Anni Manchi Sakunamule Movie Review: అన్ని మంచి శకునములే మూవీ రివ్యూ

Anni Manchi Sakunamule Telugu Review: స్వప్న దత్ బ్యానర్ స్వప్న సినిమాస్ నుంచి ఏదైనా సినిమా వస్తున్నది అంటే, దన్తలో ఏదో విషయం ఉండే ఉంటుంది అని అనుకుంటారు ప్రేక్షకులు, దానికి కారణం, ఆ బ్యానర్ కొకైన్ వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహా నటి, సీత రామం. ఇక ఇపుడు సంతో శోభన్ ప్రధాన పాత్రలో నటించిన అన్ని మంచి శకునములే పైన కూడా మంచి అంచనాల ఏర్పడ్డాయి, ప్రీ రిలీజ్ కి నాని, దుల్కర్ సల్మాన్ రావడంతో చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి, ఇక ఇన్ని అంచనాల నడుమ ఈ చిత్రం ఈరోజు విడుదలైంది, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం చూడొచ్చా లేదా తెల్సుకుందాం.

Anni Manchi Sakunamule Movie Review

కథ

రిషి(సంతోష్ శోభన్) చిన్నప్పట్నుంచీ భయస్తుడు, అన్నింట్లో వీక్ అనుకుంటూ ఉంటాడు, ,అయితే చిన్నప్పట్నుంచీ ఆర్య (మాళవిక నాయర్) ని ప్రేమిస్తాడు, కానీ చెప్పాడు, ఇది కాస్త రిషి మరియు ఆర్య కుటుంబాలకి గొడవ అవ్వడంతో ఆర్య మీద ఉన్న ప్రేమ ని తనలోనే దాచుకుంటాడు. పై చదువుల కోసం వెళదాం తో అక్కడ ఆర్య తో క్లోజ్ అవుతాడు రిషి, ఒక సమయం లో రిషి, ఆర్య కి విషయం చెప్పేస్తాడు, కానీ రిషి ఎలాంటి వాడు అని ఆర్య కి ముందు నుంచే తెలియడం తో నో చెప్పేస్తుంది, అయితే ఆర్య కి వేరే వాళ్ళతో పెళ్లి నిశ్చయం అయిందని తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది. చివరికి, రిషి ఎం చేసాడు? ఆర్య ప్రేమని గెలుచుకున్నాడు? అసలు రెండు కుటుంబాలకి జరిగిన గొడవ ఏంటి అనేది చిత్రం చూసి తెల్సుకోవాలి.

అన్ని మంచి శకునములే మూవీ నటీనటులు

సంతోష్ షోబన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, సౌకార్ జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వా నాయక్, ఊర్వసి, అశ్విన్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఛాయాగ్రహణం సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్, సంగీతం మిక్కీ జె మేయర్, నిర్మాత ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానేర్ పైన నిర్మించారు.

సినిమా పేరుఅన్ని మంచి శకునములే
దర్శకుడునందిని రెడ్డి
నటీనటులుసంతోష్ షోబన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, తదితరులు
నిర్మాతలుప్రియాంక దత్
సంగీతంమిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీసన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

అన్ని మంచి శకునములే సినిమా ఎలా ఉందంటే?

తెలుగు సినీ చరిత్రలో కొన్ని వేల కుటుంబ కథ చిత్రాలు వచ్చాయి, ఇంకా కొత్తగా ఎం తీస్తాం అనే పరిస్థికి వచ్చేసిన తరుణం లో మల్లి స్వప్న సినిమాస్ అన్ని మంచి శకునములే అనే కుటుంబ కథ చిత్రం తో ముందుకు రావడం ఆశ్చర్యానికి గురిచేసిన విషయం. అయితే కథ పరంగా కొత్తదనం లేకపోయినా అందరికి కనెక్ట్ అయ్యే ఒక కథాంశాన్ని ఎంచుకుని మంచి నటి నటులతో ఆ పాత్రల్ని పోషింపచేసి ప్రేక్షకుణ్ణి ఎంగేజ్ చేయగలిగారు.

కథలో లో కామెడీ ఉన్న కూడా ఎమోషన్ ఈ కథకి వెన్నెముఖ్య లాంటిది, అయితే ఆ ఎమోషన్ ని పక్కన పెట్టి కొంచెంసేపు హీరో హీరోయిన్ ట్రాక్ మీద ఫోకస్ చేయడం కోచెమ్ గాడి తప్పినట్టు అనిపించింది.

సంతోష్ శోభన్ రిషి పాత్రలో అవలీలగా నటించేసాడు, అతను మంచినటుడు అని అందరికి తెలుసు కానీ ఈ రిషి పాత్ర అతనికి ఎంతమాత్రమూ ఛాలెంజ్ ని ఇవ్వదు, ఇక ఆర్య గా మాళవిక నాయర్ బాగా చేసింది, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, గౌతమి , వెన్నెల కిషోర్ అందరూ తమ తమ పాత్రల మేరకు బాగా నటించారు.

ఫ్యామిలి డ్రామా దానికి ఒక ఎమోషన్ ని జోడించి తియ్యడం లో నందిని రెడ్డి నిపుణురాలు, అయితే కథ కొత్తది కాకపోయినా, పాత్రలు వారి మధ్య సంభాషణలు, ఎమోషన్స్ బాగా వర్క్అవుట్ అయ్యాయి అని చెప్పొచ్చు. ఏది ఏమైనా కొన్ని తప్పులు ఉన్నప్పటికీ సగటు ప్రేక్షకుణ్ణి ఎంగేజ్ చేయడం లో విజయం సాధించారు అని చెప్పొచ్చు.

సాంకేతికంగా అన్ని మంచి శకునములు చాల ఉన్నతంగా ఉంటుంది, సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం పెద్ద ప్లస్, ఇక మిక్కీ జె మేయర్ పాటలు అంతంగా అక్కట్టుకోవు కానీ నేపధ్య సంగీతం చాలా బాగుంది.

మొత్తం మీద అన్ని మంచి శకునములు డీసెంట్ ఫ్యామిలీ డ్రామా.

ప్లస్ పాయింట్లు:

  • ఎమోషన్
  • కామెడీ

మైనస్ పాయింట్లు:

  • ఉహించదగిన కథనం

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి:

 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు