Custody Telugu Review: అక్కినేని అభిమానులు చాల ఆసక్తితో ఎదురుచూస్తున్నధీ, నాగార్జున కి గాని, అఖిల్ గాని, నాగ చైతన్య కి గాని మంచి హిట్ రావాలని. కానీ ఇటు నాగార్జున ది ఘోస్ట్, నాగ చైతన్య థాంక్యూ, రీసెంట్ గా అఖిల్ ఏజెంట్ అన్ని డిసాస్టర్ గా నిలిచాయి. దింతో అభిమానులు నిరాశ చెందక తప్పలేదు, ఇక మల్లి ఇప్పుడు నాగ చైతన్య ఎలాగైనా హిట్ కొట్టాలని ‘కస్టడీ’ అనే చిత్రం తో మన ముందుకొచ్చాడు. అయితే ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.
కథ
శివ(నాగ చైతన్య ) నిజాయితీ గల కానిస్టేబుల్, తను ప్రేమించిన రేవతి(కృతి శెట్టి ) పెళ్లి చేసుకోను హ్యాపీ గా ఉండాలి అనుకుంటాడు. అయితే సఖినేటి పల్లి పోలీస్ స్టేషన్లో రాజన్న ( అరవింద్ స్వామి) ని అరెస్ట్ చేసి ఉంచుతారు, అదే టైం డ్యూటీ లో ఉన్న శివ కి రాజన్న ని ఎవరో చంపేస్తున్నారు అని తెలుస్తుంది, ఇంకో వైపు రేవతి కి వేరే పెళ్లి నిశ్చయించడంతో వేరే ధరి లేక, శివ ఎలాగైనా న్యాయం గెలవాలి, రాజన్నని కోర్ట్ లో అప్పగించాలి అని, అదే రాత్రి, ఇటు రేవతి తో పాటు రాజాన్ని కూడా తీసుకెళ్తాడు. దీంతో శివ కోసం మరియు రాజన్న కోసం పోలీస్ లు గాలించడం మొదలుపెడతారు. అసలు రాజన్నని ఎవరు చాంపలి అనుకున్నారు, శివ ఈ పోరాటంలో గెలిచాడా లేదా అనేది మిగతా కథ.
కస్టడీ మూవీ నటీనటులు
అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాథ్, వెన్నెల కిషోర్, ప్రేమి అమరెన్, సంపత్ రాజ్ మరియు ప్రియమణి తదితరులు నటించిన . ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు మరియు నిర్మాత శ్రీనివాస చిట్టూరి. ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఎస్ ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.
సినిమా పేరు | కస్టడీ |
దర్శకుడు | వెంకట్ ప్రభు |
నటీనటులు | అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి తదితరులు |
నిర్మాతలు | శ్రీనివాస చిట్టూరి |
సంగీతం | ఇళయరాజా, యువన్ శంకర్ రాజా |
సినిమాటోగ్రఫీ | ఎస్ ఆర్ కతిర్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
కస్టడీ సినిమా ఎలా ఉందంటే?
ప్రేమ కథ చిత్రాలకి అక్కినేని హీరోలు మారుపేరు, అయితే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కినేని హీరోలు మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే నాగార్జునకి అంత మాస్ ఇమేజ్ రాకపోవడం తో నాగ చైతన్య మరియు అఖిల్ ఒక మంచి మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ ఉండడం తెలిసిందే, అయితే నాగ చైతన్య కి కొంత మాస్ ఇమేజ్ ఆటో నగర్ సూర్య తో వచ్చింది, ఇప్పుడు ఈ కస్టడ్డి చూస్తే మంచి మాస్ ఇమేజ్ వచ్చే లాగా అయితే ఉంది.
కస్టడీ కమర్షియల్ చిత్రమే ఐన, ఒక రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా లేకపోవడం ఈ చిత్రం ప్రత్యేకతా. ఒక మాములు కానిస్టేబుల్ ఒక విలన్ చనిపోకుండా కాపాడటం అనే పాయింట్ ని చాలా ఆసక్తి కారణంగా అనిపించే పాయింట్. మొదటి సగం లో కొంత హీరో మరియు హీరోయిన్ లవ్ ట్రాక్ ఉన్నప్పటికి, మిగతా అంత ఎంగేజింగ్ ఉంటుంది. అందులోనూ ఈ కథ నాలుగు రోజుల్లో జరుగుతూ ఉంటుంది, శివ, విలన్ ని కాపాడ్డానికి చేసి ప్రయత్నం, ఇటు శివ ప్రేయసి రేవతి కూడా శివ తో పాటె ఉండటం, పోలీసులు విల్లా కిసాన్ వెతకటం, ఇదంతా ఉత్కంఠభరితంగా సాగుతుంది.
శివ పాత్రల నాగ చైతన మొదట్లో కొంచెం సెట్ అవ్వనట్లు అనిపించినా, ఎప్పుడైతే కథలో లీనమయ్యాక, శివ పాత్రతో కనెక్ట్ అవ్వకుండా ఉండలేం. నటన విషయం లో ఇంకో మెట్టు ఎక్కడనే చెప్పొచ్చు, ఇక కృతి శెట్టి రేవతి పాత్రలో ఉన్నంతలో పర్వాలేదు, ఒక నాగ చైతన్య కి సమానంగా స్క్రీన్ టైం ఉన్న అరవింద్ స్వామి అంతే అద్భుతంగా తన పాత్రని పండించాడు, శరత్ కుమార్ పర్వాలేదు, ఇక మిగిలిన తారాగణం వారి పాత్రల మేరకు బాగానే చేసారు.
వెంకట్ ప్రభు తమిళ్ లో మంచి దర్శకుడు అని పేరు, అయితే తెలుగు ప్రేక్షకులకి అనుగుణంగా, ఇటు తమిళ ప్రేక్షకులకి అనుగుణంగా ఈ చిత్రాన్ని చాల బాగా ప్రెసెంట్ చేసారు. అయితే కథ, కథనం అంత బాగున్నప్పటికీ, చిత్రంలో అక్కడక్కడా తమిళ్ నేటివిటీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
సాంకేతికంగా కస్టడీ చిత్రం చాల బాగుంది, ఇక ఎస్ ఆర్ కతిర్ ఛాయాగ్రహణం సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, ఇక ఇళయరాజా మరియు యువన్ శంకర్ రాజా పాటలు అంతగా ఆకట్టుకొవూ కానీ నేపధ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని మరో మెట్టు ఎక్కించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఓవర్ అల్ గా, కస్టడీ చిత్రం మంచి ఇంటెన్స్ యాక్షన్ డ్రామా.
ప్లస్ పాయింట్లు:
- కథ, కథనం
- ఛాయాగ్రహణం
- యాక్షన్
మైనస్ పాయింట్లు:
- మొదటి సగం కొంచెం స్లో
సినిమా రేటింగ్: 2.75/5
ఇవి కూడా చుడండి:
- Ugram Box Office Collections: ఉగ్రం బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్
- Ugram Movie Review: ఉగ్రం మూవీ రివ్యూ
- Ramabanam Movie Review: రామబాణం మూవీ రివ్యూ