Agent Movie Review: ఏజెంట్ మూవీ రివ్యూ

Agent Telugu Review: ఏజెంట్ ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది, అఖిల్ మునుపెన్నడూ కనిపించని లుక్ తో, సిక్స్ ప్యాక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ లాంటి సాఫ్ట్ చిత్రం తరువాత, యాక్షన్ మూవీతో వస్తుండంతో , ఏజెంట్ పైన చాల అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాల నడుమ ఈ చిత్రం ఈరోజు విడులైంది, ఇక ఆలస్యం చేయకుండా ఈ చిరం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

Agent Movie Review

కథ

జోనాథన్ రాజ్ షెకావత్(అఖిల్ ) ఎలాగైనా ఏజెంట్ కావాలని ఒక రా ఏజెంట్ ఐన మహాదేవ్ (మమ్మూట్టి ) దగ్గర చేరతాడు. ఈ ట్రైనింగ్ సమయంలో ఇతనికి విద్య (సాక్షి వైద్య ) అనే అమ్మాయి పరిచయం అవుతుంది, అయితే ట్రైనింగ్ పూర్తి అయ్యాక ఏజెంట్ జానీ ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజషన్ ని ఒక మిషన్ జారకుండా ఆపడానికి పంపిస్తాడు మహాదేవ్, కానీ అనుకోకుండా, మహాదేవ్, ఏజెంట్ జానీ ని దేశద్రోహి అని ముద్ర వేస్తాడు, దీంతో ఏజెంట్ ప్రాణాలకి ప్రమాదం ఏర్పడుతుంది. అసలు జోనాథన్ రాజ్ ఎందుకు ఏజెంట్ కావాలి అనుకున్నాడు, అతను మహాదేవ్ దగ్గర ఎందుకు చేరాడు?మహాదేవ్ ఏజెంట్ ని ఎందుకు ఇరికించాడు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు చిత్రాన్ని చూడాల్సిందే.

ఏజెంట్ మూవీ నటీనటులు

అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య మరియు ఇతరులు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సంగీత హిప్ హాప్ తమిజా రామబ్రహ్మం సుంకర సమకూర్చగా, ఛాయాగ్రహనమ్ రసూల్ ఎల్లోర్ అందించారు, ఏ కే ఎంటెర్టైనెంట్న్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుఏజెంట్
దర్శకుడుసురేందర్ రెడ్డి
నటీనటులుఅఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య మరియు ఇతరులు
నిర్మాతలురామబ్రహ్మం సుంకర
సంగీతంహిప్ హాప్ తమిజా
సినిమాటోగ్రఫీరసూల్ ఎల్లోర్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

ఏజెంట్ సినిమా ఎలా ఉందంటే?

స్పై మూవీస్ ఎక్కువ సమానం బాలీవుడ్ లో చూస్తూ ఉంటాం, ఆ ఐతే మన తెలుగులో ఈ మధ్య కాలంలో అడవి శేష్ గూఢచారి అనే చిత్రంతో మల్లి పరిచయం చేసాడు. అయితే ఏజెంట్ కి ఉన్న ప్రత్యేక ఏంటంటే, ఇది రెగ్యులర్ స్పై మూవీ కాదు , స్పై కావాలనుకునే ఒక యంగ్ కుర్రాడు, ఒక రా ఏజెంట్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు.

చిత్రం ఒక పతాక సన్నివేశముతో చాల బాగా ప్రారంభం అవుతుంది, ఎక్కువ గా సమయం వృధా చేయకుండా, కథ ఏంటి అనేది మొదట్లోనే చెప్పేసారు. ఇక మొదటి భాగంలో హీరో హీరోయిన్ మధయ్ ఉన్న లవ్ ట్రాక్ తప్ప, మిగతా అంత ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మిగతా సగం చూడాలనే ఉత్సుకతని సృష్టిస్తుంది. ఇక రెండవ భాగంలో ఎక్కువ యాక్షన్ కున్నప్పటికీ, కొన్ని ట్విస్ట్ లతో మనల్ని ఎంగేజ్ చేస్తుంది. క్లైమాక్స్ కోచెమ్ ఓవర్ ద టాప్ ఉన్నప్పటికీ, ఓవరాల్ గా బాగుంది.

అఖిల్ కి ఈ పాత్ర బాగానే సూట్ ఐన, అతను చేసే విన్యాసాలు వయసుకు మించి చేస్తున్నదనిపిస్తుంది. నటన పరంగా కొంచెం మెరుగయ్యాడని చెప్పొచ్చు, ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో అధిభూతంగా చేసాడు. సాక్షి వైద్య ఉన్నంతలో పర్వాలేదు, డినో మోరియా కూడా పర్వాలేదు, ఇక మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి పాత్ర, హీరో పాత్రకి ధీటుగా ఉంటుంది, ఆయన కూడా ఎక్కడ తగ్గకుండా చాల బాగా చేసాడు. ఇక మిగిలిన తారాగణం ఉన్నంతలో బాగా చేసారు.

సురేందర్ రెడ్డి, తాను స్టైలిష్ దర్శకుడని మరోదారి నిరూపించాడు, మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, జానర్ కి కట్టుబడి ఉండడం. ఇక కథనం లో కొన్ని లోపాలున్నప్పటికీ ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో విజయం సాధించాడని చెప్పొచ్చు.

సాంకేతికంగా ఏజెంట్ చాల బాగుంది, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్, హిప్ హాప్ తమిజా ఈసారి కొంచెం నిరాశ పరిచాడని చెప్పొచ్చు.

మొత్తం మీద ఏజెంట్ డీసెంట్ స్పై యాక్షన్ చిత్రం.

ప్లస్ పాయింట్లు:

  •  ఛాయాగ్రహణం
  • ట్విస్టులు
  • యాక్షన్

మైనస్ పాయింట్లు:

  • ఎమోషన్ లేకపోవడం

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు