Newsense Web Series Review: ఒకప్పుడు నవదీప్ కి బాగా నటిస్తాడు అనే పేరు ఉండేది, దాన్ని నిజం చేస్తూ, తను కూడా మంచి మంచి సినిమాలు చేసాడు, కానీ స్టార్ హీరో అవుతాడు అనుకున్న టైం లో ప్లాప్ లు రావడం మొదలయ్యాయి. టాలీవుడ్ లో అప్పటికే యంగ్ హీరోలు రావడం, నవదీప్ మార్కెట్ తగ్గడం తో, సినిమా అవకాశాలు రావడం తగ్గిపోయాయి. కానీ నవదీప్ ఎప్పుడు బాధపడలేదు, ఇక మెయిన్ హీరో గా కష్టం అని గ్రహించి, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని సినిమాలని చేస్తూ వచ్చాడు. OTT పుణ్యమా అని నవదీప్ అవకాశాలు పెరిగాయి, ఇది వరకే కొన్ని వెబ్ సిరీస్ లు చేసిన నవదీప్, కొత్తగా ఆహా లో చేసిన న్యూ సెన్స్ అనే వెబ్ సిరీస్ తో మన ముందుకొచ్చాడు. ఇక ఏ మాత్రం ఆలయం చేయకుండా ఈ సిరీస్ ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెలుసుకుందాం.
కథ
మదనపల్లి అనే టౌన్ లో పోలీస్ లకి మరియు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసే వారికీ పెద్ద గొడవ జరుగుతుంది, అయితే ఈ గొడవలో చాల మంది చనిపోయారు, పోలీస్లు కూడా వారిని ఎన్కౌంటర్ చేస్తారు. ఇక జర్నలిస్ట్ ఐన శివ (నవదీప్) కి, ఈ ఇన్సిడెంట్ వెనక ఒక రాజకీయ నాయకుడి హస్తం ఉంది అని తెలుస్తుంది, ఇక ఈ న్యూస్ వేయకుండా ఉందని శివ పెద్ద మొత్తం లో డబ్బు అడగడం తో, ఆ రాజకీయ నాయకుడు మొదట్లో ఒప్పుకున్నా, తరువాత శివని చంపడానికి పన్నాగం పన్నుతాడు, ఇక శివ దీన్ని ఎలా ఎదుర్కున్నాడు అనేది మిగతా కథ.
న్యూసెన్స్ వెబ్ సిరీస్ నటీనటులు
నవదీప్ , బిందు మాధవి మరియు తదితరులు నటించిన ఈ సిరీస్ కి దర్శకత్వం వహించింది శ్రీ ప్రవీణ్ కుమార్, ఛాయాగ్రహణం వేదరామన్, సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
వెబ్ సిరీస్ పేరు | న్యూసెన్స్ |
దర్శకుడు | శ్రీ ప్రవీణ్ కుమార్ |
నటీనటులు | నవదీప్ , బిందు మాధవి, తదితరులు |
నిర్మాతలు | టీజీ విశ్వప్రసాద్ |
సంగీతం | సురేష్ బొబ్బిలి |
సినిమాటోగ్రఫీ | వేదరామన్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | మే 12 2023 |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ఆహా వీడియో |
న్యూసెన్స్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
మీడియా పైన ఇదివరకు మన చాల సినిమాలే చూసాం అయితే సినిమా మొత్తం మీడియా చుట్టూ నడిచే సినిమాలు చాల తక్కువ. అప్పట్లో పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు మొత్తం మీడియా ఎలా ఉన్నటుంది అని చాల బోల్డ్ గా చూపించాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఇక ఇప్పుడు అంతే బోల్డ్ గా ఈ న్యూ సెన్స్ వెబ్ సిరీస్ చూపించింది.
కథ మామూలుగానే ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులకి, పలుకుబడి ఉన్న వారికీ మీడియా ఎలా పని చేస్తుంది అనేది చాల బాగా చూపించారు. అయితే మొదటి రేడు ఎపిసోడ్ లు కథ పెద్దగా చెప్పకపోయినా, ప్రధాన కథానాయకుడు శివ చేత మీడియా మీద చెప్పించిన డైలాగ్స్ ఆలోచింపచేస్తాయి. అయితే కథ, కథనం కూడా కొంచెం ఆసక్తి కరంగా ఉంటె ఇంకా బాగుండేది, తరువాత ఎం జరుగుతుంది అనేది ముందే అర్థమైపోవడం సిరీస్ లో అతి పెద్ద లోపం.
శివ గా నవదీప్ కి మంచి మార్కులే పడ్డాయి, ముందుగా అతని లుక్ శివ పాత్రకి సరిగ్గా సరిపోయింది, ఇక తన భాష, నటన అన్ని చక్కగా కుదిరాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బిందు మాధవి కూడా మంచి పాత్రా దొరికింది, ఒక్క డబ్బింగ్ కొంచెం సెట్ అవనట్టుగా అనిపించింది తప్పిస్తే, ఓవర్ అల్ గా తన పాత్రకి న్యాయం చేసింది. ఇక మిగతా నటి నటులు తమ పాత్రల మేరకు బాగా చేసారు.
శ్రీ ప్రవీణ్ కుమార్, ఇలాంటి కథతో వచ్చినందుకు ముందుగా తనని అభినందించాలి, కథలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, మీడియా పైన ఇంత ధైర్యంగా వేలెత్తి చూపించేలా తీయడం అనేది అభినంచిల్సిన విషయం.
సాంకేతికంగా ఈ న్యూ సెన్స్ వెబ్ సిరీస్ పర్వాలేదు, అయితే అక్కడక్క క్వాలిటీ తగ్గినట్టు అనిపిస్తుంది. ఇక వేదరామన్ ఛాయాగ్రాణం పర్వాల్వెదు, సురేష్ బొబ్బిలి నేపధ్య సంగీతం ఈ సిరీస్ కి ప్లస్ అని చెప్పొచ్చు. ఇక మిగిలిన సాంకేతిక నిపుణుల బాగా చేసారు.
మొత్తం మీద న్యూ సెన్స్ మస్ట్ వాచ్ పొలిటికల్ డ్రామా.
ప్లస్ పాయింట్లు:
- సిరీస్ నేపధ్యం
- కొన్ని ఎపిసోడ్ లు
- మాటలు
మైనస్ పాయింట్లు:
- ఉహించదగిన నరేషన్
- ఎమోషన్ లేకపోవడం
న్యూసెన్స్ వెబ్ సిరీస్ రేటింగ్: 2.75/5
ఇవి కూడా చుడండి: