Balagam Movie Review: బలగం మూవీ రివ్యూ

Balagam Movie Review: ఇప్పుడు తెలుగులో పెద్ద నిర్మాణ సంస్థలు, చిన్న నిర్మాణ సంస్థలను స్థాపించి వాటి ద్వారా కొత్త నటి నటుల్ని దర్శకులని పరిచయం చేస్తూ, మంచి కథలని చెప్పాలని చూస్తున్నారు. ఈ ప్రక్రియలో యూ వి క్రియేషన్స్ వారు యూ వి కాన్సెప్ట్స్ అనే నిర్మాణ సంస్థని మొదలుపెట్టి చిన్న సినిమాలని నిర్మిస్తున్నారు మరియు రవి తేజ హీరో గా బిజి ఉంటూనే ఆర్ టీ టీం వర్క్స్ అని మొదలు పెట్టి చిన్న సినిమాలి నిర్మిస్తున్నారు, ఇక ఇప్పుడు నిర్మాత దిల్ రాజు కూడా దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే సంస్థను ప్రారంభించి మొదటగా ఏ టి యం అనే వెబ్ సిరీస్ ని జీ 5 తో కలిసి నిర్మించారు ఇక ఇప్పుడు బలగం అనే చిత్రంని నిర్మించి ఈరోజు మన ముందుకొచ్చారు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూలో తెల్సుకుందాం.

Balagam Movie Review

కథ

కొమురయ్య (సుధాకర్ రెడ్డి) ఊర్లో సాఫీగా బతుకుతూ ఉంటాడు ,అతని మనవడు సాయి (ప్రియదర్శి) ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని చాల రకాల వ్యాపారాలు చేసి నష్టపోతాడు, చివరికి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేస్కుని సెటిల్ అయపోదాం అనుకుంటాడు, ఇంతలోనే తన తాత కొమురయ్య చనిపోవడంతో కథ అడ్డం తిరుగుతుంది, ఇక కొమురయ్య కుటుంబ సభ్యులు అందరు అంత్యక్రియలకు వస్తారు, కానీ పాత గొడవలు బయటకి తీసి గొడవ పడుతుంటారు, చివరికి ఎం జరిగింది అనేది చిత్రంలో చూసి తెల్సుకోవాలి.

బలగం మూవీ నటీనటులు

ప్రియదర్శి , గంగోత్రి ఫేమ్ బేబీ కావ్య, రచ్చ రవి, సుధాకర్ రెడ్డి, జయరామ్, మురళీధర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వేణు టిల్లు దర్శకత్వం వహించగా, సినిమాటోగ్రఫీ ఆచార్య వేణు, సంగీతం భీమ్స్ సిసిరెలియో సమకూర్చారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని హర్షిత్ రెడ్డి మరియు హర్షిత నిర్మించారు.

సినిమా పేరుబలగం
దర్శకుడువేణు టిల్లు
నటీనటులుప్రియదర్శి , గంగోత్రి ఫేమ్ బేబీ కావ్య, రచ్చ రవి, సుధాకర్ రెడ్డి, జయరామ్, మురళీధర్
నిర్మాతలుహర్షిత్ రెడ్డి మరియు హర్షిత
సంగీతంభీమ్స్ సిసిరెలియో
సినిమాటోగ్రఫీఆచార్య వేణు
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

బలగం సినిమా ఎలా ఉందంటే?

తెలుగులో ఎక్కువగా మన కథల్ని చెప్తూ చిత్రాలను తీయలేదు. ఎక్కువగా తమిళ్ మరియు మలయాళం వాళ్ళు వాళ్ళ కథల్ని, వాళ్ళ సంప్రదాయాల్ని చూపిస్తూ కథల్ని హెఫ్తు ఉంటారు అయితే బలగం చిత్రం తెలంగాణ కల్చర్ ని, అక్కడి మనుషుల జీవితాలని , వారి స్వభావాలని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది, అయితే మొదటి సగం మంచి కామెడీ మరియు లవ్ స్టోరీ తో కొంత మేరకు బాగానే అనిపిస్తుంది అయితే నిజ జీవితాలకి దగ్గరగా రాసుకున్న పాత్రలు మనల్ని చిత్రంలో లో లీనమయ్యేలా చేస్తాయి.

రెండవ సగం కూడా మొదటి సగం లాగానే నాడిస్తు ఉంటుంది కానీ ఈసారి భావోద్ద్వేగం ఎక్కువైపోయి కామెడీ తగ్గిపోతుంది, కథ మామూలుగానే ఉన్న పాత్రలు చిత్రాన్ని కాపాడాయి అని చెప్పొచ్చు అయితే, సెకండాఫ్‌లో సినిమా వేగం అక్కడక్కడ తగ్గుతుంది. ఏది ఏమైనప్పటికి చిత్రంలోని పాత్రలు , తెలంగాణ సంభాషణలు అన్ని వర్గాల ప్రేక్షకులు చూడడగెలా ఉంటుంది ఈ చిత్రం .

ప్రియదర్శి ఒక కమెడియన్ గానే మనకి తెలుసు కానీ మల్లేశం తో తాను నటించగలడు అని నిరూపించాడు.ఇక ఈ చిత్రంలో నటనలో తన సత్తా చాటాడు. బేబీ కావ్యకు పర్వాలేదన్పిస్తుంది మరియు మిగిలిన నటీనటులు కథ అవసరం మేరకు తమ సత్తా చాటారు.

దర్శకుడు వేణు టిల్లు గుండెలకి హత్హుకునే కథని మంచి పాత్రలతో చాలా బాగా ప్రెజెంట్ చేశాడు, కథనం కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ అతను ప్రేక్షకులని కట్టిపడేయడంలో విజయం అందించాడు.

సాంకేతికంగా, బలగం బాగుంది; ఆచార్య వేణు అందమైన వ్ సిరిసిల్ల లొకేషన్‌లను చాల బాగా చిత్రీకరించారు సినిమా చాలా వాస్తవికంగా కనిపించడంతో ఆచార్య వేణు చల్లగా బాగా సహాయపడ్డాడు; భీమ్స్ సిసిరెలియో పాటలు బాగున్నాయి ఇక అతని నేపధ్య సంగీతం పర్వాలేదు.

మొత్తంమీద, బలగం అనేది అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే పల్లెటూరి చిత్రం.

ప్లస్ పాయింట్లు:

  • నటన
  • మాటలు

మైనస్ పాయింట్లు:

  • ఉహించదగిన కథనం

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు