Save The Tigers Series Review: సేవ్ ది టైగర్స్ సిరీస్ రివ్యూ

Save The Tigers Telugu Review: OTT ప్లాటుఫార్మ్స్ అన్ని ఈ మధ్య తెలుగు మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, ఆలా ఈ మధ్య చాలానే మంచి మంచి మూవీస్ మరియి సిరీస్ లు వచ్చాయి. ఇప్పుడు హాట్ స్టార్ మరి మంచి సిరీస్ తో మన ముందుకొచ్చింది అదే సేవ్ ది టైగర్స్. ట్రైలర్ తోనే అందరిని ఆకర్షించిన ఈ సిరీస్, ఈరోజు హాట్ స్టార్ లో ప్రీమియర్ అవుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సిరీస్ ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెలుసుకుందాం.

Save The Tigers Series Review

కథ

ఘంటా రవి (ప్రియదర్శి) రాహుల్ అభినవ్ (అభినవ్ గోమతం) విక్రమ్ చైతన్య (చైతన్య కృష్ణ) ఒకరోజు ముగ్గురూ మదర్స్ డే ఈవెంట్‌లో కలుసుకుంటారు అక్కడ వారు వారి భార్యల గురించి, వారు పీటే టార్చర్ గురించి షేర్ చేసుకుంటారు, ఇక అప్పట్నుంచి ముగ్గురు స్నేహితులుగా మారతారు అయితే , ఈ ముగ్గురూ ఇతర పిల్లల మథర్స్ తో కలిసి అన్ని ఆటలలో పాల్గొంటారు ఇక ఈ విషయం వారి భార్యలకు తెలియడంతో టార్చర్ ఇంకా ఎక్కువవుతుంది చివరికి ఈ ముగ్గురు రక్షించ మణి పోలీస్లని ఆశ్రయిస్తారు. చివరికి ఎం జరిగింది అనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి.

సేవ్ ది టైగర్స్ సిరీస్ నటీనటులు

ప్రియదర్శి, అభినవ్ గోమతం, కృష్ణ కృష్ణ, సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని, గంగవ్వ, హర్షవర్ధన్, రోహిణి, సద్దాం, తదితరులు. ఈ సిరీస్ కథని ప్రదీప్ అద్వైతం అందించగా మరియు తేజ కాకుమాను దర్శకత్వం వహించారు, ఎస్ వి. విశ్వేశ్వర్ సినిమాటోగ్రాఫర్, అజయ్ అరసాడ మ్యూజిక్ కంపోజర్, శ్రవణ్ కటికనేని ఎడిటింగ్.

సినిమా పేరుసేవ్ ది టైగర్స్ 
దర్శకుడుతేజ కాకుమాను
నటీనటులుప్రియదర్శి, అభినవ్ గోమతం, కృష్ణ కృష్ణ, సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని, గంగవ్వ, హర్షవర్ధన్, రోహిణి, సద్దాం, తదితరులు
నిర్మాతలుతేజ కాకుమాను
సంగీతంఅజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీఎస్ వి. విశ్వేశ్వర్
ఓటీటీ రిలీజ్ డేట్27- ఏప్రిల్ – 2023
ఓటీటీ ప్లాట్ ఫార్మ్హాట్ స్టార్

సేవ్ ది టైగర్స్ సిరీస్ ఎలా ఉందంటే?

సేవ్ ది టైగర్స్ అదంతం నవ్వించే సిరీస్, పాత్రల పరిచయంతో కొంచెం స్లో గా ప్రారంభం ఐన ఈ సిరీస్, తరువాత అభినవ్ గోపీమతం లైఫ్, ప్రిదర్శి లైఫ్, చైతన్య కృష్ణ లైఫ్ , వారి భాందవ్యా జేజేవితాలు చూసాక ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వకుండా ఉండలేరు. ప్రతి ఎపిసోడ్ లో మనం రోజు చూసే భార్య భర్తల మధ్య వచ్చే తగాదాలు, వల్ల మధయ్ గొడవలు, ఇలా ఒకటేంటి అన్ని విషయాలని కళ్ళకి కట్టినట్టు చూపించారు, అయితే ఎక్కడ కూడా సీరియస్ గా చెప్పకుండా కామెడీ ని జోడించి బాగా చెప్పారు.

అయితే అంత బాగేనా ఉన్న, ఒక కామెడీ ని నమ్ముకుని ఏకంగా సిరీస్ చేయడం ఎందుకో తెలియట్లేదు. కథలో అసలు ఎం చెప్పాలి అనుకున్నారు క్లారిటీ లేదు. కేవలం భార్య భర్తల మధ్య జరిగే గోడలని కామెడీ రూపం లో చూపించారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈ సిరీస్ కచ్చితంగా నవ్విస్తుంది.

ఈ నగరానికి ఏమైంది తరువాత, అభినవ్ గోమఠం కి సరైన పాత్ర పడలేదు, అయితే రాహుల్ అభినవ్ గా కొంతమేరకు నవ్వించాడు, ఇక బలగం తో మంచి హిట్ కొట్టిన ప్రియదర్శి, మల్లి తనదైన నటనతో, కామెడీ తో మెప్పించాడు, ఒక చైతన్య కృష్ణ ఎప్పట్లాగే బాగ్ చేసాడు, ఇక వీళ్లభార్యలు గా చేసిన, పావని గంగి రెడ్డి, జబర్దస్త్ సుజాత, దేవియని ఉన్నంతలో బాగా చేసారు. ఇక గంగవ్వ తనదైన నటనతో నవ్విస్తుంది.

కథ లో కొత్తదనం లేకపోయినా, అందరికి కనెక్ట్ అయ్యే అంశాలని జోడించి తేజ కాకుమాను పర్వాలేదన్పించుకున్నాడు. సాంకేతికంగా సేవ్ ది టైగర్స్ పర్వాలేదు, అజయ్ అరసాడ సంగీతం పర్వాలేదు, ఎస్ వి. విశ్వేశ్వర్ ఛాయాగ్రహణం బాగుంది.

ఓవర్ అల్ గా, సేవ్ ది టైగర్స్ మంచి కామెడీ ఎంటర్టైనర్.

ప్లస్ పాయింట్లు:

  • కామెడీ

మైనస్ పాయింట్లు:

  •  కథ

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు