Home సినిమా వార్తలు Sardar Telugu Movie Review : సర్దార్: తెలుగు మూవీ రివ్యూ

Sardar Telugu Movie Review : సర్దార్: తెలుగు మూవీ రివ్యూ

0
Sardar Telugu Movie Review : సర్దార్:  తెలుగు మూవీ రివ్యూ

Sardar Telugu Movie Review: PS-1తో భారీ విజయాన్ని అందుకున్న కార్తీ ఇప్పుడు ‘సర్దార్’ అనే మరో ఆసక్తికరమైన చిత్రానికి మన ముందుకొచ్చాడు, ఇరుంబ తురై (తమిళం) అభిమన్యుడు (తెలుగు) ఫేమ్ P.S మిత్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడని సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది మరియు ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేసిన తర్వాత, అంచనాలు రెట్టింపు అయ్యాయి, ఆ అంచనాలను క్యారీ చేస్తూ ఈ సినిమా ఈరోజు అక్టోబర్ 21, 2o22 న విడుదలైంది అయితే ఇక ఆలస్యం చేయకుండా సమీక్షలోకి ప్రవేశిద్దాం మరియు అంచనాలకు అనుగుణంగా ఉందా లేదా అనేది తెలుసుకుందాం.

Sardar Telugu Movie Review

కథ

విజయ్ ప్రకాష్ (కార్తీ) ఒక పోలీసు అధికారి మరియు అతను మీడియా ముందు ట్రేండింగ్ లో ఉండాలి అంకుంటుంటూ 8ఉంటాడు దాని కోసం ఏదైనా చేస్తాడు కూడా అయితే, ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఒక ముఖ్యమైన ఫైల్ కనిపించకుండా పోయినప్పుడు కథ వేరే మలుపు తిరుగుతుంది అందులో పాత సైనిక రహస్యాలు ఉన్నాయని తెలియడంతో CBI మరియు RAW వెతుకుతుంటాయి అయితే విజయ్ ప్రకాష్ ఈ విషయాన్ని తెలుసుకుంటాడు, అతని ఫేమ్ రావాలి అనే ఫోబియా కారణంగా అతను RAW ఇంటెలిజెన్స్ కంటే ముందు ఫైల్‌ను కనుగొనాలని నిర్ణయించుకుంటాడు, తద్వారా అతను ఫైల్ కోసం భారతదేశం అంతటా ట్రెండింగ్ అవుతనాని అనుకుంటాడు. ఈ ప్రక్రియలో విజయ్ ప్రకాష్‌కి తన తండ్రి సర్దార్ గురించి తెలుస్తుంది మరియు అతని మిషన్ గురించి తెలుస్తుంది, చివరగా, విజయ్ ప్రకాష్ మిషన్‌లో ఎలా భాగమయ్యాడు మరియు మిషన్ ఏమిటి అనేది మిగిలిన కథ.

సర్దార్ మూవీ నటీనటులు 

ప్రముఖ పాత్రల్లో కార్తీ మరియు రాశిఖన్నాతో పాటు, చుంకీ పాండే, సిమ్రాన్, మునిష్కాంత్ మరియు మురళీ శర్మ,ఫేమ్ రజిషా విజయన్, తదితరులు, పి .స్ మిత్రన్ దర్శకత్వం వహించాడు, జార్జ్ సి . విలియమ్స్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించాడు, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుసర్దార్
దర్శకుడుపి .స్ మిత్రన్
నటీనటులుకార్తీ, రాశిఖన్నా, రజిషా విజయన్, చుంకీ పాండే, సిమ్రాన్, మునిష్కాంత్, మురళీ శర్మ
నిర్మాతలుఎస్. లక్ష్మణ్ కుమార్
సంగీతంజి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీజార్జ్ సి . విలియమ్స్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

సర్దార్ సినిమా ఎలా ఉందంటే?

P.S మిత్రన్ భారతీయ చలన చిత్రం సినిమా యొక్క అత్యుత్తమ మరియు అత్యంత ప్రత్యేకమైన దర్శకుల్లో ఒకరు, ఎందుకంటే అతను తన తొలి చిత్రం ‘అభిమన్యుడు’ (తెలుగు)తో ఎలా ఆకట్టుకున్నాడో మనందరికీ తెలుసు, బ్యాంక్ మోసాలు, డిజిటల్ మోసాల్లో దాగి ఉన్న నిజాన్ని బయటికి తెచ్చిన మొదటి దర్శకుడు భారతదేశంలో నిస్సందేహంగా అతను మొదటి దర్శకుడు.అయితే ఇప్పుడు అతను ‘సర్దార్’ అనే చిత్రంతో మళ్లీ మెస్మరైజ్ చేయడానికి మన ముందుకొచ్చాడు ఐతే అతని అతని మొదటి చిత్రానికి, దీనికి ఎలాంటి సంబంధం లేదు.

సినిమా మొత్తం ప్రతి సెక్షన్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా అన్ని ఎలిమెంట్స్‌తో సాగే గూఢచారి కథ, సినిమా ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షించే ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్‌తో సినిమా మొదలవుతుంది, సినిమాలో అక్కడక్కడా కొన్ని లోపాలున్నా. నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే మరియు ఆకర్షణీయమైన సన్నివేశాలు ప్రేక్షకులను మొదటి నుండి చివరి వరకు సీటుకు అతుక్కుపోయేలా చేస్తాయి. ఫస్ట్ హాఫ్ రసవత్తరమైన స్క్రీన్‌ప్లేతో సాగింది మరియు ఫ్లాష్‌బ్యాక్ మొదలయ్యాక సెకండాఫ్ వేగం కొంత తగ్గుతుంది కానీ అతి వెంటనే ఆసక్తికరంగామారి క్లైమాక్స్ వరకు ఆసక్తికరంగా ఉంటుంది.

కొన్ని డ్రాగీ సన్నివేశాలు ఉన్నప్పటికీ, సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా అన్నీ అంశాలు ఉన్నాయి మరియు సరైన మొత్తంలో డ్రామా మరియు ఎమోషన్‌లు బాగా పండాయి, ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో కూడిన యాక్షన్ బ్లాక్‌లు మిమ్మల్ని సర్దార్ ప్రపంచంలోకి లాగేస్తాయి అయితే తిరిగి బైటకు వచ్చేటప్పుడు నిరుత్సాహంతో మాత్రం రారు.

కార్తీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసాడు మరియు రెండు పాత్రలను అద్భుతంగా పోషించాడు ముఖ్యంగా అతని బహుళ గెటప్‌లను మెచ్చుకోవాలి, నటనలో తన సత్తా చూపాడు మరియు అతను ఎందుకు అత్యుత్తమ నటుడో మరోసారి నిరూపించాడు, రాసి ఖన్నా లాయర్ పాత్రలో బాగా చేసింది కానీ నటనకు స్కోప్ లేదు మలయాళీ నటి రజిషా విజయన్ ఆమె పాత్రలో బాగా నటించింది మరియు చంకి పాండే మరియు మిగిలిన తారాగణం వారి పాత్రకు అవసరమైన విధంగా బాగా చేసారు.

P.S మిత్రన్ ప్రేక్షకులను కట్టిపడేయడంలో విజయం సాధించాడు, ఎందుకంటే రచనలో అతని ప్రతిభను మనం చూడవచ్చు ఒక గూఢచారి దేశం కోసం తన జీవితాన్ని ఎలా త్యాగం చేస్తాడు మరియు తిరిగి అతని ధైర్య సాహసాల గురించి ఎవరూ మాట్లాడరు ఈ అంశాలన్నీ సినిమాలో చాలా చక్కగా ప్రస్తావించబడ్డాయి.

సాంకేతికంగా, కొన్ని VFX సన్నివేశాలు మినహా సర్దార్ అగ్రశ్రేణిలో ఉంటుంది , జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ చిత్రానికి వెన్నెముక , అతను మొత్తం చిత్రాన్ని చాలా చక్కగా తీశాడు, మరియు కలర్ టోన్లు మరియు గ్రేడింగ్ బాగుంది, GV ప్రకాష్ కుమార్ తన సంగీతంతో ఎప్పుడూ నిరాశపరచలేదు. తమిళ ఫ్లేవర్ కారణంగా తెలుగు పాటలు రిజిస్టర్ కాలేదు కానీ BGM లో తన మార్క్ చూపించాడు, అతను తన BGM తో చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసాడు మరియు మిగిలిన సాంకేతిక విభాగాలు సినిమాకు అవసరమైన విధంగా బాగా చేసాయి.

ఓవరాల్‌గా, సర్దార్ అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసే గూఢచారి చిత్రం.

ప్లస్ పాయింట్లు:

  • కథ
  • స్క్రీన్ ప్లే
  • కార్తీ పెర్ఫార్మెన్స్

BGM

మైనస్ పాయింట్లు:

  • ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు
  • తమిళ ఫ్లేవర్

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here