దాం మరియు సినిమా చూడదగినదా కాదా అని తెలుసుకుందాం .

Crazy Fellow Movie Review

కథ

క్రేజీ ఫెలో నాని (ఆది సాయికుమార్) అనే కుర్రాడి కథను వివరిస్తాడు, అయితే నాని కి ఏది కూడా పూర్తిగా వినకపోవడం అనే లోపం ఉంటుంది, అందులోను మరియు బాలా త్రిపుర సుందరి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు, అయితే అనుకోకుండా మరొక అమ్మాయిని ప్రేమించాక నానికి కష్టాలు మొదలవుతాయి, చివరికి నాని తన లోపంతో ఇద్దరు అమ్మాయిలను ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ.

క్రేజీ ఫెలో మూవీ నటీనటులు 

ఆది సాయి కుమార్, దిగంగన సూర్యవంశీ, మర్నా మీనన్, సప్తగిరి, నర్రా శ్రీనివాస్, అనీష్ కురువిల్లా, వినోదిని వైద్యనాథన్, రవి ప్రకాష్, పవన్, ప్రియా హెగ్డే, దీప్తి నాయుడు, ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సతీష్ ముత్యాల అందించగా,ఈ చిత్రానికి సంగీతం ఆర్ ఆర్ ధృవన్ అఅందించారు, సత్య గిడుతూరి ఎడిటింగ్ చేసిన ఈ చిత్రానికి శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మాతగా వ్యవహరించారు.

సినిమా పేరుక్రేజీ ఫెలో
దర్శకుడుఫణి కృష్ణ సిరికి
నటీనటులుఆది సాయి కుమార్, దిగంగన సూర్యవంశీ, మర్నా మీనన్, సప్తగిరి, నర్రా శ్రీనివాస్, అనీష్ కురువిల్లా, వినోదిని వైద్యనాథన్, రవి ప్రకాష్, పవన్, ప్రియా హెగ్డే, దీప్తి నాయుడు
నిర్మాతలుకె కె రాధామోహన్
సంగీతంఆర్ ఆర్ ధృవన్
సినిమాటోగ్రఫీసతీష్ ముత్యాల
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

క్రేజీ ఫెలో సినిమా ఎలా ఉందంటే?

ఆది సాయికుమార్ 1 సంవత్సరంలో బ్యాక్ టు బ్యాక్ ‘9’ సినిమాలు చేసాడు, కానీ ఏ సినిమా కూడా సరిగ్గా ఆడలేదు, ఇన్ని ప్లాప్స్ వచ్చిన కూడా క్రేజీ ఫెలో అనే సినిమాతో తాను ఎప్పటికీ మారనని మరోసారి నిరూపించుకున్నాడు, ఆశ్చర్యకరంగా ఈ సినిమా తన కెరీర్‌లో మరో ఫ్లాప్‌ అందంలో ఎలాంటి సందేహంలేదు.

సినిమా గురించి మాట్లాడటానికి ఏమీ లేదు, సినిమాలో సరైన కథ లేదు, కనీసం కామెడీ అయినా బాగుంటే సినిమా కొంత వరకు ఎంగేజ్ అయ్యేదెమో, సినిమా మొత్తం మనం మూస కథ, బలవంతపు కామెడీ మరియు పేలవమైన ప్రదర్శనలను చూస్తాము, సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.

నాని పాత్రలో ఆది సాయికుమార్ అన్ని సినిమాల్లో లాగానే రొటీన్‌గా చేస్కుంటూ వెళ్ళిపోయాడు అతని నుండి ఇంతకు మించి ఆశించలేము కూడా, ఆయన సినిమాలు మానేసి ఇంకేదైనా చేస్తే బాగుంటుంది, ఆయన సినిమాలు ఎలా లాభాలు వస్తున్నయో ఇప్పటికి అర్థంకాని విషయం, దిగంగన సూర్యవంశీ, మర్నా మీనన్‌లు ఫర్వాలేదు చివరికి సప్తగిరి కూడా సినిమాను కాపాడలేకపోయాడు మరియు మిగిలిన నటీనటులు ఓకే.

ఫణి కృష్ణ సిరికి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, అయితే సినిమా చూసిన తర్వాత ఏ వర్గాల వారు కూడా ఈ సినిమాతో ఎంగేజ్ కాలేదని, రచయితగా, దర్శకుడిగా పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు.

సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అంతగా ఆకట్టుకోలేదు, ఆర్ఆర్ ధృవన్ పాటలు గుర్తుంచుకునేలా అయితే లేవు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు, మిగతా టెక్నికల్ డిపార్ట్‌మెంట్లు కథా అవసరాలకు తగ్గట్టుగా పని చేసారు .

ఓవరాల్‌గా, క్రేజీ ఫెలో, ఒక మూస కథతో 2 గంటలు కూర్చోవడం కష్టం, ఒకవేళ మీకు చూడటానికి ఏమీ మిగిలి ఉండకపోతే ఈ సినిమాని రిస్క్ చేయొచ్చు.

ప్లస్ పాయింట్లు:

  • ఏమిలేదు

మైనస్ పాయింట్లు:

  • ప్రతిదీ

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు