Das Ka Dhamki Review: విశ్వక్ సేన్ తనని తాను ఫలకనామ దాస్ అనే చిత్రంతో నటుడు గా మరియు దర్శకుడిగా పరిచయం చేసుకున్నాడు, అయితే ఆ తరువాత నటుడిగా బిజీ అయిపోయాడు, ఇప్పుడు చాల రోజుల తరువాత, తానే నటించి, దర్శకత్వం చేసిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ చిత్రం ట్రైలర్ తో మంచి బజ్ ని క్రియేట్ చేసింది కానీ Jr. NTR ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాక, ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది, ఇక ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం ఈరోజు విడుదలయింది, ఇక ఏ మాత్రం అలలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.
కథ
సంజయ్ మరియు క్రిష్ణ దాస్ ఒకే రకంగా కనిపించే వేరు వేరు వ్యక్తులు, సంజయ్ ఎస్ ఆర్ ఫార్మా కంపనీ కి ఓనర్, కాన్సర్ ఫ్రీ ప్రపంచాన్ని చూడాలని ఒక డ్రగ్ ని కనిపెడతాడు, ఇక కృష్ణ దాస్ మిడిల్ క్లాస్, ఒకే ఫైవ్ స్టార్ హోటల్లో వెయిటర్ గా పనిచేస్తూ ఉంటాడు, ఎన్నో అవమానాలని ఎదుర్కొంటు, ఎలాగైనా రిచ్ గా బతకాలి అనుకుంటాడు, అయితే అనుకోకుండా సంజయ్ చనిపోవడంతో, కృష్ణ దాస్ తన ప్లేస్ తోలి వెళ్తాడు, చివరికి సంజయ్ ఎలా చనిపోయాడు, కృష్ణ దాస్ ఎలా మేనేజ్ చేసాడు అనేది మిగిలిన కథ.
దాస్ కా ధమ్కీ మూవీ నటీనటులు
విశ్వక్ సెన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, రోహిణి మొల్లేటి, అజయ్, హైపర్ ఆది, శౌర్య కరే, మహేష్ అంచట భీష్మ చేతన్ పృధ్వీ రాజ్ మరియు ఇతరులు. ఈ చిత్రానికి కథ అందించింది ప్రసన్న కుమార్ బెజవాడ, దర్శకత్వం విశ్వక్ సెన్, సినిమాటోగ్రఫీ దినేష్ కె బాబు, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా పేరు | దాస్ కా ధమ్కీ |
దర్శకుడు | విశ్వక్ సెన్ |
నటీనటులు | విశ్వక్ సెన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, రోహిణి మొల్లేటి, ఇతరులు |
నిర్మాతలు | కరాటే రాజు |
సంగీతం | లియోన్ జేమ్స్ |
సినిమాటోగ్రఫీ | దినేష్ కె బాబు |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
దాస్ కా ధమ్కీ సినిమా ఎలా ఉందంటే?
దాస్ కా ధమ్కీ ఏ విధంగా చుసిన కొత్తగా అనిపించదు, ఈ చిత్రం చాల ద్విపాత్రాభినయం చేసిన చిత్రాల్లా అనిపించడంతోనే కాకుండా, చిరంజీవి రౌడీ అల్లుడు, రీసెంట్ గా వచ్చిన ధమాకా మరియు అక్కడక్కడా ఆలా వైకుంఠపురంలో ఛాయలు కూడా కన్పిస్తూ ఉంటాయి. అయితే ఈ చిత్రం మొదటి నుంచి చివరివరకు రౌతూనే గా ఉన్న, విశ్వక్ సేన్ మార్క్ మాటలు, కామెడీ మరియు కొన్ని కామెడీ సన్నివేశాలతో ఎంగేజ్ చేస్తుంది.
సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలైనప్పటికీ, కాసేపయ్యాక ఒక కమర్షియల్ చిత్రం ఏ అంశాలతో ముందుకు వెళ్తుందో అలాగే వెళ్తుంది. ప్రేక్షకులకి కూడా ఇలాంటి కథ కొత్హెం కాదు, అక్కడక్క ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తుంది తప్ప, ఓవరాల్ గా ఒక రొటీన్ చిత్రం అని చెప్పొచ్చు.
విశ్వక్ సేన్ రెండు పాత్రలని చాల బాగా చేసాడు, సంజయ్ పాత్ర తనకి మాములు [పాత్రే ఐన, క్రిష్ణ దాస్ పాత్ర చాల సవాలు విసిరే పాత్ర. అయితే మొదట్లో కొంచెం కంగారు పడ్డ తరువాత చాల బాగా చేసాడు. కీర్తి గా నివేత పెతురాజ్ పర్వాలేదు, ఇక మిగిలిన తారాగణం రావు రమేష్, రోహిణి, అజయ్ మరియు తదితరులు వాళ్ళ పాత్రల మేరకు బాగానే చేసారు.
విశ్వక్ సేన్ దర్శకుడిగా అంతగా మెప్పించలేకపోయాడు, రొటీన్ కథనే కొంచెం తనదైన పంథాలో ప్రెసెంట్ చేసినప్పటికీ, చాల వరకు రొటీన్ గానే కథని చెప్పాడు, ప్రేక్షకులని పూర్తిగా మెప్పోయించలేకపోయాడు.
సాంకేతికంగా దాస్ కా ధమ్కీ చాల బాగుంది దినేష్ కె బాబు ఛాయాగ్రహణం చాల బాగుంది, లియోన్ జేమ్స్ రెండు పాటలు బాగున్నాయి, ఇక తన నేపధ్య సంగీతం చాల బాగుంది.
మొత్తం మీద, దాస్ క ధమ్కీ, రొటీన్ గా ఉండే కమర్షయల్ చిత్రం.
ప్లస్ పాయింట్లు:
- విశ్వక్ సేన్
- ఛాయాగ్రహణం
- నేపధ్య సంగీతం
మైనస్ పాయింట్లు:
- ఉహించదగిన కథనం
సినిమా రేటింగ్: 2.75/5
ఇవి కూడా చుడండి:
- Balagam Movie Review: బలగం మూవీ రివ్యూ
- Konaseema Thugs Telugu Movie Review: కోనసీమ తగ్స్ తెలుగు మూవీ రివ్యూ
- Puli Meka Web Series Review: పులి మేక వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ