Amigos Telugu Movie Review: చాలా కాలం తరువాత కళ్యాణ్ రామ్ బింబిసారతో మంచి విజయాన్ని అందుకున్నాడు మరియు ఇప్పుడు అతను అమిగోస్ అనే మరో ఆసక్తికరమైన చిత్రంతో మన ముందుకి వచ్చాడు, బింబిసారా చిత్రం తరువాత ఈ అమిగోస్ వస్తుండంతో చిత్రం పైన భారీ అంచనాలు నెలకొన్నాయి మరియు కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేయడంతో ప్రేక్షకుల దృష్టిని మరింత ఆకర్షించింది మరియు డోప్లెర్గాంగ్ అనే పాయింట్వల్ల చిత్రం పైన అంచనాలు రెట్టింపయ్యాయి, సినిమా ఎట్టకేలకు విడుదలైంది ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం చూడదగిందా కాదా అనేది ఈ రివ్యూ లో తెలుసుకుందాం.
కథ
సిద్ధార్థ్, మంజునాథ్ మరియు మైఖేల్ డాప్లెర్గాంగ్లు అంటే ఒకే రకం పోలికలతో ఉంటారు కానీ వారికి ఎటువంటి రక్తసంబంధం ఉండదు అయితే ఈ ముగ్గురింట్లో మైఖేల్ అనే గ్యాంగస్టర్ NIA బృందానికి దొరక్కుండా చుక్కలు చూపిస్తుంటాడు , అయితే తనను తాను కాపాడుకోవడానికి అమాయకులైన సిద్హర్త , మంజునాథ్ లని వాడుకుంటాడు చివరకు మంజునాథ్ సిద్ధార్థ్ మరియు మైఖేల్ జీవితాలు ఎలా మారాయి ? మరియు NIA మైఖేల్‌ను పట్టుకుందా అనేది చిత్రంలో చూడాలి.
అమిగోస్ మూవీ నటీనటులు
కళ్యాణ్ రామ్, ఆశికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి & ఇతరులు, ఈ చిత్రానికి దర్శకత్వం రాజేంద్ర రెడ్డి, ఛాయాగ్రహణం ఎస్. సౌందర్ రాజన్, సంగీతం జిబ్రాన్, ఎడిటర్ తమ్మిరాజు మరియు ఈ చిత్రానికి నిర్మాత నవీన్ యెర్నేని, వై రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు.
సినిమా పేరు | అమిగోస్ |
దర్శకుడు | రాజేంద్ర రెడ్డి |
నటీనటులు | కళ్యాణ్ రామ్, ఆశికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి & ఇతరులు |
నిర్మాతలు | నవీన్ యెర్నేని, వై రవిశంకర్ |
సంగీతం | జిబ్రాన్ |
సినిమాటోగ్రఫీ | ఎస్. సౌందర్ రాజన్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
అమిగోస్ సినిమా ఎలా ఉందంటే?
అమిగోస్ డోపెల్గాంగేర్ అనే ఆసక్తికరమైన కథాంశాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే వెళ్తూ ఉంటుంది, మూడు పాత్రల పరిచయంతో బాగానే ప్రారంభం ఐన ఈ చిత్రం , మొదటి 20 మనల్ని కథలో లీనమయ్యేలా చేస్తుంది, కానీ తరువాత మనకు విసుగు తెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల లాగా సాగిపోతుంది కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ వల్ల చివరి సగం చూడాలనే ఆసక్తిని కలిగిస్తుంది.
సెకండ్ హాఫ్ కూడా రొటీన్ గానే సాగిపోతుంది స్క్రీన్‌ప్లేలో ఎమోషనల్ యాంగిల్ సరిగ్గా పండలేదు. సెకండాఫ్‌లో యాక్షన్ బ్లాక్స్, కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ సినిమా మిమ్మల్ని ఎంగేజ్ చేయడంలో పూర్తిగా విఫలమైంది. రొటీన్ కథనం, ఊహాజనిత సన్నివేశాలు మరియు బోరింగ్ లవ్ ట్రాక్ మన సహనాన్ని పరీక్షిస్తాయి.
మంజునాథ్‌గా కళ్యాణ్ రామ్ బాగా చేసాడు, సిద్ధార్థ్గా చేయడం అతనికి కొత్హెం కాదు ఈ చిత్రంలో మైఖేల్ అనే పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణ, రషికా రంగనాథ్ ఉన్నంతలో బాగానే చేసింది మరియు ఆమె ప్రతి ఫ్రేమ్‌లో చాలా అందంగా కనిపించింది, బ్రహ్మాజీ తన వంతు కృషి చేసాడు మరియు మిగిలిన నటీనటులు బాగానే.
రాజేంద్రరెడ్డి తీసుకున్న ఐడియా బాగానే ఉంది కానీ సినిమాను ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు ఎస్. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అక్కడక్కడా బాగుంది, జిబ్రాన్ పాటలు అంతగా లేవు మరియు బాలకృష్ణ ఐకానిక్ సాంగ్ ‘ఎన్నో రాత్రిలోస్థాయి గాని’ రీమిక్స్ చేయడంలో అతను విఫలమయ్యాడు, అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది మరియు మిగిలిన టెక్నికల్ టీం బాగానే చేసారు.
మొత్తంమీద, అమిగోస్ ఒక రొటీన్ కమర్షియల్ యాక్షన్ డ్రామా.
ప్లస్ పాయింట్లు:
- కళ్యాణ్ రామ్ నటన
మైనస్ పాయింట్లు:
- రొటీన్ నేరేషన్
- ఊహించదగిన స్క్రీన్‌ప్లే
సినిమా రేటింగ్: 2.5/5
ఇవి కూడా చుడండి:
- Butta Bomma Telugu Movie Review: బుట్ట బొమ్మ తెలుగు మూవీ రివ్యూ
- Writer Padmabhushan Telugu Movie Review: రైటర్ పద్మభూషణ్ తెలుగు మూవీ రివ్యూ
- Michael Box Office Collections: మైఖేల్ బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్