Konaseema Thugs Telugu Movie Review: కోనసీమ తగ్స్ తెలుగు మూవీ రివ్యూ

Konaseema Thugs Telugu Movie Review: కొరియోగ్రాఫర్ అయిన బృంద, దుల్కర్ సల్మాన్ , అదితి రావ్ హైదరి మరియు కాజల్ అగర్వాల్ నటించిన హే సినామిక  చిత్రంతో దర్శకత్వం అరంగేట్రం చేసింది అయితే ఇప్పుడు తగ్స్ అనే తమిళ్ చిత్రాన్ని తెలుగులో కోనసీమ తగ్స్ గా విడుదల చేసారు. ట్రైలర్ తో బాగానే ఆకట్టుకున్న ఈ చిత్రం ఇపుడు ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

Konaseema Thugs Telugu Movie Review

కథ

శేషు(హృదు హరూన్) ఒక అనాధ, అయితే ఒక హత్య చేసాడనే నేరం కింద తనని అరెస్ట్ చేస్తారు. జైలు లో తనకి రక రకాల మనుషులు పరిచయం అవుతారు, ఈ క్రమంలో కాకినాడ గుండా అయిన ఒక వ్యక్తి తో చేతులు కలిపి జైలు నుంచి పారిపోవాలని ప్లాన్ వేస్తారు. చివరగా వాళ్ళు తప్పించుకున్నార? లేక దొరికిపోయారా? అసలు శేషు ఎవరు అనేది చిత్రం లో చూడాలి.

కోనసీమ తగ్స్ మూవీ నటీనటులు

హృదు హరూన్, అనశ్వర రాజన్, బాబీ సింహా, ఆర్కే సురేష్, మునిష్కాంత్, శరత్ అప్పాని, పిఎల్ తేనప్పన్ మరియు తదితరులు నటించారు. ఈ చిత్రానికి బృందా దర్శకత్వం వహించారు, ఛాయాగ్రహణం ప్రియేష్ గురుసామి, సామ్ సిఎస్ సంగీతం సమకూర్చారు మరియు జియో స్టూడియోస్‌తో కలిసి హెచ్‌ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు మరియు ముంతాస్ ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుకోనసీమ తగ్స్
దర్శకుడుబృందా
నటీనటులుహృదు హరూన్, అనశ్వర రాజన్, బాబీ సింహా, ఆర్కే సురేష్,
నిర్మాతలు రియా శిబు మరియు ముంతాస్ ఎం
సంగీతంసామ్ సిఎస్
సినిమాటోగ్రఫీప్రియేష్ గురుసామి
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

కోనసీమ తగ్స్ సినిమా ఎలా ఉందంటే?

చిత్రం చాల నెమ్మదిగా అసలు కథలోకి వెళ్తుంది, అయితే మొదట్లోనే కాస్త స్లో నేరేషన్ వల్ల బోర్ కొట్టడం మొదలవుతుంది, మొదటిసగం అంత శేషు యొక్క గతం గురించి అక్కడడక్కడ చెప్తూ, కొన్ని పతాక సన్నివేశాలతో నడుస్తూ ఉంటుంది.

కానీ ఒక్కసారి బాబీ సింహ రంగంలోకి దిగాక చిత్రం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది దానికి తోడు జైలు యొక్క ఆవరణ మరియు మూడ్ మనల్ని కథలో లీనమయ్యేలా చేస్తాయి. మొదటి సగం కొంతమేర ఎంగేజ్ చేసినప్పటికీ మీ సహనాన్ని పరీక్షిస్తుంది అయితే ఇంటర్వెల్ దగ్గర వాళ్ళు జైలు నుండి తప్పించుకోవాలి అని నిర్ణయించుకున్నాక తరవాత ఎం జరుగుతుంది మరియు ఇది చివరి సగం చూడాలి అనే ఉత్సుకతను కలిగించింది.

తరువాయి సగం, హీరో శేషు జైలు నుండి పారిపోవాలని, బాబీ సింహ తో కలిసి ప్రణాళికలు మనల్ని సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయి. అయితే సెకండాఫ్‌లో ఎక్కడ బోర్ కొట్టకుండా స్క్రీన్‌ప్లేతో , ఫైట్లతో సినిమాని థ్రిల్లింగ్ గా మలిచారు.

హృదు హరూన్ తొలి చిత్రం అయిన బాగానే నటించాడు ,బాబీ సింహా ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడు అనశ్వర రాజన్ తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ పర్వాలేదన్పిస్తుంది మరియు మిగిలిన నటీనటులు తమ వంతు కృషి చేసారు.

బృందా కథ చాలా బాగుంది, కానీ ఆమె సినిమాను ప్రదర్శించడంలో పాక్షికంగా విజయం సాధించింది. అయితే మొదటి సగం అంతగా లేకున్నా , రెండవ సగంతో ఆమె ప్రేక్షకులను కట్టిపడేయడంలో విజయం సాధించింది.

సాంకేతికంగా, కోనసీమ థగ్స్ అద్భుతంగా ఉంది, ప్రియేష్ గురుసామి సినిమాటోగ్రఫీ , సినిమా మూడ్ ఇవన్నీ సినిమాలో ఇన్వొల్వె అవ్వడానికి చాల దోహదపడ్డాయి అని చెప్పొచ్చు. సామ్ సిఎస్ పాటలు అంతగా ఆకట్టుకోవు కానీ అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు.

మొత్తంమీద, కోనసీమ థగ్స్ ఒక్కసారి చూడాల్సిన యాక్షన్ డ్రామా.

ప్లస్ పాయింట్లు:

  • కథ
  • బాబీ సింహ
  • ఛాయాగ్రహణం
  • నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్లు:

  • ఫస్ట్ హాఫ్ స్లో నరేషన్

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు