Sir Telugu Movie Review: సూర్య, కార్తీ , విక్రమ్ వంటి హీరోలకి తెలుగు హీరోలతో సమానంగా క్రేజ్ ఉంటుంది అయితే తెలుగు సినిమాలకి ఇప్పుడున్న క్రేజ్ కారణంగా అన్ని ఇండస్ట్రీ హీరోస్ తెలుగు లో వారి చిత్రాలని విడుదల చేస్తున్నారు అందులో భాగంగా ధనుష్ కి కూడా కొంత క్రేజ్ ఉన్నప్పటికీ ఇప్పుడు సార్ అనే చిత్రంతో తన మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆ చిత్రం భారీ అంచనాల నడుమ విడులైంది ఇక ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ చిత్రంలో తెల్సుకుందాం.
కథ
ప్రైవేట్ ఇంస్టిట్యూషన్స్ చైర్మన్ అయిన త్రిపాఠి (సముద్రఖని ) మారుమూల గ్రామాల్లో ఉన్న కాలజిస్ ని దత్తత తీస్కుని మంచి చదువు అందించాలని కొంత మంది టీచర్సని పంపిస్తారు, అందులో ఒకరే బాలు(ధనుష్) అయితే అక్కడికి వెళ్ళాక బాలు కి త్రిపాఠి చేస్తున్న ఎడ్యుకేషన్ మాఫియా గురించి తెలుస్తుంది దీంతో బాలు తిరగబడతాడు, చివరికి బాలు గెలిచాడా లేదా అనేది సినిమా చూసి తెల్సుకోవాలి.
సార్ మూవీ నటీనటులు
ధనుష్, సంయుక్త మీనన్, సాయి కుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీనివాస్, పమ్మి సాయి, హైపర్ ఆది, షరా, ఆడుకలం నరేన్, ఇళవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు. ఈ చిత్రానికి దర్శకత్వం వెంకీ అట్లూరి, సినిమాటోగ్రఫీ జె యువరాజ్, సంగీతం జివి ప్రకాష్ కుమార్, ఎడిటింగ్ నవీన్ నూలి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా పేరు | సార్ |
దర్శకుడు | వెంకీ అట్లూరి |
నటీనటులు | ధనుష్, సంయుక్త మీనన్, సాయి కుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని తదితరులు |
నిర్మాతలు | సూర్యదేవర నాగవంశీ |
సంగీతం | జివి ప్రకాష్ |
సినిమాటోగ్రఫీ | జె యువరాజ్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
సార్ సినిమా ఎలా ఉందంటే?
చాలా గ్యాప్ తర్వాత ఎడ్యుకేషనల్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమా చేసిన వెంకీ అట్లూరిని అభినందించాలిసిన విషయం, అయితే సినిమా అసలు కథలోకి వెళ్ళటానికి చాలానే సమయం తీసుకుంటుంది, ఈ లోపు మన హీరో యొక్క పాత్ర పరిచయం మరియు అతని ప్రపంచం చూడవచ్చు, ఇక మొదటి సగం హైపర్ అది కామెడీ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ మరియు ధనుష్ మార్క్ కామెడీ తో ఎంగేజ్ చేస్తుంది, ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ చివరి సగం చూడటానికి ఆసక్తిని కలిగిస్తుంది.
ఎడ్యుకేషన్ మాఫియా గురించి అసలు కథ సెకండాఫ్ లో మొదలవుతుంది, స్క్రీన్‌ప్లే ఊహించదగినది అయినప్పటికీ, ధనుష్ తన నటనతో ఎంగేజ్ చేస్తాడు. కోర్ పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పటికీ కథని చెప్పే విధానం కొంచెం పాతదిగ అనిపిస్తుంది మరియు మరియు క్లైమాక్స్ చాలా బాగుంది.
ధనుష్ తన పాత్రలో ఒదిగిపోయాడు , నటనలో మళ్లీ తన సత్తా చాటాడు, సినిమాలో చాలా కీలక సన్నివేశాలని తన నటనతో నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు,సంయుక్త మీనన్ ఉన్నంతలో బాగానే చేసింది , హైపర్ ఆది ఎప్పటిలాగే తన వన్-లైనర్స్‌తో ఆకట్టుకున్నాడు ఇక తనికెళ్ల భరణి, సముద్రఖని , ఆడుకలం నరేన్స్ వంటి మిగిలిన తారాగణం కథకు అవసరమైన విధంగా తమ వంతు కృషి చేశారు.
వెంకీ అట్లూరి చాలా గ్యాప్ తర్వాత ఈ కాన్సెప్ట్‌ని ఎంచుకున్నందుకు అభినందించాలిసిన విషయం, అతను సినిమా ద్వారా చెప్పాలనుకున్నది చాలా బాగుంది కానీ దాంట్లో అనవసరమైన కమర్సియల్ అంశాలని పెట్టడానికి ప్రయత్నిచారు మరియు అది అసహజంగాను ఉంది ఏది ఏమైనప్పటికి అతను తన రచనతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో విజయం సాధించాడు.
టెక్నికల్‌గా సార్ బాగుంది, జె యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్, జివి ప్రకాష్ కుమార్ పాటలు అంతగా ఆకట్టుకోవు కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకున్నాడు, మిగతా టెక్నికల్ టీం అంతా తమ సత్తా చాటారు.
చివరగా , సా ర్ అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ మంచి చిత్రం.
ప్లస్ పాయింట్లు:
- ధనుష్
- కథ
- నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్లు:
- రొటీన్ సన్నివేశాలు
సినిమా రేటింగ్: 3/5
ఇవి కూడా చుడండి:
- Amigos Telugu Movie Review: అమిగోస్ తెలుగు మూవీ రివ్యూ
- Butta Bomma Telugu Movie Review: బుట్ట బొమ్మ తెలుగు మూవీ రివ్యూ
- Writer Padmabhushan Telugu Movie Review: రైటర్ పద్మభూషణ్ తెలుగు మూవీ రివ్యూ