Rudhrudu Movie Review: రుద్రుడు మూవీ రివ్యూ

Rudhrudu Telugu Review:ఒక డాన్సర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి , తనకంటి ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు మన లారెన్స్, ఈయన తమిళం లోనే కాదు, తెలుగు లో చాల ఫేమస్ అని మనందరికీ తెలిసిందే. చిరంజీవి లాంటి హీరోలకి మంచి మంచి స్టెప్స్ చొంపొసె చేసిన ఘనత ఆయనది. ఇక కొరియోగ్రాఫర్ గా ఆపేసి, హీరో గా రంగంలోకి దిగి తనదైన నటనతో దూసుకెళ్లి పోతున్నాడు, అయితే కాంచన సినిమాతో లారెన్స్ హీరో గా చాల పేరొచ్చింది, ఇక ఇప్పుడు మొత్తం కమెర్షియల్ చిత్రం రుద్రుడు అనే చిత్రంతో మన ముందుకొచ్చాడు, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెలుసుకుందాం.

Rudhrudu Movie Review

కథ

ఒక మాములు ఉద్యోగం చేసుకునే వ్యక్తి రుద్రుడు (లారెన్స్) తన కి నచ్చిన అమ్మాయి అనన్య (ప్రియా భవాని శంకర్ ) పెళ్ళిచేసుకుని కుటుంబంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. అయితే అంత బాగానే ఉంది అనుకునే సమయంలో తను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని దుండగుల చంపేస్తారు. దీంతో ఒక్కసారిగా రుద్రుడి జీవితం తలకిందులవుతుంది, ఇలా ఎలాగైనా తన భార్యని చంపింది ఎవరో తెలుసుకొని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. చివరికి, అనన్యని ఎందుకు చంపారు? దీని వెనక ఎవరున్నారు అనేది మిగిలిన కథ.

రుద్రుడు మూవీ నటీనటులు

రాఘవ లారెన్స్, ప్రియా భవానీ, శరత్ కుమార్, తదితరులు, ఈ చిత్రానికి కతీర్‌సేన్ దర్శకత్వం వహించగా, ఆర్‌డి సినిమాటోగ్రఫీ అందించారు. రాజశేఖర్, జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. మరియు ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ LLP బ్యానర్‌పై కతిరేసన్ నిర్మించారు.

సినిమా పేరురుద్రుడు
దర్శకుడుకతిరేసన్
నటీనటులురాఘవ లారెన్స్, ప్రియా భవానీ, శరత్ కుమార్, తదితరులు
నిర్మాతలుకతిరేసన్
సంగీతంజివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీఆర్‌డి
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

రుద్రుడు సినిమా ఎలా ఉందంటే?

100 సంవత్సరాల సినీ చరిత్రలో ఎన్నో కమర్షిల్ చిత్రాన్ని చుసిన ప్రేక్షుకులకి, ఇప్పుడు మల్లి అలాంటి చిత్రాన్ని చూపిస్తే నిర్దాక్షణంగా ప్లాప్ చేస్తారు, అయితే ఇప్పుడు క్రొత్తదాన్ని, ప్రతి సినిమాలో ఎదో కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులని మెప్పించే పరిస్థితి ఉంది, అయితే ఇలాంటి సమయంలో రుద్రుడు లాంటి అరిగిపోయిన పాత కమర్షిల్ ఫార్మాట్లో సినిమాని ఎందుకు తీశారో అర్ధం కానీ పరిస్థితి.

సినిమా మొదలైనప్పట్నుంచి చివరి వరకు, మనం ఎప్పట్నుంచో చూస్తున్న ఫార్మాట్లో సాగుతుంది, హీరో పరిచయం, హీరోనే చూసి లవ్ లోపడటం,, పెళ్లి చేసుకోవడం, అంత బాగుంది అనుకునే టైం కి విలన్ తనని చంపేయడం, కినుక హీరో వాళ్లపైనా రేవంజి తీర్చుకోవడం. అయితే సినిమా ఎంత ఓల్డ గా ఉన్న, హీరో ఎలివేషన్లు, లవ్ ట్రాక్, ,మరియు పతాక సన్నివేశాలు కొన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే అవకాశాలు చాల ఉన్నాయి.

ఇక రాఘవ లారెన్స్, రుద్రుడి పాత్రలో పర్వాలేదు, తను ఎంత బాగా చేసిన, ఇంకా కాంచన యాక్టింగ్ మోడ్ లో నుంచి బయటికి రాలేదేమో అనిపిస్తుంది, ఇక ప్రియా భవాని శంకర్ పర్వేలేదు, శరత్ కుమార్ విలన్ పాత్రలో బాగానే చేసాడు, ఇక మిగిలిన తారాగణం పర్వాలేదు.

కథిరాసేన్ ఒక మాములు కథతో మన ముందుకొచ్చాడు, తను ఏ మాత్రం ప్రేక్షకులని ఎంగేజ్ చేయలేకపోయాడు.

సాంకేతికంగా రుద్రుడు పర్వాలేదు, జి వి ప్రకాష్ కుమార్ పాటలు అంతగా లేవు, ఒక్క పాట బాగుంది, నేపధ్య సంగీతం బాగుంది, ఆర్‌డి ఛాయాగ్రహణం పర్వాలేదు.

మొత్తం మీద రుద్రుడు, ఒక అవుట్ డేటెడ్ కమర్షిల్ చిత్రం.

ప్లస్ పాయింట్లు:

  •  నేపధ్య సంగీతం
  • పతాక సన్నివేశాలు

మైనస్ పాయింట్లు:

  • రొటీన్ కథనం

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు