Rangamarthanda Review: దర్శకుడు కృష్ణ వంశి కుటుంబ కథ చిత్రాలని తీయడంలో దిట్ట, అయితే గత కొన్ని సంవత్సరాలుగా సైరైనా హిట్ లేదు, 2009లో వచ్చిన మహాత్మా తన చివరి హిట్, ఆ తరువాత వచ్చిన, మొగుడు, పైసా, నక్షత్రం నిరాశపరిచాయి. చాల సమయం తరువాత, మరాఠీ లో విజయం సాధించిన నట సామ్రాట్ ని రీమేక్ చేస్తూ, తనదైన ఎమోషన్ ని జోడించి ఈరోజు మన ముందుకొచ్చాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం చూడదగినదా కాదా ఈ రివ్యూలో తెల్సుకుందాం.
కథ
రాఘవ రావు (ప్రకాష్ రాజ్ ) నాటక రంగంలో ప్రఖ్యాత పొందిన నటుడు, రిటైర్ అయిపోయి థన్ భార్య పిల్లల్తో సంతోషంగా బతకాలి అనుకుంటాడు, అయితే తన ఆస్తి కూడా తన ఇద్దరు పిల్లలకి పంచి ఇస్తాడు, కాని కృతజ్ఞత భావం లేని పిల్లలు చిన్న గొడవ వల్ల, వేరు వేరు గా బతకాలి అనుకుంటారు, ఇక చేసేది ఏమి లేక, తన భార్య ఇంట్లో నుంచో బైటికి వెళ్ళిపోతాడు, చివరకి ఈ వృద్ధాప్యం లో ఎలా బతికారు అనేది మిగతా కథ.
రంగమార్తాండ మూవీ నటీనటులు
ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అలీ రెజా తదితరులు. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు, రాజ్ కె నల్లి సినిమాటోగ్రాఫర్, ఇళయరాజా సంగీతం సమకూర్చారు మరియు ఈ చిత్రాన్ని కలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించారు.
సినిమా పేరు | రంగమార్తాండ |
దర్శకుడు | కృష్ణ వంశీ |
నటీనటులు | ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం, తదితరులు |
నిర్మాతలు | కలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి |
సంగీతం | ఇళయరాజా |
సినిమాటోగ్రఫీ | రాజ్ కె నల్లి |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
రంగమార్తాండ సినిమా ఎలా ఉందంటే?
ఒక ఇండస్ట్రీ లో హిట్ ఐన చిత్రాన్ని రీమేక్ చేయడం అంత సులువైన విషయం కాదు, అందులో నటనకి ఆస్కారం ఉన్న చిత్రం అయితే ఇంకా సవాలు అనే చెప్పొచ్చు, అయితే మరాఠి లో విజయం సాధించిన నట సామ్రాట్, తెలుగు లో రీమేక్ చేయాలి అనుకోవం ఎంత గొప్ప విషయంలో, ప్రకాష్ రాజ్ లాంటి నటుడు ఉండడం కూడా అంతే గొప్ప విషయం.
ఈ చిత్రం అసలు కథలోకి వెళ్లాడని చాల సమయం పడుతుంది, కానీ కొంచెం ఓపిక తో చూస్తే, కథలోని పాత్రలు, వారి భావోద్వేగాలు మిమ్మల్ని చివరి వరకు సీట్ లో కూర్చునేలా చేస్తాయి. కథనం స్లో గా ఉన్నప్పటికీ, ఇందులోని అంశాలు డబ్బు, మనుషుల నిజ స్వరూపాలు, మనిషి ఏదైనా సాధించాలి అనే తపన మరియు విటు చుట్టూ ముడిలోపడి ఉన్న భావోద్వేగం ప్రతిదీ మనం రోజు మన జీవితంలో చూస్తున్నాం అని అనిపించక మానదు, ఇక క్లైమాక్స్ అయితే మిమ్మల్ని ఏడిపిస్తుంది.
ప్రకాష్ రాజ్ నటన గురించి మనం కొత్తగా చెప్పాదడానికి ఎం లేదు, రాఘవ రావు పాత్ర తో మిమ్మల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు గుర్తుండి పోతాడు కూడా, ఇక బ్రహ్మానందం చక్రపాణి గా ఇంతకముందు ఎన్నడూ కనపడని వేషధారణతో అద్భుతంగా నటించాడు, రమ్య కృష్ణ అద్భుతంగా నటించింది, ఇక మిగిలిన తారాగణం రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ మరియు తదితరులు ఉన్నంతలో బాగా చేసారు.
కృష్ణ వంశి,కుటుంబ కథలకి పెట్టింది పేరు, ఇక చిత్రాన్ని ఎక్కడ పాడుచేయకుండా, తనదైన మార్క్ తో అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రేక్షకులని మెప్పించడంలో విజయం సాధించాడు.
సాంకేతికంగా రంగమార్తాండ పర్వాలేదు, రాజ్ కే నల్లి ఛాయాగ్రహణం బాగుంది, ఇళయరాజా పాటలు పర్వాలేదు కానీ తన నేపధ్య సంగీతం చాల బాగుంది.
మొత్తం మీద, రంగమార్తాండ, భావోద్వేగంతో నిండిని చిత్రం.
ప్లస్ పాయింట్లు:
- కథ
- నటన
- భావోద్వేగం
మైనస్ పాయింట్లు:
- అక్కడక్కడ స్లో నేరేషన్
సినిమా రేటింగ్: 3/5
ఇవి కూడా చుడండి:
- Puli Meka Web Series Review: పులి మేక వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ
- Konaseema Thugs Telugu Movie Review: కోనసీమ తగ్స్ తెలుగు మూవీ రివ్యూ
- Balagam Movie Review: బలగం మూవీ రివ్యూ