HIT 2 Movie Review: హిట్ 2 తెలుగు మూవీ రివ్యూ

HIT 2 Movie Review: HIT-The First కేసు విడుదలై 2 సంవత్సరాలు అయ్యింది అయితే చాలా మంది ప్రేక్షకులు రెండవ భాగం కోసం ఎదురు చూస్తున్నారు, చివరికి మేకర్స్ హిట్ 2 తో ముందుకు వచ్చారు, ట్రైలర్ అందరి దృష్టిని ఆకట్టుకుంది మరియు చాలా అంచనాలను పెంచింది మరియు అంతేకాకుండా, ఇటీవల మేకర్స్ తాము 7 భాగాలతో HIT ఫ్రాంచైజీని ప్లాన్ చేస్తున్నామని వెల్లదించడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే భారీ అంచనాలను నడుమ ఈ చిత్రం ఈరోజు డిసెంబర్ 02, 2022 న విడుదలైంది ఇక ఆలస్యం చేయకుండా ఈ చిత్రం చూడదగినదో కాదో తెల్సుకుందాం.

HIT 2 Movie Review

కథ

కెడి(అడివి శేష్) వైజాగ్‌లో ఒక కూల్ పోలీస్ అధికారి, అతను ఎప్పుడూ తనను ఛాలెంజ్ చేసే కేసులను ఛేదించడానికి ఇష్టపడతాడు మరియు ఆ కేసులను పరిష్కరించడంలో విజయం సాధించాడు కూడా,ఏ కేసు ని అయినా ఇట్టే చేధించే కేడి సంజన కేసును తీసుకున్న తర్వాత అతను ఎప్పుడు లేనెంత పెద్ద సవాలును ఎదుర్కొంటాడు, దర్యాప్తు ప్రక్రియలో అతనికి హంతకుడి గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది చివరగా, హంతకుడు ఎవరు? KD కేసును పరిష్కరించి, నేరస్థుడిని పట్టుకుంటారా అనేది మిగిలిన కథలో?

హిట్ 2మూవీ నటీనటులు 

అడివి శేష్, మీనాక్షి, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్ మరియు డా. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ. , సురేష్ బొబ్బిలి, నేపథ్య సంగీతాన్ని ఓన్ స్టీవర్ట్ ఎదురురి అందించగా, వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిరనేని, నాని ఈ చిత్రాన్ని నిర్మించారు

సినిమా పేరుహిట్ 2
దర్శకుడుశైలేష్ కొలను
నటీనటులుఅడివి శేష్, మీనాక్షి, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్
నిర్మాతలు ప్రశాంతి తిపిరనేని, నాని
సంగీతంఎం.ఎం.శ్రీలేఖ. , సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీఎస్.మణికందన్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

హిట్ 2 సినిమా ఎలా ఉందంటే?

HIT-ది ఫస్ట్ కేస్ సీట్ కి అతుక్కుపోయాలా చేసి చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది, అయితే క్లైమాక్స్ చాలా మంది ప్రేక్షకులను సంతృప్తి పరచలేదు, ఇక HIT 2కి వస్తే, KD ప్రపంచాన్ని మరియు కథ ని ఎస్టాబ్లిష్ చేస్తూ కొంచెం నెమ్మదిగా ప్రారంభమవుతుంది, అయినప్పటికీ, ఒక్కసారి KD ‘సంజన హత్య’ కేసును టేకప్ చేసిన తర్వాత, మొదట్లో దర్యాప్తు ప్రక్రియ పడుతూ లేస్తూ ఉంటుంది, అయితే ఒక్కసారి కథానాయకుడు కేసును ఇంకా లోతుగా పరిశోధించిన తర్వాత మిమ్మల్ని HIT 2 ప్రపంచంలోకి లాగి మిమ్మల్ని కథలో లీనమయ్యేలా చేస్తుంది మొదటి సగం స్లో గా ఉంటుంది కానీ కొన్ని సన్నివేశాలు మొదటి భాగం కొంతమేర ఎంగేజ్ చేస్తాయి మరియు ఇంటర్వెల్ ట్విస్ట్ తరువాయి భాగం చూసేలా ఉత్సుకతని పెంచుతుంది.

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే, కథనంలో కేసు కి సంబంధించిన ఒక్కో పొరను బయటపెట్టడం ద్వారా వేగాన్ని పుంజుకుంటుంది, సినిమాలో ఎమోషనల్ కొషేంట్ కొంచెం తక్కువే ఐన, సినిమా మూడ్ మిమ్మల్ని క్లైమాక్స్ వరకు సీటుకు అతుక్కుపోయేలా చేస్తుంది. అయితే, థ్రిల్లర్‌లకు రేసీ స్క్రీన్‌ప్లే అవసరం కాబట్టి స్లో నేరేషన్ సమస్యగా మారొచ్చు అయితే కొన్ని బ్లాక్‌లు మినహా సినిమా మొత్తం ఎంగేజింగ్‌గా ఉంటుంది.

కెడి పాత్రలో అడివి శేష్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, క్యారెక్టర్ అతనికి పెద్దగా ఛాలెంజ్ చేయలేదు కానీ కూల్ పోలీస్ అధికారిగా అతను బాగా చేసాడు, అయితే ఎమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం అసౌకర్యంగా కనిపించాడు, అయితే మీనాక్షి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ కలిగి ఉంది కానీ నటనకు స్కోప్ లేదు, మిగిలిన తారాగణం రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్ తమ సత్తా చాటారు.

HIT-మొదటి కేసుతో డెబ్యూ డైరెక్టర్‌గా మెప్పించిన శైలేష్ కొలను, కథ కొత్తది కానప్పటికీ, కొత్త సన్నివేశాలతో సినిమాకు విలక్షణమైన టచ్ ఇచ్చాడు మరియు ఇప్పుడు HIT 2 తో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయలేదు కానీ మల్లి కొత్త కథ కాకపోయినా కొత్త సన్నివేశాలతో మమ్మల్ని నిమగ్నం చేసాడు, అతను కథకోసం ఎంత పరిశోధించాడో స్పష్టంగా తేర మీద కనిపిస్తుంది, అయినప్పటికీ, నెమ్మదిగా కథనం ఉన్నప్పటికీ అతను ప్రేక్షకులను కట్టిపడేయడంలో విజయం సాధించాడు.

సాంకేతికంగా, HIT 2 బాగానే ఉంది, ఎస్.మణికందన్ తన విజువల్స్‌తో ఆకట్టుకున్నాడు, అతని ఫ్రేమింగ్, బ్లాకింగ్ మరియు లైటింగ్ మిమ్మల్ని సినిమాలోకి లాగి, కథతో మిమ్మల్ని ప్రయాణించేలా చేస్తుంది, MM శ్రీ లేఖ, సురేష్ బొబ్బిలి పాటలు అంతగా ఆకట్టుకోవు థ్రిల్లర్‌లకు సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవసరం మరియు స్టీవర్ట్ ఎదూరి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు, చాలా సన్నివేశాలలో అతను ఇంటెన్సిటీ తీసుకువచ్చాడు మరియు మిగిలిన సాంకేతిక బృందం తమ వంతు కృషి చేసారు.

మొత్తంమీద, HIT 2 అనేది ప్రతి వర్గాల ప్రేక్షకులు చూడవలసిన మంచి థ్రిల్లర్ మరియు థ్రిల్లర్ ప్రేమికులు తప్పక చూడాల్సిన చిత్రం.

ప్లస్ పాయింట్లు:

  • కొత్త సన్నివేశాలు
  • ఇంటెన్సిటీ
  • మూడ్
  • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్లు:

  • స్లో నేరేషన్
  • ఎమోషన్ లేకపోవడం

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు