Butta Bomma Telugu Movie Review: బుట్ట బొమ్మ, 2020 లో వచ్చిన మలయాళం చిత్రం కప్పేలా కి రీమేక్, అక్కడ ఈ చిత్రం చాల పెద్ద విజయం సాధించింది, అయితే మంచి కాతని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని డీజే టిల్లు నిర్మాత నాగ వంశీ ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకు వచ్చాడు. ట్రైలర్ తో కొంత బజ్ ని క్రెయేట్ చేసిన ఈ చిత్రం ఈరోజు విడులైంది అయితే ఇక ఆలస్యం చేయకుండా ఈ బుట్ట బొమ్మ చూడదగినదా కాదా అని ఈ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.
కథ
బుట్ట బొమ్మ కథ సత్య (అనిఖా సురేంద్రన్) ఒక గ్రామంలో ఉంటూ తన కుటుంబం యొక్క హోటల్ ని చూసుకుంటూ ఉంటుంది, అయితే ఒకరోజు సత్య అనుకోకుండా ఒక ఫోన్ నెంబర్ ని డయల్ చేస్తుంది, దీంతో ఆ ఫోన్ కాల్ ఒక ఆటో రిక్షా నడుపుకునే అతనికి కలుస్తుంది,మెల్లిగా వీళ్ళ ఇద్దరి మధ్యలో ప్రేమ చిగురిస్తుంది, అయితే ఒకరోజు ఇద్దరు కలుసుకోవాలని నిర్ణాయించుకుంటారు, దీంతో సత్య సిటీ క్లి వెళ్తుంది, అక్కడ ఒక వ్యక్తి సత్య ని ఫాలో అవుతూ ఉంటాడు, కాని అతను తనని కాపాడడానికే అని తెలుసుకుంటుంది. చివరికి ఆ వ్యక్తి సత్య ఎవరి నుంచి కాపాడాలని అనుకున్నాడు అనేది మీరు చిత్రం చూసి తెలుసు కోవాలి.
బుట్ట బొమ్మ మూవీ నటీనటులు
అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట, తదితరులు నటించగా ఈ చిత్రానికి దర్శకత్వం శౌరి చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వం వహించారు, సంగీతం గోపి సుందర్, ఛాయాగ్రహణం వంశీ పచ్చిపులుసు, ఎడిటర్ నవీన్ నూలి, నిర్మాత నాగ వంశీ ఎస్. సాయి సౌజన్య సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా పేరు | బుట్ట బొమ్మ |
దర్శకుడు | శౌరి చంద్రశేఖర్ టి రమేష్ |
నటీనటులు | అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట |
నిర్మాతలు | నాగ వంశీ ఎస్ |
సంగీతం | గోపి సుందర్ |
సినిమాటోగ్రఫీ | వంశీ పచ్చిపులుసు |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
బుట్ట బొమ్మ సినిమా ఎలా ఉందంటే?
కథ మరియు టేకింగ్‌కు ప్రశంసలు అందుకున్న మలయాళం చిత్రం కప్పేలా కి ఇది రీమేక్ అయితే ఒక విజయవంతమైన చిత్రాన్ని రీమేక్ చేస్తున్నప్పుడు రూపొందించేటప్పుడు దేనినీ మార్చకుండా ఉండటం మంచిది మరియు బుట్ట బొమ్మ మేకర్స్ దానికి కట్టుబడి ఉన్నందుకు అభినందిచాల్సిన విషయం. సత్య పాత్రని పరిచయం చేస్తూ సినిమా స్లో గ మొదలయినప్పటికీ ఎప్పుడైతే సత్య రాంగ్ డయల్ చేస్తుందో అక్కడినుంచి చిత్రం ఇంట్రెస్టింగ్ గ మారుతుంది, కానీ స్లో నరేషన్ పెద్ద సమస్యగ తయారవుతుంది కానీ లవ్ ట్రాక్ దాంతో ముడిపడి ఉన్న సన్నివేశాలు ఎంగేజ్ చేస్తాయి, అప్పటివరకు సాధ సీదా గా సాగిన కథ ఇంటర్వెల్ దగ్గర ఒక్కసారిగా అనుకోని ట్విస్ట్ తో కథ మలుపు తిరుగుతుంది.
ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతూ ఆసక్తి కరమైన స్క్రీన్ ప్లే తో చాల ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సత్య తన ప్రియుడి గురించి తెలుసుకుని, అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించే దగ్గర్నుండి క్లైమాక్స్ వరకు సీటుకు అతుక్కుపోయేలా చేస్తుంది. ఈ కథ కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇందులో మహిళల సెక్స్ ట్రాఫికింగ్ అనే ముఖ్యమైన పాయింట్‌ని దర్శకుడు ప్రస్తావించాడు.
సత్య పాత్రలో అనిఖా సురేంద్రన్ బాగా నటించింది, సూర్య వశిష్ఠ ఉన్నంతలో బాగా చేసాడు, అర్జున్ దాస్ తన నటనతో తన పాత్రకి న్యాయం చేసాడు, ఇక మిగితా తారాగణం తమ పాత్రల మేరకు బాగానే చేసారు.
శౌరి చంద్రశేఖర్ టి రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, ఒక రాంగ్ కాల్ మనిషి జీవితం ఎలా మార్చుతుంది అధిభూతంగా త్రిలింగ చూపించడం లో విజయం సాధించారు, కథనం లో తడబడినప్పటికీ ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో విజయం సాధించారు. టెక్నికల్ గా బుట్ట బొమ్మ బాగానే ఉంది, వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం బాగానే ఉంది, ద్వితీయార్థం లో తన పనితనం చూపించాడు, గోపిసుందర్ పాటలు అంతగా ఆకట్టుకోవు కానీ ద్వితీయార్థం లో చక్కటి బాక్గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు.
చివరగా బుట్టా బొమ్మ అన్ని రకాల ప్రేక్షకులు చూడాల్సిన డ్రామా థ్రిల్లర్.
ప్లస్ పాయింట్లు:
- ద్వితీయార్థం
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
- ట్విస్ట్
మైనస్ పాయింట్లు:
- స్లో నేరేషన్
సినిమా రేటింగ్: 2.75/5
ఇవి కూడా చుడండి:
Hunt Telugu Movie Review: హంట్ తెలుగు మూవీ రివ్యూ
Hunt Box Office Collections: హంట్ బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్