Hunt Telugu Movie Review: తన కెరీర్ ప్రారంభం నుండి, సుధీర్ బాబు కొత్త మరియు విభిన్నమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూనే ఉన్నాడు, కానీ అవి ప్రజలను అలరించడానికి లేదా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా కనిపించలేదు. “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” పరాజయం తర్వాత, అతను “హంట్” అనే యాక్షన్ చిత్రంతో తిరిగి వచ్చాడు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ఈరోజు థియేటర్లలో వవిడుదలైంది. మరి ఈ సినిమాతో సుధీర్ బాబుకు కావాల్సిన విజయాన్ని అందుకుంటాడో లేదో తెలుసుకోవడానికి ఈ సినిమా గురించి మరింత లోతైన సమీక్షను చూద్దాం.
కథ
అసిస్టెంట్ కమీషనర్ ఆర్యన్ దేవ్ హత్యకి గురికావడంతో, అర్జున్ ప్రసాద్ అనే నిజాయితీ గల పోలీసు అధికారికి కేసు అప్పగిస్తారు. ఇన్వెస్టిగేషన్ సమయంలో అర్జున్ ప్రసాద్‌కి యాక్సిడెంట్ జరిగి,అంతకు ముందు జరిగిన అన్ని విషయాలను మర్చిపోయేలా చేస్తుంది. ఆర్యన్ దేవ్ కేసును ఛేదించడానికి అర్జున్ ఎలాంటి కఠిన సందర్భాలని ఎదురుకోవాల్సి వచ్చింది. అర్జున్ ఈ కేసు సాల్వ్ చేయగలిగాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
హంట్ మూవీ నటీనటులు
హంట్ సినిమాలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, శ్రీకాంత్ మేక, భరత్ నివాస్, మైమ్ గోపి, కబీర్ సింగ్, రవివర్మ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. హంట్ సినిమాకి దర్శకత్వం మహేష్ సూరపనేని నిర్వహించారు మరియు భవ్య క్రియేషన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వి ఆనంద ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జిబ్రాన్ మరియు ఛాయాగ్రహణం అరుల్ విన్సెంట్. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
సినిమా పేరు | హంట్ |
దర్శకుడు | మహేష్ సూరపనేని |
నటీనటులు | సుధీర్ బాబు, శ్రీకాంత్ మేక, భరత్ నివాస్, మైమ్ గోపి, కబీర్ సింగ్, రవివర్మ |
నిర్మాతలు | వి ఆనంద ప్రసాద్ |
సంగీతం | జిబ్రాన్ |
సినిమాటోగ్రఫీ | అరుల్ విన్సెంట్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
హంట్ సినిమా ఎలా ఉందంటే?
హంట్ చిత్రం మలయాళ చిత్రం ముంబై పోలీస్‌కి అనధికారికంగా రీమేక్‌గా కనిపిస్తోంది, ముంబై పోలీస్ చిత్రం పెద్దగా విజయవంతం కాకపోయినా, చాలా ప్రశంసలు అందుకుంది. హంట్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ చాలా బాగా రూపొందించబడినప్పటికీ, థియేటర్‌లో సినిమా ప్రారంభమైన వెంటనే, చాలా సన్నివేశాలు “ముంబయి పోలీస్” మలయాళ వెర్షన్‌లోనివని మీరు గ్రహించవచ్చు.
ఈ సినిమా ముంబై పోలీస్ సినిమాకు అనధికారిక రీమేక్‌గా కనిపిస్తున్నప్పటికీ, దర్శకుడు తెలుగు ప్రేక్షకులకు నచ్చే కొన్ని అంశాలను జోడించడానికి ప్రయత్నించాడు. సినిమా చివరి ట్విస్ట్ చాలా మంది చూసి ఇంతకముందెపుడు చూసి ఉండకపోవచ్చు మరియు కొంతమందికి నచ్చకపోవచ్చు.
నటన విషయానికి వస్తే, సుధీర్ బాబు తన గతంలో ఏమి జరిగిందో గుర్తుపట్టలేని పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో అతని పనితనం మెచ్చుకోదగినది. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రతో సమానంగా ట్రావెల్ చేసిన ముఖ్యమైన పాత్రను చేసారు, తన నటన కచ్చితంగా మెప్పిస్తుంది. ఆర్యన్ దేవ్‌గా భరత్ నివాస్ మంచి నటన కనబరిచాడు, అయితే కొన్ని సన్నివేశాల్లో ఇంకాస్త మెరుగ్గా నటించాల్సిందేమో అనిపిస్తుంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రలకు తగ్గట్టుగానే చేశారు.
హంట్ చిత్రం టెక్నికల్ గా బాగానే అనిపిస్తుంది. సినిమాలో పాటలకి పెద్దగా ప్రాముఖ్యత లేదు, కానీ గిబ్రాన్ నేపథ్య సంగీతం సన్నివేశాలకు అవసరమైన ఆసక్తిని కలిగిస్తుంది. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ కొన్ని సన్నివేశాల్లో బాగానే ఉన్నా మరికొన్ని సన్నివేశాల్లో ఇంకాస్త మెరుగ్గా ఉండొచ్చు అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు బాగా కుదిరాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
దర్శకుడు మహేష్ సూరపనేని ఇప్పటికే వేరే భాషలో చెప్పిన కథను చెప్పడానికి ప్రయత్నించాడు, అయితే ఇపుడున్న ప్రేక్షకులకు వినోదాన్ని అందించేలా కొన్ని మార్పులు చేసాడు. సినిమా మేకింగ్ లో తాను ఇంకొంచెం జాగ్రత్త వహించాల్సింది.
మొత్తంమీద, హంట్ చిత్రం యాక్షన్‌తో కూడిన వినోదాత్మక చిత్రం మరియు మీరు ఊహించని కొన్ని మలుపులుతో కొంచెం కొత్తగానే సాగుతుంది.
ప్లస్ పాయింట్లు:
- యాక్షన్ సీన్స్
- సుధీర్ బాబు
మైనస్ పాయింట్లు:
- కథ
- స్క్రీన్ ప్లే
సినిమా రేటింగ్: 2.75/5
ఇవి కూడా చుడండి:
- ATM Web Series Review: ఎటిఎం వెబ్ సిరీస్ రివ్యూ
- Vaarasudu Telugu Movie Review: వారసుడు తెలుగు మూవీ రివ్యూ
- Kalyanam Kamaneeyam Review: కళ్యాణం కమనీయం తెలుగు మూవీ రివ్యూ