Vinaro Bhagyamu Vishnu Katha Telugu Movie Review: ప్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ తో బ్యాక్ సినిమాలు చేస్కుంటూ వెళ్తున్నాడు మన కిరణ్ అబ్బవరం, తన గత చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని ప్లాప్ అయినా కూడా వరుసగా సినిమాలు లైన్లో ఉంచాడు మరియు ఈ వినరో భాగ్యము విష్ణు కథ అందులో ఒకటి, ఇక ఈ చిత్రం మొత్తనికి ఈరోజు విడుదలైంది, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం చూడదగిందా లేదా ఈ రివ్యూ లో తెలుసుకుందాం.
కథ
విష్ణు(కిరణ్ అబ్బవరం ) లైబ్రరి లో పని చేస్తుంటాడు, అయితే ఒకరోజు దర్శన(కశ్మీర)తనకి ఉన్న ఫోన్ నెంబర్ లో లాస్ట్ నెంబర్ ఐన నెక్స్ట్ నెంబర్ తో డయల్ చేస్తుంది అది కాస్త విష్ణు కి కనెక్ట్ అవుతుంది. వెంటనే వాళ్లిద్దరూ కలుసుకుంటారు అయితే దర్శన సేమ్ ఇలాగె తన నెంబర్ లో ఉన్న ముందు డిజిట్ నెక్స్ట్ డిజిట్ నెంబర్ డయల్ చేశా అని ఇప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ వ్యక్తి పరిచయం అవుతాడు, ఐకే విల్లు ఇద్దరూ తనని ఇంప్రెస్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఆ వ్యక్తి ఎవేరో విష్ణు కి తెలిసాక కథ అడ్డం తిరుగుతుంది.ఆ వ్యక్తి ఎవరు అనేది మీరు చిత్రం చూసి తెల్సు కోవాలి.
వినరో భాగ్యము విష్ణు కథ మూవీ నటీనటులు
కిరణ్ అబ్బవరం, కశ్మీర, మురళీ శర్మ, ఎల్‌బి శ్రీరామ్, దేవి ప్రసాద్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం మురళీ కిషోర్ అబ్బూరు, ఛాయాగ్రహణం డేనియల్ విశ్వాస్, సంగీతం చైతన్ భరద్వాజ్, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ మరియు GA2 పిక్చర్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా పేరు | వినరో భాగ్యము విష్ణు కథ |
దర్శకుడు | మురళీ కిషోర్ అబ్బూరు |
నటీనటులు | కిరణ్ అబ్బవరం, కశ్మీర, మురళీ శర్మ, ఎల్‌బి శ్రీరామ్, దేవి ప్రసాద్, తదితరులు |
నిర్మాతలు | బన్నీ వాస్ |
సంగీతం | చైతన్ భరద్వాజ్ |
సినిమాటోగ్రఫీ | డేనియల్ విశ్వాస్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఎలా ఉందంటే?
ఈ చిత్రం బాగానే ప్రారంభం అయినప్పటికీ కాసేపటి తరువాత ఒక రెగ్యులర్ కమర్షిల్ చిత్రంలోకి మారిపోతుంది, అయితే ‘నెంబర్ నేబర్ ‘ అనే కొత్త పాయింట్ కొంత మేరకు ఎంగేజ్ చేస్తుంది, ఇక మొదటి సగం మురళీ శర్మ కామెడీ, మరియు కిరణ్ అబ్బవరం మార్క్ డైలాగ్‌లతో కొంతమేర ఎంగేజ్ చేస్తుంది.
సెకండాఫ్ యాక్షన్ ఉన్నట్టుండి కామెడీ నుంచి సీరియస్ మోడ్ లోకి మారుతుంది మోడ్‌లోకి మారుతుంది, అయినా కూడా సినిమాలో కొత్తదనం లేకపోయేసరికి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది,కానీ ఇందులో ఉన్న కొన్ని పాయింట్స్ వల్ల
ఈ చిత్రం యువతీ కి మరియు ఫ్యామిలీ ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వొచ్చు.
కిరణ్ అబ్బవరం ఎప్పట్లాగే తన గత సినిమాల మాదిరిగానే చేసాడు, కశ్మీర ఉన్నంతలో బాగానే చేసింది, మురళీ శర్మ పూర్తిగా కొత్తగా కనిపిస్తాడు, ఇక ఎల్ బి శ్రీరామ్ మరియు ఇతర నటీనటులు తమ వంతు కృషి చేసారు.
మురళీ కిషోర్ అబ్బూరు నంబర్ నైబర్ అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ముందుకు వచ్చారు, అయితే ఎంగేజింగ్ గా తీయడంలో పాక్షికంగా విజయం సాధించాడు. పాయింట్ బాగుంది కానీ రచన మరియు కథనం ఇంకా బాగుండాల్సింది.
సాంకేతికంగా, వినరో భాగ్యము విష్ణు కథ బాగుంది పర్వాలేదు డానియల్ విశ్వాస్ ఛాయాగ్రహణం అక్కడక్కడా బాగుంది , చైతన్ భరద్వాజ్ పాటలు బాగా హిట్ అయ్యాయి మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా చేసాడు ఇక మిగిలిన సాంకేతిక బృందం బాగా చేసారు.
మొత్తం మీద వినరో భాగ్యము విష్ణు కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మరియు కొన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.
ప్లస్ పాయింట్లు:
- కిరణ్ అబ్బవరం
- పాటలు
- కామెడి
మైనస్ పాయింట్లు:
- రొటీన్ నరేషన్
- ఉహిందగిన సన్నివేశాలు
సినిమా రేటింగ్: 2.75/5
ఇవి కూడా చుడండి:
- Amigos Telugu Movie Review: అమిగోస్ తెలుగు మూవీ రివ్యూ
- Amigos Box Office Collections: అమిగోస్ బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్
- Butta Bomma Telugu Movie Review: బుట్ట బొమ్మ తెలుగు మూవీ రివ్యూ