Dasara Movie Review: దసరా మూవీ రివ్యూ

Dasara Telugu Review: గత నెల నుండి నాని నటించిన దసరా అనే చిత్రం మీడియా లో బాగా వినపడుతుంది, దీనికి నాని చేస్తున్న ప్రమోషన్, అయితే నాని ఇంతకముందు కనిపించని పాత్రలో కనిపించడం, దానికి తోడు తెలంగాణ నేపధ్యం ఎంచుకోవడం చిత్రం మీద భారీ అంచనాలు నెలలొన్నాయి, ఇక ఒక్కసారిగా ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో, అంచనాలు ఆకాశాన్ని అంటాయి, ఇన్ని అంచనాల నడుమ, దసరా ఈరోజు మన ముందుకొచ్చింది, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్ర చూడదగిందా కాదా అనేది ఈ రివ్యూ లో తెలుసుకుందాం.

Dasara Telugu Review

కథ

ఈ చిత్రం తెలంగాణకు చెందిన గోదావరిఖని లో ఉన్న వీర్లపల్లి అనే ఉరి ప్రజలు, వారి జీవితాలు మరియు బొగ్గు ఘనులతో వాళ్లకి ఉన్న సంబంధాన్ని వివరించడంతో పాటు, అక్కడే ఉంటున్న ధరణి (నాని ) తన స్నేహితులతో కలిసి బొగ్గు ని దొంగతనం చేస్తూ, మద్యం సేవిస్తూ , అందరితో గొడవ పడుతూ మల్లి మరుసటి రోజు మర్చిపోతూ ఉంటాడు. కొన్ని అంత బాగానే సాగినప్పటికీ, ఒకరోజు అనుకోకుండా చిన్న నంబి ( షైన్ టామ్ చాకో ) యొక్క సిల్క్ బార్ లో గోదావ పడి మర్చిపోతాడు, అయితే చిన్న నంబి మాత్రం దాన్ని అంత తేలిగ్గా మర్చిపోడు, ఇక ధరణి చేసిన పొరపాటు వల్ల తన ప్రేయసి ఐన వెన్నెల( కీర్తి సురేష్ ) మరియు దారిని స్నేహితుల జీవితాలు తారుమారవుతాయి, చివరికి ధరణి తన ఐన వాళ్ళ కోసం ఎం చేసాడు అనేది మిగతా కథ.

దసరా మూవీ నటీనటులు

నాని, కీర్తి సురేష్, సాయి కుమార్, ధీక్షిత్ శెట్టి, జరీనా వహాబ్, సముద్రఖని, షైన్ టామ్ చాకో పూర్ణ తదితరులు నటించగా, జెల్లా శ్రీనాథ్, అర్జున పాతూరి, వంశీ కృష్ణ పి రచనను అందించగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, సినిమాటోగ్రఫీ అందించింది. సత్యన్ సూర్యన్, సంగీతం సంతోష్ నారాయణన్, ఎడిటింగ్ నవీన్ నూలి, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుదసరా
దర్శకుడుశ్రీకాంత్ ఓదెల
నటీనటులునాని, కీర్తి సురేష్, సాయి కుమార్, ధీక్షిత్ శెట్టి, తదితరులు
నిర్మాతలుసుధాకర్ చెరుకూరి
సంగీతంసంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీసత్యన్ సూర్యన్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

దసరా సినిమా ఎలా ఉందంటే?

కల్చర్ ని, ఒక ప్రాంతం జీవన విధానాన్ని, మనుసుకి హత్తుకునే విధంగా చిత్రాలు, తమిళ్ లో మరియు మలయాళం లో వచ్చేవి, ఇప్పటికి వస్తున్నాయి, అయితే తెలుగు అలంటి చిత్రాలు చాల అరుదుగా వస్తుంటాయి, కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తుండంతో అలంటి చిత్రాలు వస్తున్నాయి, ఆలా వచ్చినా చిత్రాల్లో రీసెంట్ గా విడుదలై అందరి మనసులని దోచేసిన చిత్రం బలగం, తెలంగాణ కల్చర్ ని చూపిస్తూనే, చావు చుట్టే అల్లు కున్న భావోద్వేగాల్ని చాల బాగా చూపించారు. ఇక ఇప్పుడు అదే తెలంగాణాలో బొగ్గు గనుల నేపధ్యం లో యాక్షన్ డ్రామా తో దసరా అనే చిత్రాన్ని తీశారు.

ఇక ఈ చిత్రం మంచి పతాక సన్నివేశంతో మొదలవుతుంది, ఇది హీరో పరిచయం, ఇక బొగ్గు గనుల కి ఆనుకొని ఉన్న వీర్లపల్లి అనే గ్రామం, అక్కడున్న బిగ్గు, మాసిన వారి జీవితాలు, కళ్ళకి కట్టినట్టు చూపించారు. మొదటి భాగం మంచి కామెడీ తో, యాక్షన్ తో మరియు ధరణి మరియు వెన్నెల ప్రేమ కథతో హాయిగా సాగిపోతుంది, ఇక కొంచెం గాడి తప్పుతుంది అనే సమయంలో అద్దిరిపోయే ఇంటర్వెల్ ట్విస్ట్ తో, రెండవ భాగం చూడాలి అనే ఉత్సుకతని సృష్టించింది.

రెండవ భాగంలో మొత్తం కథలో ఉన్న భావోద్వేగాన్ని, ముఖ్య పాత్రలతో తెలిజేస్తూ ఉంటుంది, ఎక్కువ పతాక సన్నివేశాలు ఉన్నప్పటికీ,భావోద్వేగం మనల్ని చిత్రంలో లీనమయ్యేలా చేస్తుంది. తెలంగాణ నేపథ్యంలో తీసినప్పటికి, దసరాలో ఉన్న భావోద్వేగం అందరిని ఆకట్టుకుంటుంది.

మునుపెన్నడు కనిపించని అవతారం లో నాని కనిపించి మొదట్లోనే మంచి మార్కులు కొట్టేసాడు, ఇక ధరణి గా అతని భాష, వేషధారణ అన్ని పాత్రకి అనుగుణంగా కుదిరాయి , ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో నటన చింపి అవతల పడేసాడు నాని, ఇక వెన్నెల గా కీర్తి సురేష్ చాల బాగా చేసింది, చాల రకాల భావోద్వేగాల్ని చూపించాల్సిన ఆ పాత్రని తాను చాల బాగా చేసింది, దీక్షిత్ శెట్టి, నాని స్నేహితుడి గా బాగా చేసాడు, ఇక మలయాళం లో సుపరిచితుడు ఐన షైన్ టామ్ చాకో చిన్న నంబిగా చాల బాగా చేసాడు, ఇక మిగిలిన తారాగణం కథ మేరకు బాగా చేసారు.

దర్శకుడు,శ్రీకాంత్ ఓదెల ఆ గోదావరిఖని ప్రాంతానికి చెందిన వాడు అవ్వడం వల్ల, ఆ బొగ్గుగనుల నేపధ్యాన్ని అద్భుతంగా తెర పైన చూపించాడు, అయితే ఇవే కాకుండా ఒక చక్కటి భావోద్వేగాన్ని, యాక్షన్ తో చాల బాగా మిళితం చేశాడు.

సాంకేతికంగా దసరా చాల బాగుంది, సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం చిత్రాన్ని కి వెన్నెముక అని చెప్పొచు, ఇక సంతోష్ నారాయణన్ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకి తెలిసిందే, అయితే తన నేపధ్య సంగీతంతో చిత్రాన్ని ఇంకో మెట్టు ఎక్కించాడు.

మొత్తం మీద, దసరా, భావోద్వేగంతో కూడిన యాక్షన్ డ్రామా.

ప్లస్ పాయింట్లు:

  • నటన
  •  నేపధ్య సంగీతం
  •  ఛాయాగ్రహణం

మైనస్ పాయింట్లు:

  • అక్కడక్కడా ఉహించదగిన కథనం

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు