Michael Movie Review: మైఖేల్ తెలుగు మూవీ రివ్యూ

Michael Telugu Movie Review: కొంతమంది నటులు ఎన్ని మంచి పాత్రలు చేసిన ఎన్ని సినిమాల్లో నటించిన సరైన గుర్తింపు మాత్రం దక్కదు. అలా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన, ఎన్నో పాత్రలకి మంచి గుర్తింపు వచ్చిన కూడా ఎందుకనో సందీప్ కిషన్ కి రావాల్సిన గుర్తింపు రాలేదు. తెలుగు లోనే కాకుండా తమిళ్లో కూడా తన సత్త ఏంటో నిరూపించుకున్న సందీప్ కిషన్, గల్లీ రౌడీ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తో ‘మైఖేల్’ అనే పాన్-ఇండియా సినిమాతో మళ్ళీ మన ముందకు వచ్చాడు. ఈరోజు థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఈ సినిమా యొక్క వివరణాత్మక సమీక్షలోకి వెళ్ళిపోదాం.

Michael Movie Review

 

కథ

చిన్నపటినుండే పెద్ద గ్యాంగ్స్టర్ అవ్వాలనే కలతో పెరుగుతాడు మైఖేల్. అనుకున్నట్టుగానే కొంచెం వయసొచ్చాక ఒక గ్యాంగ్ లో చేరుతాడు. అక్కడ తన పనితనంతో రోజురోజుకి మంచి పొజిషన్ కి వెళ్తున్న టైంలోనే తీర అనే అమ్మాయి పరిచయం అవ్వడంతో తనతో ప్రేమలో పడతాడు. తీర తన జీవితంలోకి వచ్చాక మైఖేల్ లో వచ్చిన మార్పులేంటి, అసలు తీర ఎవరు, తన గతమేంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమాని పూర్తిగా చూడాల్సిందే.

మైఖేల్ మూవీ నటీనటులు

మైఖేల్ చిత్రంలో, సందీప్ కిషన్ ప్రధాన పాత్రను పోషిస్తుండగా, దివ్యాంశ కౌశిక్ అతనికి జోడిగా నటించింది . విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, వరలక్ష్మి శరత్‌కుమార్ మరియు అనసూయ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

మైఖేల్ చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహించగా, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి మరియు శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌లపై భరత్ చౌదరి & పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించగా, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఆర్.సత్యనారాయణన్ ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

సినిమా పేరుమైఖేల్
దర్శకుడురంజిత్ జయకోడి
నటీనటులుసందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, వరలక్ష్మి శరత్‌కుమార్ మరియు అనసూయ
నిర్మాతలుభరత్ చౌదరి & పుస్కుర్ రామ్ మోహన్ రావు
సంగీతంసామ్ సిఎస్
సినిమాటోగ్రఫీకిరణ్ కౌశిక్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

మైఖేల్ సినిమా ఎలా ఉందంటే?

గత కొన్నేళ్లుగా చాలా సినిమాల్లో క్రైమ్ ప్రధానాంశంగా మారింది. క్రైమ్ జానర్‌ని ఎంచుకోవడం ద్వారా, దర్శకులు ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడే యాక్షన్ ని అందులో చూపించడానికి వీలుంటుంధి. మైఖేల్ ట్రైలర్ విడుదలైన వెంటనే మనం ఎలాంటి సినిమా చూడబోతున్నామో ఒక అంచానికి వచ్చేశాం, కానీ ట్రైలర్లో కేవలం పాత్రలని పరిచయం చేసి కథని ఎక్కువగా చూపించకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు రంజిత్ జయకోడి. ఒక విధంగాను అది మంచిదే అయినా, ఇంకో విధంగా అది సినిమాపై అంచనాలు పెంచే అవకాశం లేకపోలేదు.

మైఖేల్ సినిమా ఎలాంటి సమయం వృధా చేయకుండా నేరుగా కథలోకి వెళ్తుంది. మొదట్లో కొంచెం ఉత్కంఠ రేపిన, కొన్ని సన్నివేశాల తరువాత ఆ ఉత్కంఠ ని కొనసాగించలేకపోయింది. కొన్ని సాగదీసిన సీన్లతో, అక్కర్లేని డైలాగ్స్ తో, ఇంటర్వెల్ వరకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఈ సినిమా. ఇంటర్వెల్ కి ముందు ఒక మంచి ట్విస్ట్ తో కాస్త ఇంట్రెస్ట్ వచ్చేలా చేసిన సినిమా మళ్ళీ ద్వితీయార్థంలో కొన్ని అవసరంలేని సన్నివేశాలతో బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి యాక్షన్ డోస్ పెరిగిపోయి, సినిమా అయిపోయాక కొంచెం భారంగానే బయటకి రావాల్సివస్తుంది.

ఇక నటన విషయానికి వస్తే, గత కొన్ని చిత్రాలను పరిశీలిస్తే సందీప్ కిషన్ అన్ని కారక్టర్లని ఒకేలా చేస్కుంటూ వెళ్తున్నాడేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా సందీప్ కిషన్ పాత్రలో లీనమైన ఎందుకనో తన నటన కొంచెం కృత్రిమంగానే అనిపిస్తుంది, అయితే పాత్ర కోసం తన శరీరాన్ని మార్చుకున్న తీరుకి మెచ్చుకుని తీరాల్సిందే. దివ్యాంశ కౌశిక్ తెరపై అందంగానే కనిపించిన నటనతో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. విజయ్ సేతుపతి మరియు వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్న కొద్దిసేపు వాళ్ళ నటనతో అలరిస్తారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా తన నటనతో మనల్ని బాగానే ఎంటర్టైన్ చేస్తాడు. వరుణ్ సందేశ్ ఆ పాత్రకి సరిపోలేదేమో అనిపిస్తుంది. అయ్యప్ప శర్మ డైలాగ్ డెలివరీ బాగుంది. అనసూయ పాత్ర, నటన రెండు మెప్పించవు, అసలు తన నటనకి ఇన్ని అవకాశాలు ఎలా వస్తున్నాయి అనేది ఇప్పటికి పెద్ద ప్రశ్నే.

సాంకేతికంగా మైఖేల్ చాలా బాగుంది. సామ్ సిఎస్ పాటలు ప్రత్యేకంగా లేవు, కానీ అవి బాగా చిత్రీకరించబడ్డాయి. సామ్ CS బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి సరిగ్గా సరిపోయింది. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నపటికీ, కొన్ని షాట్స్ చాలా బ్రైట్ గా అనిపించాయి. DI విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి, నిర్మాతలు సినిమా నాణ్యగ తీయడానికి కావాల్సినంత డబ్బు వెచ్చించారు.

దర్శకుడు రంజిత్ జయకోడి ఎంచుకున్న కథ కొత్తది కాకపోయినప్పటికీ దాన్ని నడిపించిన తీరు మాత్రం కొంతమేర మెప్పిస్తుంది.

మొత్తంమీద, మైఖేల్ యాక్షన్ తో నిండిన ఒక కొత్త ప్రయత్నం. సందీప్ కిషన్ ని ఒక కొత్త రూపంలో చూడాలనుకుంటే, వెంటనే ఈ సినిమాని థియేటర్లలో చూసేయండి.

ప్లస్ పాయింట్లు:

  • నేపథ్య సంగీతం
  • సినిమాటోగ్రఫీ
  • యాక్షన్ సన్నివేశాలు

మైనస్ పాయింట్లు:

  • స్లో నేరేషన్
  • అనవసరమైన కొన్ని పాత్రలు

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు