Ugram Movie Review: ఉగ్రం మూవీ రివ్యూ

Ugram Telugu Review: అల్లరి నరేష్ ఒకప్పుడు కామెడీ సినిమాలకి పెట్టింది పేరు, రాజేంద్ర ప్రసాద్ తరువాత, మంచి కామెడీ హీరో గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నటుడిగా మరో మెట్టు ఎదగాలని, అప్పటివరకు కామెడీ చిత్రాలని చేసిన అల్లరి నరేష్, శంభో శివ శంభో చిత్రం సీరియస్ పాత్రలో కనిపించి ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక అప్పట్నుంచి ఇటు కామెడీ చిత్రాలు చేస్తూనే, కథ నచ్చితే సీరియస్ చిత్రాలని చేయడం కూడా మొదలు పెట్టాడు. ఇక నాంది అనే చిత్రం తో గత ఏడాది మంచి హిట్ కొట్టిన నరేష్, అదే దర్శకుడితో ఈసారి ఉగ్రం అనే చిత్రం తో మన ముందుకొచ్చాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూలో తెల్సుకుందాం.

Ugram Movie Review

కథ

శివ కుమార్ (నరేష్) ఒక పోలీస్ ఆఫీసర్, తన భార్య పిల్లల్తో సంతోషంగా ఉంటాడు, అయితే అనుకోకుండా సిటీ లో పిల్లలు మిస్ అవ్వడంతో శివ కుమార్ ఆ కేసు ని టేక్ అప్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడ్తాడు. ఈ ప్రాసెస్ లో తన భార్యని చంపేసి, తన కూతుర్ని తీసుకెళ్తారు కొందరు దుండగులు, ఇక శివ కుమార్,డిప్రెసిషన్లోకి వెళ్ళిపోతాడు, ఇక బైటికి వచ్చి తన కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు, దీని వెనక ఎవరున్నారు ? తన భార్య ని చంపినా వాళ్ళ మీద ఎలా పాగా తీర్చు కున్నాడు అనేది మిగిలిన కథ.

ఉగ్రం మూవీ నటీనటులు

అల్లరి నరేష్, మర్నా, మణికంఠ వారణాసి, ఇంద్రజ, శత్రు, శరత్ లోహితాశ్వ తదితరులు. ఈ చిత్రానికి కథ అందించింది టుం వెంకట్ , విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించాగా , సిద్ధార్థ్ జె ఛాయాగ్రహణం అందించారు, సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించారు.

సినిమా పేరుఉగ్రం
దర్శకుడువిజయ్ కనకమేడల
నటీనటులుఅల్లరి నరేష్, మర్నా, మణికంఠ వారణాసి, ఇంద్రజ, శత్రు, శరత్ లోహితాశ్వ తదితరులు
నిర్మాతలుసాహు గారపాటి మరియు హరీష్ పెద్ది
సంగీతంశ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీసిద్ధార్థ్ జె
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

ఉగ్రం సినిమా ఎలా ఉందంటే?

అల్లరి నరేష్ కొత్తగా కనిపించదు అనే విషయం తప్ప, ఈ ఉగ్రం చిత్రంలో కొత్తదనం లేదు. కథ కూడా చాల సింపుల్ గా, ఇంతకముందు చాల సినిమాల్లో చుసిన విధంగానే ప్రారంభం అవుతుంది. అయితే మొదటి సగం కథ నాయకుడి పాత్ర పరిచయం, తన డ్యూటీ ప్రపాంచాం మరియు తన కుటుంబం వీటితోనే సాగిపోతుంది, అయితే మధ్య మధ్యలో చిన్న పిల్లలు మిస్ అవడం అనే పాయింట్ ని చూపించిన, అది కూడా ఒక దశ దాటాక ఎందుకు మిస్ అవుతున్నారు, దానికి కారణం కూడా ఇట్టే తెలిసిపోతుంది ఏది ఏమైనప్పటికి ఇంటర్వెల్ దగ్గర కొంచెం ఇంట్రెస్ట్ కలిగిస్తుంది.

ఇక రెండవ భాగం లో హీరో తన కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం తో పాటు, మిస్ ఐన పిల్లల్ని కాపాడటం అంతిమ లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే ఈ ప్రాసెస్ అంత కూడా కొత్త గా లేకపోయినా,నరేష్ ని స్క్రీన్ మీద ఊర మాస్ అవతారం లో చూడటం మరియు దర్శకుడు కూడా రెండవ భాగాన్ని కొంచెం రియలిస్టిక్ గా తీయడం తో ఉగ్రం కొంత మేర ఎంగేజ్ చేస్తుంది.

నరేష్ నటన పరంగా ఎప్పుడు నిరాశపడుచడు, కామెడీ ఐన సరే సీరియస్ ఐన సరే, ఇక ఈ సినిమాలో ఇటు పోలీస్ ఆఫీసర్ గా మరియు పగ తీర్చుకునే ఒక తండ్రిగ రెండు పాత్రలకి న్యాయం చేసాడు. ఇక మీర్నా ఉన్నంతలో పరవాలేదు, ఇంద్రజ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ స్క్రీన్ మీద తన నటనతో తన పాత్రకి న్యాయం చేసింది, ఇక వినరో భాగ్యమో విష్ణు కథ లో చిన్న పాత్రలో మెరిసిన శరత్ లోహితాశ్వ, ఈ చిత్రం విలన్ పాత్రలో బాగా చేసాడు, ఇక మిగిలిన తారాగణం తమ పాత్రల మేరకు బాగానే చేసారు.

నాంది తో మంచి ప్రసంశలు అందుకున్న విజయ్ కనకమేడల, ఈ చిత్రం తో ప్రేక్షకులని మెప్పించడంలో విఫలం అయ్యాడని చెప్పొచ్చు. రొటీన్ కథనే తీస్కున్నప్పటికి, ఎంగేజింగ్ గా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు.

సాంకేతికంగా ఉగ్రం పర్వాలేదు, అయితే సిద్ధార్థ్ జె ఛాయాగ్రహణం అక్కడక్కడా బాగున్నప్పటికీ చాల వరకు ఏక్కువ కలర్స్ ని వాడారు, ఇక శ్రీ చరణ్ పాకాల పాటలు జస్ట్ ఓకే, మరియు నేపధ్య సంగీతం పర్వాలేదు.

మొత్తం మీద, ఉగ్రం రొటీన్ రేవేంజే యాక్షన్ డ్రామా

ప్లస్ పాయింట్లు:

  • నటన
  •  నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్లు:

  • ఉహించదగిన కథనం

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు