Virupaksha Telugu Review: చాల గ్యాప్ తరువాత సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష అనే మిస్టికల్ థ్రిల్లర్ ఈరోజు మన ముందుకొచ్చాడు. రిపబ్లిక్ చిత్రం తరువాత కొంత గావు తీసుకున్న సాయి ధరమ్ తేజ్, ఆక్సిడెంట్ తరువాత ఇంకా చాల నెలలు సినిమాలకి దూరంగా ఉండాల్సి వచ్చింది. మొత్తానికి 6 నెలలు విరామం తరువాత విరూపాక్ష ని ఫినిష్ చేసి, ఇప్పుడు విడుదల చేసారు. ట్రైలర్ తో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.
కథ
ఒక ఊరిలో అనుకోకుండా కొన్ని మరణాలు జరుగుతుంటాయి, అయితే దీనికి కారణం ఏంటో ఎవరికీ తెలీదు, ఇక చేసేదేమి లేక, అక్కడి ఉరి పెద్దలు అక్కడున్న గుడి ని మరియు ఉరిని నిషేదిస్తారు, అదే సమయంలో వీరు (సాయి ధరమ్ తేజ్ ) ఆ ఉరికి వస్తాడు, ఈ విషయం అతని చెవిన పడిన తరువాత, దీని వెనక ఉన్న మిస్టరీ ని మొత్తమ్ బైట పెట్టాలని నిర్ణయించు కుంటాడు.చివరికి ఆ మిస్టరీ ఏంటో అనేది మీరు మూవీ చూసి తెల్సుకోవాలి.
విరూపాక్ష మూవీ నటీనటులు
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, అభినవ్ గోమఠం, అజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్ మరియు ఛాయాగ్రహణం శామ్‌దత్ సైనుద్దీన్.
సినిమా పేరు | విరూపాక్ష |
దర్శకుడు | కార్తీక్ దండు |
నటీనటులు | సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, అభినవ్ గోమఠం, అజయ్ తదితరులు |
నిర్మాతలు | BVSN ప్రసాద్ |
సంగీతం | బి. అజనీష్ లోక్‌నాథ్ |
సినిమాటోగ్రఫీ | శామ్‌దత్ సైనుద్దీన్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
విరూపాక్ష సినిమా ఎలా ఉందంటే?
అప్పుడెప్పుడో కార్తికేయ అనే చిత్రం ఒక ఊరిలో జరిగే మిస్టరీ ని ఛేదించి పెద్ద విజయం సాధించింది, అయితే ఈ విరూపాక్ష కొంచెం అలానే అనిపించినా, అసలు కథ పరంగా ఎలాంటి పోలిక ఉండదు. విరూపాక్ష మొదటి సగం మంచి ఇంట్రెస్టి ని కలిగిస్తుంది, అసలు ఊర్లో ఎం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న తపన ప్రేక్షకుడికి కలుగుతుంది, అయితే సాయి ధరమ్ తేజ్ మరియు సంయుక్త మీనన్ ప్రేమ కథ అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు, కానీ ఆ ప్రేమ కథని కూడా కథలో భాగంగా ఉంచడం చాల బాగుంది.
ఇక రెండవ భాగం కథ లోతుల్లోకి వెళ్లేకొద్దీ మనం కూడా వెళ్తూ ఉంటాం, ఒళ్ళు గగుర్పుడిచే సన్నివేశాలు రెండవ భాగంలో మనం చూడవచ్చు, అయితే ఇన్ని మరణాల వెనక దాగి ఉన్న కారణం బాగుంటుంది, ఈ మధ్య కలం లో ఆ పాయింట్ ని ఎవరు టచ్ చేయలేదు. కథనం అక్కడక్కడా తడబడ్డప్పటికీ ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తుంది.
ఇక సాయి ధరమ్ తేజ్ కొంచెం ఆక్టివ్ గా కనిపించినప్పటికీ, తన పాత్రకి న్యాయం చేసాడు, సంయుక్త మీనన్ పర్వాలేదు, అభినవ్ గోమఠం కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదు, ఇక మిగిలిన తారాగణం వారి పాత్రల మేరకు బాగా చేసారు.
సుకుమార్ కథలు ఎంత విలక్షణంగా ఉంటాయో మనందరికీ తెల్సిందే, ఇక ఈ కథ కూడా చాల ఇంట్రెస్టింగ్ గా రాసాడు మరియు అంతే ఎంగేజింగ్ గా కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈలాంటి చిత్రానికి సంకేతింగా చాల మంచి టీం అవసరం, ఇక కాంతారాతో అందరిని ఆకర్షించిన అజినీష్ లోకనాథ్, ఈ చిత్రానికి మంచి నేపధ్య సంగీతాన్ని అందించారు, పాటలు మాత్రం అస్సలు ఆకట్టుకోవు, ఇక శామ్‌దత్ సైనుద్దీన్ ఛాయాగ్రహణం బాగుంది.
మొత్తం మీద విరూపాక్ష ఈ మధ్యకాలం వచ్చిన మంచి మిస్టికల్ థ్రిల్లర్.
ప్లస్ పాయింట్లు:
- నేపధ్య సంగీతం
- ఛాయాగ్రహణం
- ట్విస్టులు
మైనస్ పాయింట్లు:
- అక్కడక్కడా స్లో కథనం
సినిమా రేటింగ్: 2.75/5
ఇవి కూడా చుడండి:
- Vidudhala Part 1 Movie Review: విడుదల పార్ట్ 1 మూవీ రివ్యూ
- Vidudhala Part 1 Box Office Collections: విడుదల పార్ట్ 1 బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్
- Shaakuntalam Movie Review: శాకుంతలం మూవీ రివ్యూ