Shaakuntalam Movie Review: శాకుంతలం మూవీ రివ్యూ

Shaakuntalam Telugu Review: పురాణాల ఆధారంగా మరియు మన హిందూ దేవుళ్ళ చరిత్ర ఆధారంగా ఎన్నో చిత్రాలు వచ్చాయి, అయితే అవి అన్ని రాజ్యం కోసం రెండు రాజ్యాలు కొట్టుకోవడం, రాజుల మధ్య పోరాటం లాంటివి చూసాం. అయితే ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చూడలేదు, సరిగ్గా అదే టైం లో గుణశేఖర్ శాకుంతలం అనే చిత్రం తో మన ముందుకొచ్చాడు, కాళిదాసు రాసిన కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ ఈరోజు విడుదలైంది, ఇక ఏ మాత్రం ఆలస్య చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

Shaakuntalam Movie Review

కథ

విశ్వామిత్రుడికి మరియు మేనకకి జన్మించిన శకుంతల(సమంత ), కాన్వ మహర్షి (మోహన్ బాబు )ఆశ్రమం లో పెరుగుతుంది, అయితే అటవీ పర్యటని కి వచ్చిన దుశ్యంతుడు (దేవ్ మోహన్ ), శకుంతలని చూసి ఇస్టపడతాడు మరియు శకుంతల కూడా ఇష్టపడుతుంది. కాన్వ మహర్షి ఆశ్రమంలో లేకపోవడంతో వేరే దారిలేక దుశ్యంతుడు మరియు శాకుంతల పెళ్లి చేసుకుంటారు, అయితే మల్లి తిరిగి వస్తానని దుశ్యంతుడు వెళ్ళిపోతాడు, దీంతో శకుంతల తనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది, ఈ విషయం తెలుసుకున్న కాన్వ మహర్షి శకుంతలని నువ్వు ఎవరిగురించి అయితే ఆలోచిస్తున్నావో అతను నిన్ను మర్చిపోతాడు ని శపిస్తాడు. చివరికి శకుంతల తన భర్తని వెతుక్కుంటూ వెళ్తుంది కానీ మహర్షి అన్నట్టుగానే దుశ్యంతుడు శకుంతలని మరిచిపోతాడు, చివరికి ఎం జరిగింది అంది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.

శాకుంతలం మూవీ నటీనటులు

సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ, సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, డా.ఎం మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిషు సేన్‌గుప్తా తదితరులు, ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించగా, ఛాయాగ్రహణం శేఖర్ వి జోసెఫ్, సంగీతం మణిశర్మ అందించగా, దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుశాకుంతలం
దర్శకుడు గుణశేఖర్
నటీనటులుసమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ, సచిన్ ఖేడేకర్, తదితరులు
నిర్మాతలునీలిమ గుణ
సంగీతంమణిశర్మ
సినిమాటోగ్రఫీశేఖర్ వి జోసెఫ్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

శాకుంతలం సినిమా ఎలా ఉందంటే?

పురాణాల ఆధారంగా సినిమాలు తీయాలంటే చాల ఖర్చుతో కూడుకున్న విషయం, అయితే బాహుబలి తర్వాత కథ బాగుంటే నిర్మాతలు ఎంత ఖర్చుపెట్టడానికి ఐన వెనకాడట్లేదు. కానీ కథ బాగున్నా, నిర్మాణ విలువలు సరిగా లేకపోతే చూసే ప్రేక్షకుడికి థియేటర్లో కుర్చోపెట్టలేం, అయితే రుద్రమదేవి తో VFX సరిగా లేవని విమర్శలు అందుకుం గుణశేఖర్, ఈ చిత్రం తో ఆ విమర్శలని తుడిచిపెట్టాడని చెప్పొచ్చు. శాకుంతలంలో కూడా VFX బాగున్నాయి అని కాదు కానీ రుద్రమ దేవి తో పోలిస్తే బాగున్నాయి.

కథ చాల నెమ్మదిగా ప్రారంభం అయినప్పటికీ, 3D లో మొదట్నుంచి ఆ ప్రపంచాన్ని పరిచయం చేసిన విధానం చాల బాగుంది, ఇక మొదటి సగం శాకుంతల మరియు దుశ్యంతుడి ప్రేమ కథ మరియు మంచి విజువల్స్ తో సాగిపోతుంది, విరామం దగ్గర వచ్చే సన్నివేశం వాళ్ళ రెండవ భాగం చూడాలనే ఆసక్తి కలిగిస్తుంది.

రెండవ భాగం భావోద్వేగం తో నిండిపోతుంది, శకుంతల తన ప్రేమ ని, తన భర్తని దక్కించుకునే ప్రయంత్నం, తనుపడే వేదన మనల్ని కదిలిస్తుంది, అక్కడక్కడా కథనం నెమ్మదించిన, శాకుంతలం ప్రేక్షకులని కొంతమేరకు కట్టిపడేస్తుంది.

ఇక శకుంతల గా సమంత బాగా చేసింది, తను పలికించిన హావ భావాలూ తెరమీద చాల బాగా పండాయి అని చెప్పొచ్చు, కానీ తన సొంత డబ్బింగ్ ఈ పాత్రకి అస్సలు కుదరలేదు, అలాగే దుశ్యంతుడిగా చేసిన మలయాళం నటుడు దేవ్ మోహన్ రాజు పాత్రలో బాగా కుదిరాడు కానీ తన డబ్బింగ్ కూడా కుదరలేదు, ఇక మోహన్ బాబు ఉన్నంతలో తనదైన నటనతో మెప్పించాడు, అనన్య, సుబ్బరాజు, గౌతమి తదితరు తమ పాత్రల మేరకు బాగా చేసారు .

గుణశేఖర్ కథని మలిచిన విధానం చాల బాగుంది, కానీ కథనం కొంచెం వేగంగా ఉండేలా చూసుకుంటే బాగుండు. అక్కడక్కడా కొన్ని పొరపాట్లు ఉన్న, తను ప్రేక్షకులని కట్టిపడేయడంలో పాక్షికంగా విజయం సాధించాడు అని చెప్పొచ్చు.

సాంకేతికంగా శాకుంతలం పర్వాలేదు, VFX ఇంకా బాగుండాల్సింది, శేఖర్ వి జోసెఫ్ ఛాయాగ్రహణం బాగుంది, మని శర్మ పాటలు అంతగా లేవు, కానీ నేపధ్య సంగీతం బాగుంది.

మొత్తం మీద శాకుంతలం డీసెంట్ హిస్టారికల్ డ్రామా.

ప్లస్ పాయింట్లు:

  • నటన
  •  నేపధ్య సంగీతం
  •  ఛాయాగ్రహణం
  • కొన్ని 3D షాట్స్

మైనస్ పాయింట్లు:

  • అక్కడక్కడా ఉహించదగిన కథనం

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు