PS-2 Telugu Review: మణి రత్నం లాంటి గొప్ప దర్శకుడి చిత్రం వస్తుందంటే , ఒక్క తమిళ్ లోనే కాదు హిందీ మరియు తెలుగు భాషల్లో కూడా అభిమానులు ఎదురు చూస్తుంటారు. అయితే గత సంవత్సరం పొన్నియిన్ సెల్వన్ 1 తో మన ముందుకు వచ్చారు, కానీ చారిత్రాత్మక చిత్రం అవ్వడం అందులోనూ తమిళుల కథ అవ్వడం, దీనికి తోడు తెలుగులో సరిగా చిత్రాన్ని ప్రమోషన్ చేయకపోవడం, ఇలా చాల కారణాల వల్ల చిత్రం పెద్దగా ఆడలేదు. అయితే ఇప్పుడు మరి పొన్నియిన్ సెల్వన్ 2 తో మల్లి మన ముందుకొచ్చారు, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ తెలుసుకుందాం.
కథ
మొదటి భాగం అరుళ్ మురళి మరియు వల్లవరాయుడు సముద్రంలో దూకేసాక, అరుళ్ మురళి చనిపోప్యడనే వార్తని, వళవరాయుడు, సుందర చోళుడి చేరవేస్తాడు. అయితే, అరుళ్ మురళి బతికే ఉన్నాడని అని తెలుసుకున్న సుందర చోళుడు, తంజావూరు తీసుకొస్తాడు, ఒక వైపు పెదపళువెట్టియార్ తన మేనల్లుడైన మధురాంతకుడిని ని రాజుని చేయాలనీ చూస్తున్న సమయంలో అరుళ్ మురళి చనిపోలేదని తెలిసాక, మల్లి కుట్రలు మొదలవుతాయి. అసలు అరుళ్ మురళి ని కాపాడిన ఒక ముగా అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తుడగా, అరుళ్ మురళి నందిని అని చెప్తాడు, అసలు నందిని ముగా అమ్మాయి ఏంటి? సింహాసనాన్ని ఎవరు దక్కించుకున్నారు అనేది మీరు చిత్రం చూసి తెల్సుకోవాలి.
పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ నటీనటులు
విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తీ, త్రిష, ప్రభు, ఆర్ శరత్‌కుమార్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, రెహమాన్, రాధాకృష్ణన్ పార్థిబన్ మరియు తదితరులు నటించగా , రవి వర్మన్ ఛాయాగ్రహణం, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ మరియు మద్రాస్ టాకీస్ నిర్మించాయి.
సినిమా పేరు | పొన్నియిన్ సెల్వన్ 2 |
దర్శకుడు | |
నటీనటులు | |
నిర్మాతలు | |
సంగీతం | |
సినిమాటోగ్రఫీ | |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఎలా ఉందంటే?
బాహుబలి తరువాత ఇలాంటి చారిత్రాత్మక చిత్రాలు ఎక్కువగా రావడం మొదలయ్యాయి అనేది వాస్తవం. అయితే బాహుబలి కి ఈ పోనీయిన్ సెల్వన్ కి ఎలాంటివో పోలిక లేదు, మణి రత్నం తన మార్కు డ్రామా తో ఈ కథని రక్తి కట్టించే ప్రయత్నం చేసాడు. అయితే మొదటి భాగం లో ఉన్న పాత్రల్ని, వారి పేర్లని , కథ ని అర్థం చేసుకోవడంలో కొంచెం సమస్య ఎదుర్కొన్నారు, అయితే ఆ సమస్య ఈ రెండవ భాగంతో తీరిపోతుంది అని చెప్పొచ్చు. రెండవ భాగం చాల ఇంట్రెస్టింగ్ గా ప్రారంభం అవడమే కాకుండా, కథని చెప్పే విధానం చాల బాగుంది, సగటు ప్రేక్షకునికి తెరపై ఎం జరుగుతుంది అనెద్ది ఎటువంటి సమస్య లేకుండా అర్థమవుతుంది. ఇక రాజ్యం కోసం, సింహాసనం కోసం కుట్రలు, కుతంత్రాలు కాకుండా, మంచి ట్విస్టులు కూడా ఈ రెండవ భాగంలో మనం చూడొచ్చు.
ఇక ఎలాంటి పాత్రలలోనైనా పరకాయ ప్రవేశం చేయగలిగే సత్త ఉన్న నటుడు విక్రమ్ గురించి కొత్తగా చెప్పడానికి ఎం లేదు, తన పాత్రకి 100 శాతం న్యాయం చేసాడు. మొదటి భాగంలో కార్తీ యొక్క చమత్కారాన్ని చుసిన మన, ఈసారి అతని విన్యాసాలు చూస్తాం, అయితే తన పాత్ర నిడివి కొంచెం తక్కువ ఉన్నప్పటికీ చాల బాగా చేసాడు, ఇక ఈ చిత్రానికి ప్రధాన పత్రమ అయితే అరుళ్ మురళి గా చేసి జయం రవి, మొదటి భాగంలో కంటే ఈ రెండవ భాగంలో చాల బాగా చేసాడు. ఇక త్రిష, ఐశ్వర్య రాజేష్, శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి తదితరాలు వారి పాత్రల మేరకు బాగా చేసారు.
మణి రత్నం ఈసారి తనదైన శైలి లో ప్రేక్షకులని కట్టిపడేసాడు అని చెప్పొచ్చు ఇక సాంకేతికంగా ఏ. ఆర్ రెహ్మాన్ పాటలు అంతగా ఆకట్టుకోవు కానీ నేపధ్య సంగీతం బాగుంది, రవి వర్మన్ ఛాయాగ్రహణం పర్వాలేదు.
మొత్తం మీద పొన్నియిన్ సెల్వన్ ౨ థియేట్రికల్ ఎక్సపీరియన్సు చిత్రం
ప్లస్ పాయింట్లు:
- నేపధ్య సంగీతం
- ఛాయాగ్రహణం
- ట్విస్టులు
మైనస్ పాయింట్లు:
- అక్కడక్కడా స్లో కథనం
సినిమా రేటింగ్: 2.75/5
ఇవి కూడా చుడండి:
- Virupaksha Movie Review: విరూపాక్ష మూవీ రివ్యూ
- Virupaksha Box Office Collections: విరూపాక్ష బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్
- Vidudhala Part 1 Movie Review: విడుదల పార్ట్ 1 మూవీ రివ్యూ