Vidudhala Part 1 Movie Review: విడుదల పార్ట్ 1 మూవీ రివ్యూ

Vidudhala Part 1 Telugu Review: రియాలిటీకి దగ్గరగా ఉండే చిత్రాలని తీయడంలో దిట్ట ఐన తమిళ దర్శకుడు వెట్రిమారన్ తీసిన లేటెస్ట్ చిత్రం విడుతలై పార్ట్ 1 తమిళం పెద్ద విజయం సాధించింది, అయితే ఈ చిత్రాన్ని తెలుగు టాప్ నిర్మాత ఐన అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగు విడుదల పార్ట్ 1 అనే టైటిల్ తో విడుదల చేసారు. ట్రైలర్ తోనే ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉంది ఈ రివ్యూలో తెల్సుకుందాం.

Vidudhala Part 1 Telugu Review

కథ

కొత్తగా చేరిన పోలీసు ఆఫీసర్ కుమార్ (సూరి), పోలీసు అధికారులు చేపట్టిన ఒక సీక్రెట్ ఆపరేషన్ పాల్గొనాల్సి వస్తుంది అయితే తరువాత కుమార్ కి అతను చేసేది వేర్పాటువాద గ్రూప్ లీడర్ ఐన పెరుమాళ్ (విజయ్ సేతుపతి) పట్టుకోవడానికి అని తెలుస్తుంది, చివరికి, ఇటు గోవెర్నెమెంట్ మరియు వేర్పాటువాద గ్రూప్ మధ్య ఒక మాములు పోలీస్ అధికారి ఐన కుమార్ జీవితం ఎల్లా మారింది అనేది మిగతా కథ.

విడుదల పార్ట్ 1 మూవీ నటీనటులు

సూరి విజయ్ సేతుపతి, భవానీ శ్రీ, చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, ఇళవరసు, మున్నార్ రమేష్, శరవణ సుబ్బయ్య తదితరులు. ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించగా, ఆర్.వెల్ రాజ్ ఛాయాగ్రహణం, ఇళయరాజా సంగీతం అందించగా ఈ చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు.

సినిమా పేరువిడుదల పార్ట్ 1
దర్శకుడువెట్రిమారన్
నటీనటులుసూరి విజయ్ సేతుపతి, భవానీ శ్రీ, చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, తదితరులు
నిర్మాతలుఎల్రెడ్ కుమార్
సంగీతంఇళయరాజా
సినిమాటోగ్రఫీఆర్.వెల్ రాజ్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

విడుదల పార్ట్ 1 సినిమా ఎలా ఉందంటే?

వెట్రిమారన్ సినిమాలు నిజ జీవితానికి దగ్గరగా, ఉంది చూసే ప్రతి ప్రేక్షకుణ్ణి కట్టిపడేస్తాయి, సరిగ్గా ఈ విడుదల పార్ట్ 1 కూడా అలంటి కోవకి చెందినదే, చిత్రం మొదట్లోనే ట్రైన్ ఆక్సిడెంట్ సన్నివేశం ప్రేక్షకుని సినిమాలో లీనమయేలా చేస్తుంది అందులోనూ ఆ సీక్వెన్స్ అంత సింగల్ షాట్ లో తీసింది. ఆ తరువాత కథనం స్లో గా వెళ్తూ ఉంటుంది, మొదటి సగం వెట్రిమారన్ మార్క్ పథక సన్నివేశాలు, మరియు ఆదివాసుల జీవితాలు వారు పడే బాధలు కళ్ళకు కట్టినట్టు చాల బాగా చూపించారు.

ఇక రెండవ భాగం లో విజయ్ సేతుపత్రంగంలోకి దిగాక ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది, కుమార్ ప్రేమ కథని చూపిస్తూనే, కుమార్ పెరుమాళ్ ని పట్టుకునే పతాక సన్నివేశాలు ప్రేక్షకుల్ని సీట్ కి అతుక్కుపోయేలా చేస్తాయి, ఇక భావోద్వేగం కూడా సరిగ్గా ఎక్కడ కుదరలో అక్కడ కుదిరింది.

కమెడియన్ గా మంచి పేరు ఉన్న సూరి, హీరో గా అరంగేట్రం చేయడం అది కూడా ఇలాంటి చిత్రంతో చేయడం అభినందించాల్సిన విషయం, ఇక కుమార్ పాత్రలో సూరి ఒదిగిపోయాడని చెప్పొచ్చు, ప్రతి ఫ్రేములో మనకు కమెడియన్ సూరి కనిపిన్చగకుండా అద్భుతంగా చేసాడు. విజయ సేతుపతి ఉన్నది కాసేపే ఐన తన మార్క్ నటనతో మెప్పిస్తాడు, ఇక గౌతమ్ వాసుదేవ్ మీనన్ బాగా చేసాడు, ఇక మిగిలిన తారాగణం ఉన్నంతలో బాగా చేసారు.

వెట్రిమారన్ ఎంత గొప్ప దర్శకుడో మరోసారి ఈ చిత్రం తో నిరూపించాడు, గుండెలకి హత్తుకుపోయే భావోద్వేగంతో పాటు పతాక సన్నివేశాలతో, తనదైన ముద్ర వేసాడు, కథనం కొంచెం స్లో గా ఉన్నప్పటికీ, ప్రేక్షకులని ఎంగేజ్ చేయడం లో విజయం సాధించాడు.

సాంకేతికంగా విడుదల పార్ట్ 1 బాగుంది, ఇళయరాజా నేపధ్య సంగీతం ఒక రకమైన మూడ్ ని సృష్టించి మనకి ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది, ఆర్.వెల్ రాజ్ ఛాయాగ్రహణం బాగుంది.

మొత్తం మీద విడుదల పార్ట్ 1 వెట్రిమారన్ నుంచి వచ్చిన మరో అద్భుతం.

ప్లస్ పాయింట్లు:

  • నటన
  •  నేపధ్య సంగీతం
  •  ఛాయాగ్రహణం
  • పతాక సన్నివేశాలు

మైనస్ పాయింట్లు:

  • స్లో కథనం

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు