Puli Meka Web Series Review: పులి మేక వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ

Puli Meka Web Series Review: ప్రేమ కావలి అనే చిత్రంతో అరంగేట్రం చేసిన అది సాయికుమార్ ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ సరైన హిట్ అనేది లేక ప్లాపులు చవి చూస్తూనే ఉన్నాడు. అయితే అందరు OTT లో కూడా తమ సత్త చాటుతుండడంతో ఇపుడు అది కూడా OTT అరంగేట్రం చేసాడు అదే పులి మేక అనే వెబ్ సిరీస్ తో. ఈ సిరీస్ ట్రైలర్ తో edho కొత్తగా ఉండబోతుంది అని అనిపించేలా చేసింది అయితే ఈ సిరీస్ జీ 5 లో విడుదలయింది ఇక ఆ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సిరీస్ ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

Puli Meka Web Series Review

కథ

ఒక సీరియల్ కిల్లర్ జంతువు ముసుగులో పోలీసులని చంపుతూ ఉంటాడు అయితే ఈ కేసు ని ఇన్వేషిగాతె చేయడానికి కిరణ్ (లావణ్య త్రిపాఠి ) ని నియమిస్తారు. అయితే ఈ కేసు లోకి ఫోరెన్సిక్ నిపుణుడు అయిన ప్రభాకర్ శర్మ (అది సాయికుమార్) వస్తాడు . చివరికి కిరణ్ మరియు ప్రభాకర్ శర్మ ఆ కిల్లర్ ని ఎలా పట్టుకున్నారు అనేది సిరీస్ లో చూడాలి.

పులి మేక వెబ్ సిరీస్ నటీనటులు

ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి, సుమన్, సిరి హనుమంతు, గోపరాజు రమణ, రాజా చెంబోలు, స్పందన పల్లి తదితరులు. ఈ చిత్రానికి కథ అందించింది కోన వెంకట్ మరియు వెంకటేష్ కిలారు మరియు చిత్రానికి దర్శకత్వం చక్రవర్తి రెడ్డి, ఛాయాగ్రహణం రామ్ కె మహేష్, ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చారు మరియు సిరీస్‌ను కోన వెంకట్ మరియు శావ్య కోన నిర్మించారు.

వెబ్ సిరీస్ పేరుపులి మేక 
దర్శకుడుచక్రవర్తి రెడ్డి
నటీనటులుఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి, సుమన్, సిరి హనుమంతు, గోపరాజు రమణ తదితరులు
నిర్మాతలుకోన వెంకట్ మరియు శావ్య కోన
సంగీతంప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీరామ్ కె మహేష్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

పులి మేక వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

పులి మేక పోలీసుల వరుస హత్యలతో ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది మరియు ఎక్కువ సమయం వృధా చేయకుండా, కేసు ఇన్వెస్టిగేషన్ మొదలవ్వడంతో ఇంట్రెస్టింగ్ గ అనిపిస్తుంది. అయితే ఫోరెన్సిక్ నిపుణుడు ప్రభాకర్ శర్మ కిరణ్ తో కలిసి హంతకున్ని పట్టుకోడానైకి విశ్వ ప్రయత్నాలు చేస్తుండంతో, సిరీస్ ఆసక్తికరంగా మారుతుంది. ఈ సిరీస్ మొదటి కొన్ని ఎపిసోడ్‌లు అంతగా దాని కథనంతో థ్రిల్ చేయవు.

సస్పెన్స్ చివరి వరకు బాగానే మెంటైన్ చేసారు, కిరణ్ మరియు ఫోరెన్సిక్ నిపుణులు కేసులో లోతుగా వెళ్తున్న కొద్హి ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అయితే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో అవసరమైన సస్పెన్స్ అక్కడక్కడా సరిగా లేకుండా పోయింది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఈ సిరీస్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది.

ఆది సాయికుమార్ ఈ సిరీస్‌తో OTT అరంగేట్రం చేసాడు మరియు ఫోరెన్సిక్ నిపుణుడిగా బాగానే చేసాడు, మరియు లావణ్య త్రిపాఠి ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్‌గా పర్వాలేదన్పిస్తుంది , అయితే తన నటన ఇంకా బాగుఇండాల్సింది , సిరి హనుమంత్‌కు కొంత స్క్రీన్ సమయం ఉన్నప్పటికీ thana నటనతో మెప్పించలేక పోయింది ఇక సుమన్ మరియు ఇతర నటీనటులు తమ వంతు కృషి చేసారు.

కోన వెంకట్ మరియు వెంకటేష్ కిలారు అందించిన కథ సద సిద ఇన్వేసిగటివే థ్రిల్లర్ ఉంది మరియు దర్శకుడు చక్రవర్తి రెడ్డి ఈ చిత్రాన్ని ఎంగేజింగ్ గా తీయడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు కానీ అతను పాక్షికంగా విజయం సాధించాడు. సాంకేతికంగా పులి మేక పర్వాలేదు మరియు రామ్ కె మహేష్ సినిమాటోగ్రఫీ అక్కడక్కడా బాగుంది, ప్రవీణ్ లక్కరాజు తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను కొంతమేరకు కాపాడాడు అని చెప్పొచ్చు.

మొత్తమ్మీద, పులి మేక ఇటీవలి కాలంలో అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే బెస్ట్ ఎంగేజింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.

ప్లస్ పాయింట్లు:

  • కొన్ని ఎపిసోడ్ లు
  • కొన్ని ట్విస్టులు

మైనస్ పాయింట్లు:

  • ఉహించదగిన నరేషన్
  •  ఎమోషన్ లేకపోవడం

పులి మేక వెబ్ సిరీస్ రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు